నిఖ్ఖచ్చితమైన మనస్తత్వంగల నాయకుడు.!

‘‘తెలంగాణ ఉద్యమంలో నీళ్ళు,నిధులు ,నియా మకాలు అనే నినాదంతో ఉమ్మడి కౌరవనీతిలో జరిగిదంతా అన్యాయమేనని నలుచెరుగుల చాటి చెప్పిన ఆచార్య జయశంకర్‌ ‌తన జీవితకాలమంతా ప్రగతిశీల ఉద్యమాలకు ఆదర్శంగా,మానవ సమాజం కోసమే అంకితం చేశారు. ఆయన బాటలో తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవ స్వయంపాలనకై  దశాబ్దాలుగా జరిపిన పోరాటాలను,అనుభవాలను పరిగణలోకి తీసుకొని తెలంగాణ సాధనోద్యమంలో భావజాల వ్యాప్తిని కార్యాచరణ గావించడంలో సఫలీకృతులయ్యారు.’’

తెలంగాణ ఉద్యమంలో నీళ్ళు,నిధులు ,నియా మకాలు అనే నినాదంతో ఉమ్మడి కౌరవనీతిలో జరిగిదంతా అన్యాయమేనని నలుచెరుగుల చాటి చెప్పిన ఆచార్య జయశంకర్‌ ‌తన జీవితకాలమంతా ప్రగతిశీల ఉద్యమాలకు ఆదర్శంగా,మానవ సమాజం కోసమే అంకితం చేశారు. ఆయన బాటలో తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవ స్వయంపాలనకై  దశాబ్దాలుగా జరిపిన పోరాటాలను,అనుభవాలను పరిగణలోకి తీసుకొని తెలంగాణ సాధనోద్యమంలో భావజాల వ్యాప్తిని కార్యాచరణ గావించడంలో సఫలీకృతులయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాన్ని అభివృద్ధి, ఆత్మ గౌరవ పోరాటంగా చాటి చెప్పారు.తొలి దశ పోరాటం నుంచి యుద్ధభూమిలో ఎందరో బిడ్డల్ని కోల్పోయి, తెలంగాణ తల్లి రోధిస్తున్న సమయంలో ఈ అక్రంధనల వెనుక రాజకీయ అధికారాన్ని అడ్డం పెట్టుకొని యధేచ్చగా సీమాంధ్ర పెత్తందారులు సాగిస్తున్న దోపిడి ఉందని గ్రహించి, దీని వెనక 60 ఏండ్ల అణిచివేత ఉందని,అణగారిన వర్గాల వ్యతలు ఉన్నవని అర్థం చేసుకొని నిలదీసి నిగ్గు తేల్చేందుకు తెలంగాణ ప్రజలల్లో రాజకీయ చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ సిద్దాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ 6,ఆగస్టు 1934 వరంగల్‌ ‌జిల్లా ఆత్మకూర్‌ ‌మండలం, అక్కంపేట గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు.
కొత్తపల్లి జయశంకర్‌ ‌విద్యార్థిదశ నుంచి కూడా  మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి, నిర్మాణాత్మకమైన, నిఖ్ఖచ్చితమైన మనస్తత్వంగల నాయకుడు, తెలంగాణలో జరుగుతున్న ఆంధ్ర వలసవాదుల, సమైక్యవాదుల దోపిడి నుండి తెలంగాణ రాష్ట్రం విముక్తి కోసం కంకణం కట్టుకున్న విద్యావేత్త. మా వనరులు మాకున్నాయి, మావనరులపై మాకు అధికారం కావాలని ప్రశ్నించిన వ్యక్తి జయశంకర్‌, ‌తెలంగాణ ప్రజలు ఇంకా ఎన్నాల్లు యాచించాలనే ఒక కసి, పట్టుదలతో 1952లో నాన్‌ ‌ముల్కీ, ఇడ్లీ, సాంబర్‌ ‌గోబ్యాక్‌ ఉద్యమంలో పాల్గొన్నారు .తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని విద్యావంతులు, మేధావులు ప్రతిఘటించాలని ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని విద్యావంతులమైన మనం గళం విప్పకపోతే ఏలా? మేధావులు సామాజిక బాద్యతను విస్మరించడం క్షంతవ్యం కాదని వక్కానించారు, నాలుగు గోడల మద్యలో కుర్చోని కేవలం నినాదాలతో సమస్యలకు  పరిష్కారం ఉండదని బలంగా నమ్మిన వ్యక్తి, అందుకే సమస్యలకు దారితీసిన కారణాలను సాక్ష్యా ధారాలతో, శాస్త్రీయంగా, గణాంకాలతో నిర్భయంగా, నిర్మోహమాటంగా విశ్లేషిస్తూ, అనేక రచనలు చేస్తూ, జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ రణాన్ని, నినాదాన్ని చాటిచెప్పిన సర్వజ్ఞుడు.
నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్ని రంగాల్లో దగాపడ్డది, ఎత్తున్న తెలంగాణకు నీళ్ళేలా వస్తాయంటూ గతంలో మాట్లాడిన ఒక మంత్రి నీళ్ళ దొంగల నీలుగుడుమీద తెలంగాణలో ఉదయించిన సూర్యుడు కేసీఆర్‌ ‌తో కల్సి పోరాటాన్ని ఉధృతంచేసి, సకలజనులను ఓప్పించి, నిరవధికంగా ఉద్యమాలను చేస్తూ, నాటి కాంగ్రేస్‌ ‌ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి తెచ్చిన ఘనత సూర్య, చంద్రులదే.తెలంగాణ సాధనలో మొక్కవోని ధ్కెర్యంతో ప్రాణాన్ని ఫణ్ణంగా పెట్టి,ఆమరణ నిరాహరదీక్ష చేపట్టిన కేసీఆర్‌ ఆత్మగా, గల్లి నుంచి డిల్లీ వరకు ఉప్పెనలా రగిలించిన ఉద్యమ సంధర్భంలో,కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి, 9వ,డిశంబర్‌ 2009. ‌తెలంగాణ ప్రకటన చేయక తప్పలేదు,తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంబిస్తున్నట్లు చిదంబరం పేర్కోనడంతో  ఖంగుతిన్న సమైక్యవాదులు, ఆనాటీ సీమాంధ్ర మంత్రులు, తెలంగాణ రాష్ట్ర ప్రకటనను జాతి వ్యతిరేకమైనది గా, దేశ ద్రోహంగా ‘కాగ్నిజబుల్‌ అఫెన్స్’ ‌గా పేర్కోనడం, తదుపరి జరిగిన పరిణామాలతో  23 డిసెంబర్‌ ‌లో మరొక ప్రకటన చేసి శ్రీకృష్ట  కమిటీ రూపంలో తెలంగాణ ప్రజలను గాయపరిచింది.
జయశంకర్‌ ‌మరణం తర్వాత  కేసీఆర్‌ ‌నాయకత్వంలో 2011 నుంచి  ఐక్య కార్యచరణ సమితి (జేఏసీ) ఏర్పాటు చేసుకొని సకల జనులు భాగస్వామ్యంతో తెలంగాణ పోరాటాన్ని ఉధృతంచేసి, నిరవధికంగా ఉద్యమాలను చేస్తూ, కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి తెచ్చిన ఫలితంగా 2014, ఫిబ్రవరి 18న ఆంధ్రప్రదేశ్‌ ‌పునర్వ్యవస్థీకరణ బిల్లుకు లోకసభ ఆమోదం పొందింది.2014 పిభ్రవరి 20న రాజ్యసభ బిల్లుకు యధాతథంగా మూజువాణీ వోటుతో అమోదముద్ర పడింది. 2014 జూన్‌ 2 ‌నాడు దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది. సారు కలల తెలంగాణ ఏర్పడింది.1969 ఉద్యమానికి, కేసీఆర్‌ ‌నాయకత్వంలో జరుగుచున్న ఉద్యమానికి తేడా ఉందని జయశంకర్‌ ‌సంతోషం వ్యక్తం చేసినారు, ఒకానోక సందర్భంలో సమావేశంలో మాట్లాడుచూ ‘‘అబ్తో ఏకీ హీ ఖ్వాయిష్‌ ‌హై, ఓ తెలంగాణ దేఖ్నా మర్‌ ‌జానా’ (ఇప్పుడ్కెతే నాకు ఒకే ఒక కోరిక మిగిలింది తెలంగాణ ఏర్పాటు కళ్ళారా చూడాలి) అది  కేవలం తెలంగాణ మోనగాడు ‘రావు సాబ్‌’‌తో సాద్యం అవుతుందని కలలు కన్నారు.
తెలంగాణ రాష్ట్రం సాధించేందుకు అనేక ఉద్యమ పోరాటాల రూపకల్పనలో పడి తను బ్రహ్మచారిగనే మిగిలిపోయాడు.జీవితం అంతా సిధ్ధాంత వ్యాప్తి కొరకు రాష్ట్రమంతా వివిధ సంఘాలతో కలియతిరుగుతూ సభలు సమావేశాలు జరుపుతూ, అనేక పార్టీలు నాయకులను కలుస్తూ అవగాహన పెంచుతూ, జాతీయ స్థాయి పార్టీలతో, నాయకులతో  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను అర్థం చేయించిన మహానుభావుడు. ఇలా దశాబ్దాల తరబడి తెలంగాణ ధ్యాసలో పడి తన ఆరోగ్యం ఏమవుతుందో కూడా గమనించక, ఆఖరికి మొదలైన తెలంగాణ మలిదశ ఉద్యమ చివరి దశలో తెలంగాణ రాష్ట్రం సిధ్ధించే ముందు తన ప్రాణాలు వదులుకున్న త్యాగజీవి, తెలంగాణ రాష్ట్రాన్ని చూడకుండానే జయశంకర్‌ అనారోగ్యంతో 21,జూన్‌ 2011 ‌తుదిశ్వాస విడిచారు.
image.png
డా.సంగని మల్లేశ్వర్‌, ‌విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్‌,9866255355.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page