దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు
తెలంగాణలోనూ సోదాలు చేపట్టినట్లు సమాచారం
న్యూ దిల్లీ, సెప్టెంబర్ 6 : దిల్లీ ప్రభుత్వ లిక్కర్ విధానంలో అవకతకవకల కేసులో ఈడీ దూకుడు పెంచింది. తాజగా దేశవ్యాప్తంగా 30 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్లో సైతం దాడులు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ మంగళవారం ఢిల్లీ సహా గురుగ్రామ్, లక్నో, హైదరాబాద్, ముంబై, బెంగళూరుల్లో 35 చోట్ల సోదాలు జరుపుతోంది. ఈ కేసులో నిందితుడు సర్ మహేంద్రుకు చెందిన ఢిల్లీ నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నాయి. ఈ కేసులో నిందితుడుతైన మనీశ్ సిసోడియా నివాసం, కార్యాలయాలకు ఈడీ అధికారులు రాలేదని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు డియాకు తెలిపాయి. నేపథ్యంలో మనీశ్ సిసోడియా మాట్లాడుతూ, ఈ కేసులో మొదట సీబీఐ సోదాలు చేసిందని, ఏ దొరకలేదని, ఇప్పుడు ఈడీ సోదాలు చేస్తోందని, వారికి కూడా ఏ దొరకబోవని చెప్పారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ చేస్తున్న మంచి పనులను ఆపడం కోసమే ఈ ప్రయత్నమని ఆరోపించారు. సీబీఐ, ఈడీ కోరుకున్నప్పుడు రానివ్వండన్నారు.
తనకు ఎటువంటి సమాచారం లేదని, వాళ్ళు వచ్చినా పాఠశాలల బ్లూప్రింట్లు మాత్రమే వారికి దొరుకుతాయని చెప్పారు. ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ 2021-22 రూపకల్పన, అమలులో అక్రమాలు జరిగినట్లు సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సీబీఐ గత నెలలో మనీశ్ సిసోడియా నివాసంలో తనిఖీలు చేసింది. ఢిల్లీ ఎక్సయిజ్ శాఖ మాజీ కమిషనర్ అరవ గోపీ కృష్ణ కూడా ఈ కేసులో నిందితుడే. గత నెలలో ఏడు రాష్టాల్రు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సుమారు 19 చోట్ల సీబీఐ సోదాలు చేసింది. దిల్లీ ప్రభుత్వ మద్యం కుంభకోణం ఆరోపణల కేసులో తాజాగా దేశవ్యాప్త దాడులు చేపట్టింది. దేశంలోని 30 ప్రదేశాల్లో సోదాలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దిల్లీతో పాటు ఉత్తర్ప్రదేశ్, పంజాబ్, హరియాణ, తెలంగాణ, మహారాష్ట్ర సహా పలు ప్రాంతాల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయని వెల్లడించాయి. మద్యం వర్తకులు ఉండే ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నట్లు తెలుస్తుంది. దిల్లీ, జోర్బాగ్లోని ఇండో స్పిరిట్స్ కంపెనీ ఎండీ సర్ మహేంద్రుకు సంబంధించిన ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయని ఈడీ వర్గాలు తెలిపాయి. ఆయన యూసీఓ బ్యాంకు నుంచి కోటి రూపాయలను ట్రాన్స్ఫర్ చేశారని ఈడీ ఆరోపిస్తోంది.