రేపటి నుంచి 4వ విడత బిజేపీ ప్రజా సంగ్రామ యాత్ర

 *మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిపై గురి
*కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి మొదలు కానున్న పాదయాత్ర
 *ప్రారంభ సభకు ముఖ్య అతిథిగా  పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్
*22న పెద్ద అంబర్ పేట ఔటర్ రింగు రోడ్డు సమీపంలో పాదయాత్ర ముగింపు
*ప్రజా సంగ్రామ యాత్ర రూట్ మ్యాప్ ను విడుదల చేసిన బీజేపీ నేతలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈనెల 12 నుండి చేపట్టనున్న 4వ విడత ప్రజా సంగ్రామ యాత్రకు ఏర్పాట్లు సర్వం సిద్ధమయ్యాయి. ఈసారి మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని ప్రాంతాల గూండా బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది. గణేష్, విజయదశమి నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఈసారి పాదయాత్రను 10 రోజులకే పరిమితం చేశారు.   పార్లమెంట్ పరిధి విషయానికొస్తే… కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజ్ గిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల మీదుగా బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది.శనివారంపార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర కోశాధికారి భండారి శాంతి కుమార్, రాష్ట్ర కార్యదర్శి బొమ్మ జయశ్రీ, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్, పాదయాత్ర సహ ప్రముఖ్ లు టి.వీరేందర్ గౌడ్, జిట్టా బాలక్రిష్ణారెడ్డిలతో కలిసి  బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పాదయాత్ర షెడ్యూల్ వివరాలను వెల్లడించారు. బండి సంజయ్ కుమార్ 3వ విడత పాదయాత్ర విఫలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించింది అని తెలుపుతూ..
 అనుమతి లేదని పోలీసులు అబద్దాలాడుతూ పాదయాత్రకు ఇచ్చిన అనుమతిని కూడా రద్దు చేశారు. పాదయాత్రలో ఉన్న బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు. వాహనాలు ధ్వంసం చేశారు. కార్యకర్తలపై దాడి చేసి గాయపర్చారు. అయినప్పటికీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి పాదయాత్రకు అనుమతి తెచ్చుకున్నాం. చివరి మూడు రోజుల్లో చేయాల్సిన పాదయాత్ర లక్ష్యాన్ని ఒకటిన్నర రోజుల్లోనే పూర్తి చేశాం..ఈసారి బండి సంజయ్ 4వ విడత పాదయాత్రను ఈనెల 12 నుండి 22 వరకు మల్కాజ్ గిరి పార్లమెంట్ లో నిర్వహించాలని నిర్ణయించాం.. గణేష్, దసరా నవ రాత్రి ఉత్సవాలను దృష్ట్యా పాదయాత్రను 10 రోజులకే కుదించాం. ఈ పాదయాత్ర మూడు కమిషనరేట్ల పరిధిలో విస్తరించినందున ఆయా కమిషనరేట్లకు పాదయాత్ర వివరాలను అందజేసినం. పాదయాత్ర అనుమతిపై గతంలో రాతపూర్వక అనుమతి ఇవ్వలేదు. ఇప్పటి వరకైతే అనుమతి ఇచ్చినట్లుగానే భావిస్తున్నాం. .ఈనెల 12న కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని చిట్టారమ్మ ఆలయం వద్ద 10.30 గంటలకు బండి సంజయ్ పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభిస్తారు. 11 గంటలకు సమీపంలోని రాంలీలా మైదానంలో ప్రారంభ సభ నిర్వహిస్తాం. ఈ సభకు ముఖ్య అతిథిగా జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ పాల్గొంటారు. .అక్కడి నుండి కూకట్ పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజ్ గిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్పీ నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల గూండా పెద్ద అంబర్ పేట ఔటర్ రింగు రోడ్డుకు సమీపంలో పాదయాత్రను ముగిస్తాం. ముగింపు సభకు జాతీయ స్థాయి నాయకులు హాజరవుతారు. ఎవరనేది త్వరలోనే ప్రకటిస్తాం. అట్లాగే ముగింపు స్థలం ఎక్కడనేది ఇంకా ఖారారు కాలేదు. త్వరలోనే రూట్ కమిటీ ఫైనల్ చేస్తుంది. ఇప్పటి వరకు 40 అసెంబ్లీ నియోజకవర్గాలగుండా పాదయాత్ర  పూర్తి కొనసాగింది. 4వ విడతతో కలిపి మొత్తం 48 అసెంబ్లీ నియోజకవర్గాల్ల పాదయాత్ర పూర్తి కానుంది..అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page