‌తెలంగాణ అభివృద్ధి పధకాలు, విధానాలే టి.ఆర్‌.ఎస్‌. ‌పార్టీకి శ్రీ రామ రక్ష

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు పట్టం కడతారు అందులో సందేహం లేదు ఎందుకంటే ఈ ఎనిమిదేళ్ల సమయంలో చేసిన అభివృద్ధి పధకాలే మళ్లి టి.ఆర్‌.ఎస్‌ ‌కు శ్రీ రామ రక్ష. ఒక ప్రాంతీయ పార్టీ విధానాలు దేశంలో కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఆచరణలో తెలంగాణ పధకాలు, విధానాలను అమలు పరుస్తున్నయంటే వాటి ప్రభావం ఎంత ఉందో తెలుస్తుంది. ఈ ఎనిమిదేళ్ల స్వల్ప వ్యవధిలోనే తెలంగాణ స్థిరమైన ఆర్థిక ప్రగతిలో మెరుగైన రాష్ట్రంగా అవతరించింది. నేడు దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు స్థాయిలో ఉంది, అలాగే తలసరి విద్యుత్‌ ‌వినియోగంలోనూ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ధాన్యం కొనుగోళ్లలో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. నిరంతర ఉచిత విద్యుత్‌, ‌రైతు బంధు, రైతు బీమా, రుణ మాఫీ వంటి వినూత్న పథకాలు, విప్లవాత్మక సంస్కరణలతో వ్యవసాయరంగం సుసంపన్నమైంది. దేశానికి తెలంగాణ అన్నపూర్ణగా నిలిచింది. విద్య, వైద్య రంగాల్లోనూ ముందంజలో ఉంది.
ఎనిమిదేళ్ల స్వల్పకాలంలో రాష్ట్రం సాధించిన ప్రగతిని విశ్లేషించుకుంటే ఘన విజయాలెన్నో ఉన్నాయి, అసలు తెలంగాణ అవతరించే నాటికి, నేటి ప్రస్తుత స్థితిగతులకు అసలు పోలికే లేదని చెప్పాలి ఎందుకంటే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలో లేని పురోగతి నేడు కనిపిస్తుంది, ఈ విషయాన్ని ప్రతి పక్షాలు కూడా అంగీకరించాల్సిందే. దేశంలో తెలంగాణ రాష్ట్రం నేడు అభివృద్ధిలో పధంలో ముందుకు పయనిస్తుంది. నేడు తెలంగాణాలో కరెంటు కష్టాలను అధిగమించి 24 గంటల విద్యుత్‌ ‌సరఫరా, వ్యవ సాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌, ‌మిషన్‌ ‌భగీరథ, రైతు రుణమాఫీ, మిషన్‌ ‌కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, రైతు బంధు, రైతు బీమా, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, దళిత బంధు, డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్లు,  చేప పిల్లల పెంపకం, గొర్రెల పంపిణీ, సెలూన్లు, దోబీ ఘాట్లకు ఉచిత విద్యుత్‌, ‌గురుకుల విద్యాలయాల ఏర్పాటు వంటి పథకాలు, కేసీఆర్‌ ‌కిట్‌, ‌బస్తీ దవాఖానాలు, పల్లె/పట్టణ ప్రగతి, టీఎస్‌-ఐపాస్‌, ‌భూరికార్డుల ప్రక్షాళన, ధరణి కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇచ్చాయి. ఎనిమిదేళ్లలో పారిశ్రామిక, ఐటీ రంగాలు పరుగులు తీసి, తెలంగాణ మేటిగా నిలిచింది. ప్రపంచ దిగ్గజ కంపెనీలకు మన రాష్ట్రం గమ్య స్థానంగా నిలిచింది. అంకుర సంస్థల వేదికలైన టీహబ్‌, ‌వీహబ్‌ ‌దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలైన యాపిల్‌, ‌గూగుల్‌, అమెజాన్‌, ‌మైక్రోసాఫ్ట్, ‌ఫేస్‌బుక్‌ ‌తమ కార్య కలాపాలను విశ్వనగరమైన హైదరాబాద్‌లో విస్తృతపరిచాయి. సేల్స్‌ఫోర్స్, ఉబర్‌, ‌మైక్రాన్‌, ‌స్టేట్‌ ‌స్ట్రీట్‌, ‌ఫియట్‌ ‌క్రిజ్లర్‌, ‌మాస్‌, ఇం‌టెల్‌, ‌ప్రావిడెన్స్, ‌యూబీఎస్‌, ఎం‌ఫసిస్‌, ‌పెప్సీ, లిగాటో, ఎఫ్‌5‌లు కూడా ఏర్పాటయ్యాయి. ప్రభుత్వం-నాస్కామ్‌ ‌భాగ స్వామ్యంతో ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్ ‌హబ్‌గా హైదరాబాద్‌ ‌నిలిచింది. నాస్కామ్‌ అం‌చనాల ప్రకారం జాతీయస్థాయిలో 2020-21 సంవత్సరాల్లో ఐటీ రంగంలో ఉపాధి పొందిన వారి సంఖ్య 1.38 లక్షలు. దీని ప్రకారం ఐటీ రంగంలో జాతీయ స్థాయిలో 33 శాతం ఉపాధి కల్పనకు తెలంగాణ భాగస్వామ్యాన్ని అందించింది. వరంగల్‌, ‌ఖమ్మం, కరీంనగర్‌, ‌నిజామాబాద్‌ ‌వంటి ద్వితీయ శ్రేణి నగరాలకు ప్రభుత్వం ఐటీ పరిశ్రమను విస్తరింపజేస్తోంది. తెలంగాణ ఐటీ ఎగుమతుల మొత్తం విలువ రూ. 1,45,522 కోట్లు. 2020-21 గణాంకాల మేరకు కొత్తగా 46 వేలపై చిలుకు ఉద్యోగాలను ఏటేటా పెంచుతూ దాదాపు 6, 28,615 మంది ఈ రంగంలో పనిచేసేందుకు దోహదపడింది.
తెలంగాణలో నీటిపారుదల రంగానికి వస్తే, ప్రపంచంలోని ఎత్తిపోతల ప్రాజెక్టుల్లో అతి పెద్దదైన కాళేశ్వరం బహుళ దశల భారీ ఎత్తిపోతలను ప్రభుత్వం రికార్డు సమయంలో నిర్మించింది. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, ‌భీమా, ఎల్లంపల్లి, మిడ్‌ ‌మానేరు, దేవాదుల తదితర పెండింగ్‌ ‌ప్రాజెక్టుల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసింది. ఒకప్పటి కరవు జిల్లా పాలమూరు పచ్చల హారంగా మారింది. నాగార్జున సాగర్‌, ‌శ్రీరామ సాగర్‌, ‌నిజాం సాగర్‌ ‌తదితర పాత ప్రాజెక్టుల కాల్వలను ప్రభుత్వం ఆధునికీకరించింది. మిషన్‌ ‌కాకతీయ పధకంతో 46,531 చెరువులను పునరుద్ధరించగా 15 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది, తద్వారా భూగర్భ జలమట్టం కుడా గణనీయంగా పెరిగింది, జీవవైవిధ్యం కూడా పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా నదులు, వాగులు, వంకల పునరుజ్జీవం కోసం రూ. 3,825 కోట్ల వ్యయంతో 1200 చెక్‌డ్యాంల నిర్మాణం జరుగుతోంది. పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, డిండి, గట్టు ఎత్తిపోతల, చనాకా-కొరాట తదితర ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొత్తం రూ.1.52 లక్షల కోట్లు వెచ్చించి సాగునీటి పారుదల సౌకర్యాలను మెరుగుపరిచింది.
వైద్య, ఆరోగ్య రంగంలోనూ రాష్ట్రం గణనీయమైన పురోగతిని సాధించింది. ఆరోగ్యశ్రీని ప్రభుత్వం మరింత అందుబాటులోకి తెచ్చి, రాష్ట్ర రాజధాని నలుమూలలా సూపర్‌ ‌స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి శ్రీకారం చుట్టి, హైదరాబాద్‌లో 256 బస్తీ దవాఖానాలను ప్రారంభించి వాటిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. ప్రభుత్వాసుపత్రుల్లో రోగ నిర్ధారణ, ఆక్సిజన్‌ ‌పడకలతో పాటు నలభై ఉచిత డయాలసిస్‌ ‌కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఖమ్మం, వరంగల్‌, ఆదిలాబాద్‌లలో గుండె శస్త్రచికిత్సల కోసం క్యాథ్‌ ‌ల్యాబ్‌ ‌సేవలు ప్రారంభించింది. జిల్లా ఆసుపత్రుల్లోనూ మోకీలు మార్పిడి ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఆరోగ్య శ్రీ పథకం గరిష్ఠ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచింది. మారుమూల గ్రామాల నుంచి గర్భిణులను ప్రభుత్వాసుపత్రులకు తరలించేందుకు, ప్రసవానంతరం ఇంటికి చేర్చేందుకు 300 అమ్మఒడి వాహనాలు, ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, శిశువులకు ప్రతిరోజూ పాలు, గుడ్లతో కూడిన పౌష్టికాహారం అందుతోంది. మాతా శిశు సంక్షేమం కోసం అమలు చేస్తున్న కేసీఆర్‌ ‌కిట్‌ ‌పథకం ద్వారా మగ శిశువుకు జన్మనిచ్చిన తల్లికి రూ. 12 వేలు, ఆడ శిశువుకు జన్మనిచ్చిన తల్లికి రూ. 13 వేల చొప్పున ఆర్థిక సహాయం అందుతోంది.
భారత ఆర్థిక సర్వే 2020-21, కరోనా సృష్టించిన సంక్షోభం నుంచి అతి త్వరగా తెలంగాణ కోలుకున్నదని అభినందించడం తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణా దక్షతకు దక్కిన గుర్తింపు. 2013-14లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్ర జిఎస్‌డిపి 5,5,849 కోట్ల రూపాయలు కాగా, 2021-22 నాటికి 11,54,860 కోట్ల రూపాయలకు చేరింది. తలసరి ఆదాయం పెరుగుదలలో కూడా తెలంగాణ రాష్ట్రం రికార్డు సాధించింది. 2014-15లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1,24,104 కాగా, 2021-22 నాటికి 2,78,833 రూపాయలకు పెరిగింది. జాతీయ సగటు ఆదాయమైన 1,49,848 రూపాయలకంటే ఇది 86 శాతం అధికం. జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రోజురోజుకూ పెరుగుతుండటం అభివృద్ధికి కొలమానం.
దళితులను ఆర్థికంగా బలోపేతం చేసి, సామాజిక వివక్ష నుంచి వారికి విముక్తి కలిగించాలని, దళితులంతా స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలన్నదే ప్రభుత్వ సంకల్పం అందులో భాగంగా సమాజంలో అనాదిగా అణగారిన దళితజాతి అభ్యు న్నతికి పాటుపడటమే ధ్యేయంగా, దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా, తెలంగాణ రాష్ట్రం దళితబంధు పథకాన్ని ప్రారంభించి అమలు పరచి, ఈ పథకం కింద ప్రభుత్వం ప్రతి దళిత కుటుం బానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నది. దళితబంధు పథకం కింద ఇప్పటికే చాలామంది దళితులు స్వయం ఉపాధి మార్గాన్ని చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితు లందరికీ దశలవారీగా దళితబంధు ప్రయోజనాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. ఇక దళిత బంధు పథకం ద్వారా అందించే ఆర్థిక సాయానికి అదనంగా ప్రభుత్వం లబ్ధిదారుల భాగ స్వామ్యంతో ‘దళిత రక్షణ నిధి’ కూడా ఏర్పాటు చేస్తున్నది. దళితబంధు ద్వారా లబ్ధిపొందిన కుటుంబం కాలక్రమంలో  ఏదైనా ఆపదకు గురైతే, ఆ కుటుంబం ఆ ఆపద నుండి తేరుకొని తిరిగి ఆర్థికంగా, మరింత పటిష్టంగా నిలదొక్కుకోవడానికి ఈ నిధి ఎంతగానో దోహద పడుతుంది.
ఈ విధంగా పలు నూతన సంక్షేమ పధకాలు, విధానాలకు ప్రారంభించి, విజయవంతంగా అమలు పరుస్తూ ప్రజల అన్ని వర్గాల మన్ననలు అందుకుంటున్న టి.ఆర్‌.‌యస్‌ ‌పార్టీని కాదని ఇతర పార్టీలకు పట్టం గట్టె ఆలోచనలో నేటి ప్రజలు లేరని మేధావుల అభిప్రాయం, ఎందుకంటే ప్రతి పక్షాలు ప్రజల్లో వ్యతిరేకత ఉందని లేని పోనీ మాటలతో ప్రజలని మభ్య పెట్టేలా చేస్తున్నా, వచ్చే ఎన్నికల్లో తప్పకుండా మళ్ళి టి.ఆర్‌.ఎస్‌ ‌పార్టీనే గెలిపిస్తారు, తెలంగాణా ఆవిర్భావం నుండి చేసిన అభివృద్ధి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. కాంగ్రెస్‌, ‌బి.జే.పి లాంటి జాతీయ పార్టీలు ఎంత ప్రచారం చేసినా వారికీ ప్రభుత్వం ఏర్పాటు చేసేంత ప్రభావం ఉండదు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణాకి చేసిన చేస్తున్న అన్యాయాన్ని ప్రశించాలన్న, అరవై ఏళ్ళ కాంగ్రెస్‌ ‌పాలన తిరిగి రాకుండా టి.ఆర్‌.ఎస్‌ ‌పార్టీకే సాధ్యం. దేశంలో అతి ప్రభావంతమైన ప్రాంతీయ పార్టీ టి.ఆర్‌.ఎస్‌ ‌దేశ రాజకీయాల్లో భవిష్యత్తులో కీలక పాత్ర పోహిస్తుంది, అలాంటిది వచ్చే ఎన్నికల్లో తిరిగి మూడో సారి అధికారంలో రావటం చాలా చిన్న విషయం.
ప్రస్తుత సమయంలో ముందస్తు ఎన్నికలు వెళ్ళినా, లేక నిర్ణీత కాలంలోనే ఎన్నికలు వెళ్ళినా గెలిచే ఏకైక పార్టీ టి.ఆర్‌.ఎస్‌. ‌పార్టీ. కె.సి.ఆర్‌ ‌పాలనా దక్షత, అనుభవం మూడో సారి అధికారం రావటానికి మరింత దోహదపడతాయి. మాటలతో కాకుండా, చేతలతో మాత్రమే పని చేసే తెలంగాణా ప్రభుత్వం మూడో సారి అధికారం రావటం నేటి పరిస్థుతులలో అవసరం. దేశ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిని, ఆకలి సూచిక, పేదరికం, నిరుద్యోగం, లాంటి సామజిక ఆర్ధిక సమస్యలు మరింత పెరుగుతున్న ఈ సమయంలో, అసమర్థ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మరియు ఇతర జాతీయ పార్టీల కంటే రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలకే పట్టం కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణా ప్రభుత్వం అమలు పరచిన విధానాలు, పధకాలు టి.ఆర్‌.ఎస్‌. ‌పార్టీకి శ్రీరామ రక్ష.
image.png
జి. రాజేష్‌
‌పరిశోధక విద్యార్ధి,
ఉస్మానియా యూనివర్సిటీ,
హైదరాబాద్‌, 96035 79115

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page