- జాతీయ జెండాలు సరఫరా చేయలేరా..?
- కిషన్రెడ్డి తీరుపై మంత్రి హరీష్రావు ఫైర్
సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 10: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తీరుపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు ఫైర్ అయ్యారు. వజ్రోత్సవ వేడుకల వేళ కేంద్ర ప్రభుత్వ తీరును మంత్రి హరీష్రావు తప్పుబట్టారు. దేశంలో చాలా చోట్ల జాతీయ జెండాలను కేంద్ర ప్రభుత్వం అందించలేకపోయిందన్నారు. దీనికి తోడుగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి జాతీయ జెండాలను ఇవ్వలేని పరిస్థితి నెలకొందనీ, జెండా కాగితాలు అంటించుకోవాలని చెప్పడం సిగ్గు చేటన్నారు. దేశంలో చాలా చోట్ల జాతీయ జెండాలు కేంద్రం సరఫరా చేయలేక, అందజేయలేక పోతున్నామని, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఇవ్వలేని పరిస్థితి నెలకొందని, కాగితాలు అంటించుకోవాలని చెప్పడం సిగ్గుచేటుగా, అవమానకరంగా ఉన్నాయని, ఇదేనా వజ్రోత్సవాలు జరుపుకునే తీరు, ఇదేనా జాతీయ జెండాకు మీరిచ్చే విలువ అంటూ.. కేంద్రం తీరును మంత్రి హరీష్రావు తప్పుబట్టారు. విమర్శించారు.
బుధవారం సిద్ధిపేట శివారులో గల రంగనాయక సాగర్లో ఫ్రీడమ్ పార్కును జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, మున్సిపల్ మాజీ ఛైర్మన్ రాజనర్సు, సుడా ఛై•ర్మన్ రవీందర్రెడ్డిలతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో 75సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నదని మంత్రి హరీష్రావు చెప్పారు. వజ్రోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నామని, ఇవాళ హరిత వనోత్సవం పేరిట సిద్ధిపేట పట్టణ శివారు రంగనాయక సాగర్ వద్ద ఫ్రీడమ్ పార్కు ప్రారంభం చేసుకోవడం సంతోషకరమైన విషయంగా తెలిపారు. మేకిన్ తెలంగాణ పేరిట తయారు చేసి ఇంటింటికీ ఇస్తున్నట్లు, చేనేత కార్మికులకు ఉపాధి కల్పించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1 కోటి 20 లక్షల జెండాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
గాంధీ బాటలో ప్రపంచం నిడిచిందంటూ..స్వాతంత్య్ర ఫలాలు పొంది ఎన్నో విజయాలు సాధించారని, కానీ గాంధీజీని అవమాన పరుస్తూ..గాడ్సేను పొగిడే సంస్థలను తరిమికొట్టాలని, అలాంటి సంస్థల నుంచి దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అలాంటి సంస్థలపై చర్యలు తోసుకోవడం లేదని, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భావి భారత పౌరులకు సినిమా టాకీసులలో దేశభక్తిని పెంపొందించేలా దేశభక్తి చాటేలా స్వాతంత్య్ర సమరయోధులు చిత్రాలను ప్రదర్శించి చూపుతున్నట్లు తెలిపారు. స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో ప్రతీ పౌరుడు స్వచ్ఛందంగా పాల్గొనాలని మంత్రి హరీష్రావు పిలుపునిచ్చారు.