- తెలంగాణ కాంగ్రెస్‌లో అరాచక పరిస్థితులు
- సోనియా, రాహుల్ ఆశయాలకు భిన్నంగా రేవంత్ ధోరణి
- ఆయన చర్యలను ప్రశ్నించే వారు లేకుండా కుట్రలు
- మాఫియా తరహా రాజకీయాలు
- అందుకే పార్టీని వీడుతున్నా
- పార్టీకి రాజీనామా సందర్భంగా కాంగెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్
- సీనియర్ల బుజ్జగింపులకు లొంగని దాసోజు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 5 : కాంగ్రెస్ పార్టీ నుంచి మరో బిగ్ వికెట్ పడిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించి రెండు రోజులు గడవకముందే పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వి•డియా సమావేశంలో వెల్లడించారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్‌లో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని, బానిస బతుకు బతకడం ఇష్టంలేకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు దాసోజు శ్రవణ్ వెల్లడించారు. ఈమేరకు వి•డియాతో ఆయన మాట్లాడారు. సోనియా తెలంగాణ ఇచ్చారనే కృతజ్ఞతతో.. రాహుల్‌గాంధీ 2013లో జరిగిన జైపూర్ చింతన్ శిబిర్‌లో రాహుల్ ప్రసంగం విని ఉత్తేజితుడై 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరా.
రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత.. కాంగ్రెస్ పార్టీలో కులం, ధనం చూసి ప్రాధాన్యత ఇస్తున్నారు. రేవంత్ నాయకత్వలో అరాచక పరిస్థితులు నన్ను కలచివేశాయని తెలిపారు.తెలంగాణ కాంగ్రెస్‌లో మాఫియా తరహా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి పార్టీ కోసం పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. ఇంతవరకు పార్టీ తరఫున సవి•క్షలు గానీ, కమిటీలు గానీ పెట్టడం లేదు. పార్టీ అధికారంలోకి వస్తుందని ఏళ్లనుంచి ఎదురుచూస్తున్నాం. కాంగ్రెస్ కోసం పాటుపడిన మమ్మల్నే బలహీనపరుస్తున్నారు. పార్టీలోకి చేరింది బానిసగా బతకడానికి కాదు. ఎన్నో రోజులుగా బాధలు తట్టుకుంటూ వచ్చాను. కాంగ్రెస్‌ను రేవంత్‌రెడ్డి ప్రైవేట్ పాపర్టీగా మార్చుతున్నారు. అందుకే కాంగ్రెస్ సభ్యత్వానికి… అన్ని రకాల పదవులకు రాజీనామా చేస్తున్నానని దాసోజు శ్రవణ్ ప్రకటించారు. గత కొంతకాలంగా పీసీసీ వైఖరి పట్ల శ్రవణ్ అసంతృప్తిగా ఉన్నారు.
పీజేఆర్ కుమార్తె విజయరెడ్డి కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి ఆయన అలిగినట్లు పార్టీ వర్గాల సమాచారం. శ్రవణ్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు తెలియగానే ఆ పార్టీ నేతలు కోదండరెడ్డి, మహేశ్‌కుమార్ గౌడ్ కలిసి దాసోజు ఇంటికి చేరుకున్నారు. పార్టీ నుంచి వెళ్లిపోవద్దంటూ బుజ్జగించారు. అయినా ఫలితం దక్కలేదు. తను తీసుకున్న నిర్ణయం మేరకు ఎఐసీసీసీ అధికార ప్రతినిధి పదవికి,కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు దాసోజు శ్రవణ్ ప్రకటించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సిద్దాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని అది చూసి తట్టుకోలేకనే పార్టీని వీడుతున్నట్టు తెలిపారు. రేవంత్ రెడ్డి అగ్రకుల దురహంకారంతో వ్యవహరిస్తు న్నారని.. కాంగ్రెస్‌ను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. హస్తం పార్టీలో అరాచక పరిస్థితులు కొనసాగుతున్నాయని అన్నారు. అలాగే కాంగ్రెస్‌ను ఫ్రాంచైజీగా నడుపుతున్నారని మండిపడ్డారు. తనకు తిరుగు లేదన్న రీతిలో యాన వ్యవహార శైలి ఉందన్నారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక కాంగ్రెస్‌లో కులం, ధనం అన్నట్టుగా మారిపోయిందన్నారు. ప్రశ్నించే వాళ్లను సర్వేల పేరుతో తప్పుడు నివేదికలు ఇస్తూ..సొంత పార్టీ నాయకులను బలహీనపరుస్తున్నారు.
అలాంటి వ్యక్తి నేతృత్వంలో ఇక పనిచేయడం కదురదని గుర్తించే బయటకు వస్తున్నామని అన్నారు. రాహుల్ ఆలోచనకు వ్యతిరేకంగా రేవంత్ కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టిస్తు న్నాడని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. రేవంత్ 24 గంటలు బిజీ అని… ఎవరికీ అందుబాటులో ఉండర న్నారు. పీసీసీ చీఫ్ అగ్రకుల అహంకారంతో వ్యవహరిస్తున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బాధ చెప్పుకునేందుకు పార్టీలో అవకాశం లేదన్నారు. మాణిక్కం ఠాగూర్, రేవంత్, సునీల్ కనుగోలు ముగ్గురూ కుమ్మక్కయ్యారన్నారు. రేవంత్ తప్పులు చేస్తుంటే టాగూర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మాఫియాను నడిపినట్టు పార్టీ నడుపుతున్నారని ధ్వజమొత్తారు. ఏఐసీసీ నుండి పార్టీని రేవంత్ లీజ్ కు తీసుకున్నట్లుగా ఉందన్నారు. రేవంత్ కాంగ్రెస్ పార్టీలో తన సొంత ముఠాను ప్రోత్స హిస్తున్నరని దాసోజు శ్రవణ్ తీవ్రంగా ఆరోపించారు. ఆయన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునేందుకు పార్టీని బలహీన పరుస్తున్నారన్నారు. పార్టీలో ఎవరినీ లెక్కచేయకుండా నిరంకుశంతో వ్యవహరిస్తున్నారని చెప్పారు.
ఏఐసీసీ నుంచి ఫ్రాంచైజీ తెచ్చు కున్నట్టు రేవంత్ వ్యవహరిస్తున్నరని తెలిపారు. రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ ను భ్రష్టుపట్టిస్తున్నారని.. వసూళ్ల పర్వం కోసం రాజకీయాన్ని హస్తగతం చేసుకున్న ట్టుగా ఉందన్నారు. ఏడాదిలో ఎన్నికలు వస్తున్నా జిల్లాల్లో కమిటీలు వేయలేదని..దళిత దండోరా, నిరుద్యోగ నగారా ఏమైందో ఎవరికీ తెలీదన్నారు. టీఆర్‌ఎస్ కు ప్రత్యామ్నంగా కాంగ్రెస్ ఎదగలేక పార్టీ రోజురోజుకు దిగజారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని..పేదోళ్ల గొంతుకగా ఉండాలని ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ వచ్చానని శ్రవణ్ చెప్పారు. జైపూర్ సభలో రాహుల్ ప్రసంగం విని ఆకర్షితుడినై కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యానని తెలిపారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా పార్టీ కోసం అహర్నిశలు పనిచేశానని చెప్పారు.
కానీ పార్టీ సిద్దాంతాలకు రేవంత్ వ్యవహరిస్తుం డటంతో తాను చాలా విసిగిపోయాననని…ఏడాది కాలంగా ఎన్నో నిద్రలేని రాత్రిళ్లు గడిపానని చెప్పారు. తెలంగాణను కేసీఆర్ కబంద హస్తాల నుంచి విముక్తి చేసేందుకు మలిదశ పోరాటం చేస్తానని చెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాటలో ఏఐసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న దాసోజు శ్రవణ్ కూడా పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహారంపై శ్రవణ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రవణ్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు తెలియగానే ఆ పార్టీ నేతలు కోదండరెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్ కలిసి దాసోజు ఇంటికి చేరుకుని బుజ్జగించారు.