జోరువానతో తడిసి ముద్దయిన జంటనగరాలు
రోడ్లపైకి భారీగా చేరిన వరదనీరు
హైదరాబాద్,సెప్టెంబర్8: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం జోరువాన కురిసింది. పలుచోట్ల రహదారులపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద వర్షపు నీరు నిలిచిపోయింది. ఎర్రగడ్డ, అవి•ర్‌పేట్, యూసుఫ్‌గూడ, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, కొండాపూర్, మాదాపూర్, హైటెక్‌సిటీ, ఖైరతాబాద్, నాంపల్లి, కోఠి, మలక్‌పేట్, చైతన్యపురి, అంబర్పేట్, ముసారాంబాగ్, దిల్‌సుఖ్‌నగర్‌లో భారీ వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో మాన్సూన్ బృందాలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. హైదరాబాద్‌లో గత మూడు రోజుల నుంచి జోరుగా వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం పలుచోట్ల కురిసిన వర్షానికి నగరవాసులు తడిసిమద్దయ్యారు. రహాదారుల పైకి నీరు రావడంతో వాహనాదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు. రాగల మూడు రోజులు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిందిఅసెంబ్లీ, బషీర్‌బాగ్, కోఠి, సుల్తాన్‌బజార్, నాంపల్లి, బోరబండ, అల్లాపూర్, మోతీనగర్, అబిడ్స్ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది.
అలాగే నాంపల్లి, హిమాయత్‌నగర్, నారాయణగూడ, ఖైరతాబాద్ కూకట్పల్లి, హైదర్‌నగర్, ఎర్రగడ్డ, సనత్‌నగర్, ఎస్ఆర్నగర్, ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. యూసుఫ్‌గూడ, మైత్రివనం, అవి•ర్‌పేట., రామంతాపూర్, సైదాబాద్, కంటోన్మెంట్, నేరేడ్?మెట్ , హబ్సిగూడ, ముషీరాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.? రహాదారుల పైకి నీరు రావడంతో వాహనాదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు.భాగ్యనగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం.. స్తంభించిన ట్రాఫిక్?రాగల మూడు రోజులు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాల కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇంటీరియర్ కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తనం ఈ రోజు బలహీనపడిందని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. తూర్పు మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో ఉన్న ఆవర్తన ప్రభావంతో.. తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని సంచాలకులు వెల్లడించారు. అల్పపీడనం సగటు సముద్రమట్టానికి 7.6కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని తెలిపారు. ఇది రానున్న 48గంటల్లో ఉత్తర ఆంధప్రదేశ్ దక్షిణ ఒడిశా తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతం మీదు గా మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రుతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, భోపాల్, గోండియా, జగదల్పూర్, కళింగపట్నం మీదుగా.. తూర్పు ఆగ్నేయ దిశగా పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రాంతానికి వెలుతుందని వాతావరణ కేంద్ర సంచాలకులు వివరించారు.అసలే వర్షాకాలం.. ఇక ఈ నాలాల నీటి వల్ల దోమలు ఎక్కువవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికే వైరల్, టైఫాయిడ్, డెంగీ జ్వరాలతో సతమతమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పొంగుతున్న నాలాల వల్ల మరిన్ని సమస్యలు ఎదుర్కొంటున్నామంటున్నారు. అధికారులు దీనికి శాశ్వత పరిష్కారం చూపి తమను రోగాల బారిన పడకుండా కాపాడాలని వేడుకుంటున్నారు.