తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ‌లలిత్‌

  • అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం
  • 27న సుప్రీమ్‌ ‌కోర్టు నూతన సిజె ప్రమాణ స్వీకారం

న్యూ దిల్లీ, అగస్ట్ 10 : ‌భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఎవరన్న దానిపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. సుప్రీంకోర్టు 49వ సీజేగా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేష్‌ ‌లలిత్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. సుప్రీంకోర్టు 49వ భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉదయ్‌ ఉమేష్‌ ‌లలిత్‌ను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారంనాడు నియమించారు. ఈ ఆగస్టు 27వ తేదీ నుంచి ఆయన నియామకం అమలులోకి వస్తుంది. కొత్త సీజేఐ పేరును సిఫారసు చేయాలని కోరుతూ ఆగస్టు 3వ తేదీన కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ ‌రిజిజు సీజేఐ సెక్రటేరియట్‌కు లేఖ పంపారు. ఆ మరుసటి రోజే సీజేఐ ఎన్‌.‌వి.రమణ సుప్రీంకోర్టులో సెకెండ్‌ ‌సీనియర్‌ ‌మోస్ట్ ‌జడ్జి అయిన యూయూ లలిత్‌ ‌పేరును సిఫారసు చేసారు. ఈనెల 26వ తేదీతో సీజేఐ ఎన్‌వీ రమణ పదవీ కాలం ముగుస్తోంది. అయితే సీజేఐ లలిత్‌ ‌పదవీ విరమణ వ్యవధి కూడా మూడు నెలల కంటే తక్కువగా ఉంది.

2022 నవంబర్‌ 8‌న ఆయన రిటైర్‌ ‌కావాల్సి ఉంది. 2014, ఆగస్టు 13న సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన పదోన్నతి పొందారు. దీనికి ముందు సుప్రీంకోర్టు సీనియర్‌ అడ్వకేట్‌గా ఆయన ఉన్నారు. యూయూ లలిత్‌ ‌తండ్రి యూఆర్‌ ‌లలిత్‌ ‌సైతం సీనియర్‌ అడ్వకేట్‌. ‌ముంబై హైకోర్టు అడిషనల్‌ ‌జడ్జిగా ఉన్నారు. ఆయన పేరును ప్రస్తుత సీజేఐ ఎన్వీ రమణ ప్రతిపాదించారు. దీనికి సంబంధించిన లేఖను సీజేఐ కేంద్ర న్యాయ శాఖకు పంపగా.. అక్కడి నుంచి దాన్ని ప్రధాని కార్యాలయానికి పంపారు. పీఎం మోదీ ఆమోదం తర్వాత రాష్ట్రపతి పేషీకి వెళ్లింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 49వ సీజేఐగా ఉదయ్‌ ఉమేష్‌ ‌లలిత్‌ ‌నియామకానికి అనుమతి ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ ఈ నెల 26న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో 27న ఉదయ్‌ ఉమేష్‌ ‌లలిత్‌ ‌ప్రమాణస్వీకారం చేయనున్నారు. జస్టిస్‌ ‌లలిత్‌ ‌పదవీ కాలం కేవలం మూడు నెలలు మాత్రమే ఉంది. నవంబర్‌ 8‌న ఆయన పదవీవిరమణ కానున్నారు. 1957 నవంబర్‌ 9‌న జస్టిస్‌ ఉదయ్‌ ఉమేష్‌ ‌లలిత్‌ ‌జన్మించారు. 1983 జూన్‌లో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ ‌మొదలుపెట్టారు. 1985 డిసెంబర్‌ ‌వరకు బొంబాయి హైకోర్టులో పనిచేసిన ఆయన.. 1986 జనవరి నుంచి సుప్రీంకోర్టులో ప్రాక్టీసు మొదలు పెట్టారు. 2014 ఆగస్టు 13న యూయూ లలిత్‌ ‌సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. అప్పటి నుంచి అనేక కీలక తీర్పులు ఇచ్చారు. దేశంలోనే తీవ్ర సంచలనం సృష్టించిన త్రిపుల్‌ ‌తలాక్‌తోపాటు అనేక కీలక తీర్పుల్లో ఆయన భాగస్వామిగా ఉన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page