హైదరాబాద్‌ను కాంగ్రెస్ అభవృద్ధి చేస్తే..రాష్ట్రాన్ని కెసిఆర్ అప్పుల పాలు చేశారు
ప్రజల సమస్యలు తీర్చకుండా బిజెపి, టిఆర్‌ఎస్‌ల మోసం
మునుగోడు ఎప్పటికీ కాంగ్రెస్ కంచుకోట
ఓడించే శక్తి మోడీకి..కేడీకి లేదు
కాంగ్రెస్ నేతలు రేవంత్, ఉత్తమ్, జానా తదితరుల
రెండు ప్రభుత్వాల వైఫల్యాలపై కాంగ్రెస్ చార్జ్‌షీట్
గడపగడపకూ తీసుకుని వెళ్లాలని పార్టీ కార్యకర్తలకు నేతల విజ్ఞప్తి
నల్గొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 : హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే దానికి కాంగ్రెస్ కారణమని, కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ డెవలప్ అయితే..తెలంగాణ వొచ్చాక కేసీఆర్ దందాలు చేసి అప్పుల పాలు చేశారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మునుగోడులో కాంగ్రెస్‌ను ఓడించే శక్తి కేంద్రంలోని మోడీకి లేదు..రాష్ట్రంలోని కేడీకి లేదని అన్నారు. చెప్పుకోవడానికి చరిత్ర లేనోళ్లు…చేయడానికి చరిత్ర లేనోళ్లు..ఇవాళ మతంపేరు వి•ద, ప్రాంతం పేరు వి•ద వివాదాలు సృష్టించి పబ్బం గడుపు కోవాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. మునుగోడులో టీఆర్‌ఎస్ గెలిచినా ఓడినా పోయేదేమి లేదని చెప్పారు. దుబ్బాక, హుజురాబాద్‌లో ఓడితే ఏమైందన్నారు. అటు దుబ్బాక, హుజురాబాద్‌లో గెలిచిన బీజేపీ ఆ నియోజకవర్గ ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి 140 ఏండ్లకు పైగా చరిత్ర ఉందన్నారు. దేశ ప్రజలకు స్వాతంత్య్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ అని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి..ఇక్కడ ప్రజల గోసను తీర్చింది కాంగ్రెస్ అని చెప్పారు. మూడు తరాలు దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబ వారసులం అని..మునుగోడులో కార్యకర్తలు కలిసికట్టుగా పోరాడి పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్‌ఎస్, బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలపై కాంగ్రెస్ చార్జ్‌షీట్ విడుదల చేసింది. కేసీఆర్, మోడీ వి•ద కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి చార్జీషీట్‌ను విడుదల చేశారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయని..వాటిని కేసీఆర్ పట్టించుకోవడం లేదని రేవంత్ మండిపడ్డారు. పోడు భూములు, రైతుల ఇబ్బందులను గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఒక రకమైన పరిహారం, మునుగోడు నియోజకవర్గ నిర్వాసితులకు మరో రకమైన పరిహారం ఇచ్చారని విమర్శించారు. సమస్యలను పరిష్కరించకుండా బీజేపీ, టీఆర్‌ఎస్‌లు మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. తోడేళ్ల మంద, మిడతల దండు లెక్క మునుగోడు నియోజకవర్గం వి•ద బీజేపీ, టీఆర్‌ఎస్‌లు పడుతున్నాయని..రెండు పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇకపోతే ఆగస్టు 15కు ఎంత ప్రాముఖ్యత ఉందో..తెలంగాణాలో సెప్టెంబర్ 17కు కూడా అంతే ప్రాముఖ్యత ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యమ సమయంలో సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించలేదని విమర్శించిన కేసీఆర్..తెలంగాణ వొచ్చాక..8 ఏండ్లలో సెప్టెంబర్ 17ను అధికారికంగా ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. ఆంధ్రా వాళ్ల కవి•షన్లకు కక్కుర్తి పడి కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని ఆరోపించారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని..కేసిఆర్ క్యాబినెట్‌లో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఇన్నేండ్లు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అటు కాంగ్రెస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 నుండి ఏడాది పాటు వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ ఎన్నో పదవులు ఇచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. 2009లో రాజగోపాల్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిందని.. ఓడిపోతే ఎమ్మెల్సీగా గెలిపించిందన్నారు. ఎమ్మెల్సీగా ఉండగానే..ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందన్నారు. కానీ ప్రజలు వేసిన 97 వేల వోట్లను మోడీకి 22 వేల కోట్లకు రాజగోపాల్ రెడ్డి అమ్ముకున్నాడని ఆరోపించారు. రాజీనామా చేస్తే నిధులు వొస్తాయని రాజగోపాల్ రెడ్డి అన్నారని..రాజీనామా తర్వాత మునుగోడు నియోజకవర్గంలో ఎన్నిగ్రామాల్లో రోడ్లేశారని ప్రశ్నించారు. రైతుల రుణమాఫీ అయిందా అని అడిగారు. రాజీనామాతో రాజగోపాల్ రెడ్డి మాత్రమే లాభపడ్డారని మండిపడ్డారు.
మునుగోడు నియోజకవర్గంలో నేతల కొనుగోళ్లు జరుగుతున్నాయన్నారు. మునుగోడులో నేతల అమ్మకాలు తప్ప అభివృద్ధి శూన్యమని చెప్పారు. పార్టీ మారిన నేతలను గ్రామాల్లోకి రాకుండా అడ్డుకోవాలని సూచించారు. 2018లో కాంగ్రెస్‌కు 97వేల వోట్లు వొచ్చాయని రేవంత్ రెడ్డి చెప్పారు. మన వోట్లు మనకే పడేలా కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ప్రతీరోజూ రెండు గంటలు కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామాలు, బస్తీల్లో తిరగాలని కోరారు. సమస్యలపై ప్రజలకు వివరించాలని..కాంగ్రెస్ వొస్తే లాభమేందో చెప్పాలన్నారు. ప్రజల సమస్యలపై కొట్లాడాలని..చిత్తశుద్ధితో పనిచేస్తే నూటికి నూరు శాతం కాంగ్రెస్ 40 వేల వోట్ల మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టు కార్యకర్తలు కాంగ్రెస్‌కు అండగా నిలవాలని కోరారు. నాయకులు ఎటు పోయినా..ఈ ప్రాంత చరిత్ర తెలిసిన కమ్యూనిస్టు కార్యకర్తలు ఆలోచించాలన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌తో పాటు ప్రజలను మోసం చేయడం వల్లే ఉప ఎన్నిక వొచ్చిందని ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మునుగోడులో జరిగిన కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో బీజేపీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వాల వైఫల్యాలపై ఛార్జ్ షీట్‌ను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు విడుదల చేశారు. మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోట అన్న ఉత్తమ్ కుమార్..బీజేపీలో చేరితే మునుగోడు ఎలా అభివృద్ధి చెందుతుందో చెప్పా లని డిమాండ్ చేశారు. 8 ఏండ్లలో జరగని అభివృద్ధి ఇప్పుడెట్లా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ సర్కారు ప్రజల కోసం చేసిందేవి• లేదని ఉత్తమ్ ఆరోపించారు. టీఆర్‌ఎస్, బీజేపీ మోసాలపై విడుదల చేసిన ఛార్జ్ షీట్ ప్రతి ఇంటికీ చేరాలని అన్నారు.
పెండింగ్ ప్రాజెక్టులు, భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వకపోవడం, డిగ్రీ కాలేజీల ఏర్పాటు హావి•, పోడు భూముల సమస్యపై నిర్లక్ష్యం, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల హావి•, ప్లోరైడ్ సమస్య తదితర అంశాలపై ప్రజలను టీఆర్‌ఎస్ ఎలా మోసం చేసిందో ప్రజలకు వివరించాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. ఎనిమిదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసిన అభివృద్ధి ఏవి• లేదన్నారు. మునుగోడు గడ్డపై మరోసారి కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, టీఆర్‌ఎస్ పాలనపై విడుదల చేసిన ఛార్జ్ షీట్‌ను కాంగ్రెస్ సైన్యం మునుగోడు నియోజకవర్గంలో గడపగడపకూ తీసుకెళ్లాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోట అన్న ఉత్తమ్ కుమార్.. బీజేపీలో చేరితే మునుగోడు ఎలా అభివృద్ధి చెందుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. 8 ఏండ్లలో జరగని అభివృద్ధి ఇప్పుడెట్లా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.