- పేట్లబురుజు హాసిటల్‌లో తల్లిపాల బ్యాంక్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
- హాస్పిటళ్ల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్న మంత్రి
- అందరం కలిసి ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దామని పిలుపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అగస్టు 5 : తల్లిపాలే ముద్దు, డబ్బా పాలు వద్దు అని, తొలి గంటలో శిశువుకు అందే తల్లి పాలు టీకాతో సమానం అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం పేట్ల బురుజు ప్రభుత్వ దవాఖానలో తల్లి పాల బ్యాంక్‌ను ప్రారంభించి మంత్రి మాట్లాడారు. తల్లిపాలు అంత శ్రేష్టమైనది ఏదీలేదు. అవి అమృతంతో సమానం అన్నారు. ప్రతి తల్లీదీనిని గుర్తించాలన్నారు. వీటిని మరి దేంతో పోల్చలేమని మంత్రి స్పష్టం చేశారు. ఎన్‌ఎస్‌యూలో రోజుల తరబడి ఉండే పిల్లలకు తల్లి పాలు అందాలన్న ఉద్దేశంతో పేట్ల బురుజులో మిల్క్ బ్యాంక్‌ను ప్రారంభించామన్నారు. ఆగష్టు 1 నుంచి 7వ తేదీ వరకు ప్రపంచ వ్యాప్తంగా డబ్ల్యూహెచ్‌వో తల్లి పాల వారోత్సవాన్ని జరుపుతుందన్నారు.
తల్లుల్లో అవగాహన పెంచాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. కేవలం 36 శాతం మంది మత్రమే మొదటి గంటలో తల్లి పాలు ఇస్తున్నారు. 64 శాతం మంది పిల్లలు మొదటి గంటలో తల్లి పాలకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లుల్లో అవగాహన లేకపోవడం వల్ల డబ్బా పాలు ఇస్తున్నారు. సీ సెక్షన్ ఆపరేషన్ల వళ్ల ఇది జరుగుతుందన్నారు. నార్మల్ డెలివరీ పట్ల అవగాహన పెంచుకోవాలి. కొద్ది ముంది ముహూర్తం చూసుకొని ఆపరేషన్లు చేయమంటున్నారు. మరి కొద్ది మంది మా బిడ్డ పురిటి నొప్పులు పడలేదు ఆపరేషన్ చేయమని ఒత్తిడి చేస్తున్నారు. ఇవేవి సరైన పద్ధతులు కావన్నారు. వైద్యుల సూచన మేరకే ముందుకెళ్లాలన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సర్పంచ్‌లు గ్రామాల్లో తల్లి పాల వారోత్సవాల ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. తెలంగాణ వొచ్చిన తర్వాత ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల్లో 45 శాతం సి సెక్షన్ జరుగుతుంది. 55 శాతం నార్మల్ డెలివరీలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. మదర్ మోర్టాలిటీ రేట్లో తమిళనాడును అధిగమించామని గుర్తు చేశారు. నార్మల్ డెలివరీ చేస్తే వైద్య సిబ్బందికి 3 వేల రూపాయల ప్రోత్సాం అందిస్తున్నాం. ప్రభుత్వ దవాఖానల్లో అన్ని వసతులు కల్పిస్తున్నాం. వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అందరం కలిసి ఆరో