‘‘‌భావి తరాల భవిష్యత్తుకు  భద్రత ఏది??

విద్య ద్వా రానే వికాసం,  వికా సం ద్వారానే మేధ స్సు అభివృద్ధి  చెం దుతుంది. తద్వారానే మనిషి  మహో న్న తుడు గా తీర్చి దిద్దిబ డతాడు. మాన వ సమూహం ఆదర్శ వంతంగా తయార వుతుంది.అప్పుడే సమాజం ఆరోగ్యకరంగా  పురోగామించబడుతుంది.  మానవ ప్రవర్తనలో మార్పు తెచ్చేది  విద్య మాత్రమే .విద్య లేని వాడు వింత పశువు అన్నారు పెద్దలు . ప్రస్తుత సమాజంలో విద్యకు అత్యంత ప్రాముఖ్యత  సంతరించుకుంది. ఏ దేశమైన, ఏరంగమైనా అభివృద్ధి చెందాలంటే విద్య మాత్రమే సాధనం …. అందుకే   అన్ని దేశాలలో విద్యావిధానం పట్ల  అత్యంత శ్రద్ధ వహిస్తారు. అధిక నిధులు కేటాయించి  కామన్‌ ‌స్కూల్‌ ‌విద్య, ఉచిత విద్య ను అందిస్తున్నారు .కానీ అత్యంత కీలక రంగమైన విద్యారంగాన్ని భారత పాలకులు పూర్తిగా నిర్వీర్యం చేయుచున్నారు .అధిక నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి గ్రామీణ విద్య జీవితాన్ని పరిరక్షించి ఆదుకోవాల్సిన పరిస్థితులలో  ఆశ్రద్ధ చేయడం యావత్‌ ‌భారత జాతికి ద్రోహం తలపెట్టినట్లే.   75 సంవత్సరాల నుండి వందలాది కమీషన్లు వేయడం జరిగింది. కానీ భారతీయ విద్యా విధానం  ఫలితాలు ఇవ్వని ప్రయోగశాల గానే మారింది. ఇప్పటికినీ వంద శాతం అక్షరాస్యత రేటు సాధించ బడలేదు.

సాధించినదని చెబుతున్నఅక్షరాస్యత శాతం కూడా వట్టి డొల్ల తనమే. స్వాతంత్రం వచ్చేనాటికి అక్షరాస్యత  12 శాతం మాత్రమే. ప్రస్తుతం 74% అక్షరాస్యులుగా ఉన్నారు .ఇంకా 26 శాతం మంది అనగా ముప్పై ఐదు కోట్ల మందికి పైగా  నిరక్షరాస్యులు గానే ఉన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా 78.1  కోట్ల మంది  నిరక్షరాస్యులుగా ఉన్నారు, అనగా ప్రపంచ నిరక్షరాస్యులలో సగం మంది మన దేశంలోనే ఉన్నారు.  దేశంలో అందిస్తున్న విద్య కూడా నాణ్యమైనది కాదు ,నాసిరకం విద్య అరకొర వసతులతో కొద్ది మందికి మాత్రమే అందుతుంది. విద్య గంధం లేని  బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద విద్యార్థులు  ఇంకనూ  బడి బయటే ఉన్నారు .బాలకార్మికులుగా తమ తల్లిదండ్రులకు ఆర్థికంగా సహాయ పడుతున్నారు . ప్రభుత్వ రంగంలోని విద్యాలయాల అన్ని నిర్వీర్యం చేయబడుతున్నాయి  .విద్యను అందించే సామాజిక బాధ్యత నుండి  ప్రభుత్వాలు పూర్తిగా   వైదొలుగుతున్నాయి. విద్యా వ్యాపారం మరింతగా ప్రోత్సహించబడి మూడు పువ్వులు ఆరు కాయలుగా దినదినాభివృద్ధి జరుగుతుంది.  . ఇదిలా ఉండగా పాఠశాలలు, కళాశాలలు ,యూనివర్సిటీలలో బాసర ట్రిపుల్‌ ఐటీలో, గురుకుల పాఠశాలలో ,కస్తూరిబా గురుకులాలలో, ఆశ్రమ పాఠశాలలో మెడికల్‌ ‌కాలేజీలలో, ప్రభుత్వ, ప్రైవేట్‌ ‌హాస్టళ్లలో సైతం నాణ్యమైన పోషక విలువలతో కూడిన బలవర్ధకమైన భోజన సదుపాయాలు  అందించడం లేదు. పెరిగేవయసులో నాణ్యమైన ఆహారాన్ని అందించి వారి పెరుగుదలకు , ఎదుగుదలకు తోడ్పడకుండా నాసిరకం బియ్యం సప్లై ,కుళ్ళిన కోడిగుడ్లు,కుళ్ళిన కూరగాయలు,కల్తీ వంటనూనెలతో శుభ్రత,శుచి  లేకుండా భోజన సదుపాయాలు కల్పించడం మూలంగా ఈ మధ్యకాలంలో వాటిని ఆరగించిన పలువురు విద్యార్థులు  రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రుల పాలయ్యారు.

దీంతో నాణ్యమైన ఆహారం పెట్టాలని డిమాండ్తో గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో  తరుచుగా విద్యార్థులు  రోడ్డు ఎక్కుతున్నారు  . మంచి భోజనం , మంచి వసతుల కోసం గత జూన్‌ ‌నెలలో వారం రోజుల పాటు నిరసన దీక్ష చేపట్టిన తర్వాత కూడా బాసర త్రిబుల్‌ ఐటీలో ఎటువంటి ఫలితం కానరాలేదు. ప్రభుత్వం తీరు మారలేదు . జూలై 15వ తేదీన అదే బాసర లో మధ్యాహ్నం పెట్టిన ఫ్రైడ్‌ ‌రైస్‌ ‌తిని 600 మంది విద్యార్థులు వాంతులు విరోచనాలతో ఆస్పత్రి పాలయ్యారు,. అదే జిల్లాలో ముధోల్‌ ‌ట్రైబల్‌ ‌రెసిడెన్షియల్‌ ‌పాఠశాలలో అన్నం లో పురుగులు వస్తున్నాయని ఐదు రోజులుగా తాగేందుకు మంచినీళ్లు కూడా ఇవ్వడం లేదని ధర్నా నిర్వహించారు, ఆదిలాబాద్‌ ‌జిల్లాలో  ఇచ్చోడ మండలంలో మహాత్మ జ్యోతిబాపూలే బిసి వెల్ఫేర్‌ ‌హాస్టల్లో  నాణ్యమైన భోజనం పెట్టడం లేదని పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ఆందోళన చేశారు ..

విశ్వవిద్యాలయాలలో సైతం క్వాలిటీ ఫుడ్‌ అం‌దించడం లేదని  కాకతీయ,తెలంగాణ యూనివర్సిటీలో   మెస్‌ ‌కు తాళం వేసి నిరసన చేపట్టారు. గద్వాల జిల్లా గట్టు సోషల్‌ ‌వెల్ఫేర్‌ ‌గురుకులంలో చికెన్‌ ‌తిన్న 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన సిబ్బంది హాస్పిటల్‌ ‌కి తరలించారు. సీఎం  ఇలాకా అయినా సిద్దిపేట పట్టణ కేంద్రంలో  మైనారిటీ గురుకులంలో ఫుడ్‌ ‌పాయిజన్‌ అయినందున 128 మందిని హాస్పిటల్లో అడ్మిట్‌ ‌చేశారు.   గత నెల 27న మహబూబాద్‌ ‌జిల్లా గూడూరులో కలుషిత ఆహారం తిని ఏడుగురు విద్యార్థులు కడుపు నొప్పి , వాంతులు, విరోచనాలతో    అస్వస్థతకు గురై స్థానిక పీహెచ్సీలో చికిత్స పొందారు. నిన్నగాక మొన్న పాలకూర ఆకుల్లో వానపాములు,  పురుగులు ఉన్న అన్నమును తిన్న మానుకోట గిరిజన ఆశ్రమ పాఠశాలలో తొమ్మిది మంది విద్యార్థినులు  తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ప్రతి చోట ప్రతి ప్రాంతంలో ఏదో ఒక రోజు ఇదే పరిస్థితి నెలకొని, వరుస సంఘటనలు జరుగుతున్న విద్యార్థుల  భద్రత గాలికి వదిలేయడంతో ఆందోళనకరంగా ఉంది.పాలకులకు విద్య పట్ల విద్యార్థులైన భావి భారత పౌరుల భవిష్యత్తు పట్ల బాధ్యత లేదు .గత జూన్లో వారం రోజుల పాటు ప్రజాస్వామికంగా నిరసనలు తెలిపిన బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు  ఆందోళనకు దిగగా సాక్షాత్తు విద్యా శాఖ మంత్రి   సబితా ఇంద్రారెడ్డి గారు దర్శించి నాణ్యమైన భోజనంతో పాటు  అక్కడ గుర్తించిన 12 సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన వారం రోజులు తిరగకముందే ఫుడ్‌ ‌పాయిజన్‌ ‌సంఘటన వెలుగులోకి రావడం విద్యార్థుల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపడం జరిగింది .ఉజ్వల భవిష్యత్తు ఉన్న ,దేశం కోసం ఎన్నో ఆవిష్కరణలు పరిశోధనలు చేయనున్న ,ఉన్నత మేధాశక్తి కలిగిన భావి ఇంజనీర్లు ఫుడ్‌ ‌పాయిజన్‌ ‌తో అనారోగ్యం పాలవడం,  బాసర ట్రిపుల్‌ ఐటి కి చెందిన, వరంగల్‌ ‌జిల్లా విద్యార్థి జీర్ణకోశ వ్యాధితో బాధపడుతూ  చికిత్సపొందుతూ, 16 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా మృత్యువాత పడటం అత్యంత విషాదకరం. నాసిరకం ఆహారం వల్ల దీర్ఘ కాలంలో జీర్ణకోశ సమస్యలు వస్తాయని , ప్రస్తుతం కూడా కడుపుమంట, కడుపు నొప్పి వంటి సమస్యలతో కూడిన గ్యాస్ట్రిక్‌ ‌సమస్యలు విద్యార్థులను బాధ పెడుతున్నాయని,  వీటితో పాటు హైపటైటిస్‌ ‌బి (కామెర్ల వ్యాధి) కూడా సోకుతుందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశాభివృద్ధికి కీలకంగా పనిచేయనున్న భవిష్యత్‌ ‌తరాలకు పాయిజన్‌  ఇచ్చి యువ సంపదను చేతులారా  నాశనం చేయడమే అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ దుస్థితికి కారణాలు ఏంటి??
గతంలో రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్లో గురుకులాలు అన్ని ప్రభుత్వ స్కూల్లో చదువుకునే విద్యార్థులకు సన్న బియ్యం తో అన్నం పెడదామని గొప్ప లు చెప్పింది. కెసిఆర్‌ ‌మనవడు  ఎలాంటిఅన్నం  తింటారోఅలాంటి   అన్నమే రాష్ట్రవ్యాప్తంగా చదువుకుంటున్న విద్యార్థులకు అందిస్తామని ప్రగల్బాలు పలికిన రాష్ట్ర పాలకులు కొన్ని నెలలు మాత్రమే సన్న బియ్యం సరఫరా చేశారు. గత ఏడాది నవంబర్‌ ‌నెల నుండి అన్ని సర్కార్‌ ‌పాఠశాలలు ,గురుకులాలకు ,హాస్టళ్లకు దొడ్డు బియ్యం సరఫరా చేస్తున్నారు. కొన్ని నెలలుగా మండల్‌ ‌లెవెల్‌ ‌స్టాక్‌ ‌పాయింట్‌ ‌నుంచి పురుగు పట్టిన, తుట్టేలు కట్టిన, ముక్కిన బియ్యం వస్తున్నాయని ప్రిన్సిపాల్‌ ,‌వార్డెన్లు చెబుతున్నప్పటికీ పట్టించుకునే నాధుడే కరువయ్యారు. ఫలితంగా విద్యార్థులకు నాసిరకం భోజనం దిక్కు అవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం 2017- 18 విద్యాసంవత్సరంలో ఖరారు చేసిన ఛార్జీలను గత ఐదేళ్లుగా పెంచలేదు .ప్రస్తుత మార్కెట్‌ ‌ధరలతో పోల్చుకుంటే ఇవి ఏ మూలకూ సరిపోవడం లేదు .దీంతో భోజనం నాణ్యత  ప్రమాణాలు పూర్తిగా తగ్గిపోయాయి   వంట వన్డే ఏజెన్సీలకు  బిల్లులు సక్రమంగా అందించక  నెలలతరబడి  జాప్యంచేయడంతో కిరాణా దుకాణాలలో  అప్పులు చేయాల్సి వస్తుండడంతో  నాణ్యత లేని భోజనాన్ని తయారు చేస్తున్నారు.
ఇటీవల నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరగడం, కూరగాయల ధరలు ఆకాశాన్నంటడంతో అదే సాకుగా నాణ్యత లేని సాధారణ కూరలు, నీళ్ల సాంబార్‌ ‌ని విద్యార్థులకు అందిస్తున్నారు. విద్యార్థులకు సంఖ్యకు తగ్గట్టుగా హాస్టల్లో వసతి సౌకర్యము, భోజనశాల, వంట చేయడానికి అనుకూలమైన  కిచెన్‌ ‌గది, సిబ్బంది, నాణ్యమైన  శుభ్రమైన పాత్రలు అందుబాటులో లేకపోవడం, పర్యవేక్షణ కొరవడడం, సంఘటనలు జరిగినప్పుడే ఆ పాఠశాలను సందర్శించి హడావుడి చేసి  సిబ్బంది పాత్ర ఉన్నా లేకున్నా అక్కడున్న ఉద్యోగులను సస్పెండ్‌ ‌చేసి చేతులు  దులుపుకోవడం తప్ప శాశ్వత పరిష్కార మార్గం  కని పెట్టకుండా పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

పరిష్కారమార్గాలు…..
ప్రభుత్వం ప్రకటించినట్లు తక్షణమే నాణ్యమైన సన్నబియ్యం అందించాలి. గతంలో ఒక్కొక్క రకం గురుకులంలో ఒక్కోరకంగా డైట్‌ ‌విధానం అమల్లో ఉండేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని గురుకులాలలో ఒకేరకమైన డైట్‌ ‌ని విద్యార్థులకు అందిస్తున్నారు. 5వ తరగతి నుంచి  ఇంటర్‌ ‌వరకు చదివే ఒక్కో విద్యార్థికి రూపాయలు 38, ఇంటర్‌ ‌కాలేజీ  మాత్రమేఉన్న చోట ఒక్కో విద్యార్థికి రోజుకు 48 రూపా యలు చొప్పున డైట్‌ ‌చార్జీలు  చెల్లి స్తున్నారు. వీటితో ఉదయం బ్రేక్‌ ‌ఫాస్ట్, ‌మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ ‌మరియు రాత్రి భోజనం అందించాలి. అదేవిధంగా నెలలో నాలుగు సార్లు చికెన్‌,  ‌రెండుసార్లు మటన్‌ ‌మరియు ప్రతిరోజు గుడ్డు అందించాల్సి ఉంది. వాటి ధరలు పెరిగినప్పుడు, మటన్‌ ‌పెట్టినప్పుడు డైట్‌ ‌చార్జీలు సరిపోవడం లేదు.వంట వండే  ఏజెన్సీలకు ధరల పెరుగుదల సూచీ ప్రకారం  మెస్‌ ‌చార్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి పెంచాలి. వారికి ఇచ్చే బిల్లులను సక్రమంగా   ఏనెలకానెల అందించాలి.వంట వండే  ఏజెన్సీ లకు బదులుగా శాశ్వత నియామకాలు చేపట్టి ప్రభుత్వమే బాధ్యత తీసుకొని  నాణ్యమైన ఆహా రాన్ని అందించాలి.  ఏజెన్సీ వారు లాభాపేక్షతో నాసిరకం ఆహారాన్ని అందించి కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌   ‌హాస్టళ్లను క్రమం తప్పకుండా సందర్శించడానికి ఫుడ్‌ ఇన్స్పెక్టర్లను ఆదేశించాలి. అవసరమైతే ఫుడ్‌ ఇన్స్పెక్టర్ల రిక్రూట్మెంట్‌  ‌నిర్వహించాలి.

దేశ భవిష్యత్తు నేటి బాలలైన రేపటి పౌరులు పై ఆధారపడి ఉంటుంది .భవిష్యత్తు తరాలను కాపాడుకోవడం బాధ్యత .ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలి..కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు  చిత్తశుద్ధి  లేదు.  దేశ అభివృద్ధికి అత్యంత కీలకమైన విద్యా రంగాన్ని, విద్యార్థులను తీవ్ర నిర్లక్ష్యం చేయడం విచారకరం.  అధిక నిధులు కేటా యించి   భవిష్యత్తు తరాలబాగు కోసం ఆలోచి ంచక పోవడం శోచనీయం. లక్షల కోట్ల బడ్జెట్‌ ‌లో విద్యకు అతి తక్కువ నిధులు కేటాయించడం ఆశ్చర్యకరం. విద్యకు జిడిపిలో 6 శాతం, రాష్ట్ర బడ్జెట్లో 30 శాతం నిధులు కేటాయించాలని 1966 లోనే  దౌలత్‌ ‌సింగ్‌ ‌కొటారి కమిషన్‌ ‌సూచన చేస్తే, 56 సంవత్సరాలు పూర్తయి నప్పటికీ అది అమలు కాకపోవడం, చేయక పోవడం పాలకులకు ఏమాత్రం విద్య పట్ల, భవిష్యత్తు తరాల పట్ల బాధ్యత చిత్తశుద్ధి ఉందో అవగతమవుతోంది.  ప్రత్యేక రాష్ట్రం ఉమ్మడి పాలక ప్రభుత్వాల కంటే దయనీయంగా నిధులు కేవలం 6.2 శాతానికి కుదించడం, ..డబుల్‌ ఇం‌జన్‌ ‌గ్రోత్‌ ,‌సబ్‌ ‌కా వికాస్‌ , ‌సబ్‌ ‌కా సాత్‌  అం‌టూ అందమైన నినాదాలతో  కేంద్ర ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తూ, ఆచరణలో కార్పొరేట్లకు దాసోహమై వారికి ఊడిగం చేస్తూ భవిష్యత్‌ ‌తరాల పట్ల బాధ్యత లేకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దేశాభివృద్ధికి విఘాతం..ఇప్పటికైనా పాలక వర్గాలు కళ్ళు తెరిచి  విద్య, వైద్య రంగాలపై అత్యధిక నిధులు కేటాయించి నాణ్యమైన సమాన విద్యను,నాణ్యమైన సమాన చికిత్సలను అంతరాలు లేకుండా అందించిన అప్పుడే భవిష్యత్‌ ‌తరాలు ఆరోగ్యకరంగా బాగుంటాయి,. ఆ దిశగా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి .లేనిచో మేధావులు పౌరసమాజం  ప్రజాస్వామిక వాదులు ప్రజలు చైతన్యవంతులై పాలక విధానాలు మార్చుకునేలా భవిష్యత్తు తరాల పట్ల బాధ్యతగా మెలిగేలా  ఉద్యమించాల్సిన అవసరం ఆసన్నమైంది….

image.png
తండా సదానందం,  టి.పి.టి.ఎఫ్‌. ‌రాష్ట్ర కౌన్సిలర్‌, ‌మహబూబబాబాద్‌, 9989584665,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page