డబ్బా పాలు వద్దు..తల్లి పాలు ముద్దు

  • సిఎం కేసీఆర్‌ ఆదేశాలతో త్వరలో మదర్‌ ‌మిల్క్ ‌బ్యాంకులు
  • గజ్వేల్‌లో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు
  • మహతి ఆడిటోరియంలో 500 మంది తల్లులతో బుక్‌ ఆఫ్‌ ఇం‌డియా రికార్డు

సిద్ధిపేట / గజ్వేల్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 1 : డబ్బా పాలు వద్దు..తల్లి పాలు ముద్దు అనేది నినాదం కావాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు.  అంతర్జాతీయ తల్లిపాల దినోత్సవ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ ‌పట్టణంలోని మహతి ఆడిటోరియం వేదికైంది. పట్టణంలోని తల్లిపాల సొసైటీ, గజ్వేల్‌-‌ప్రజ్ఞాపూర్‌ ‌మున్సిపాలిటీ, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ ‌గజ్వేల్‌, ‌లయన్స్ ‌క్లబ్‌ ఆఫ్‌ ‌గజ్వేల్‌ ‌మేధా, కెమిస్ట్ అం‌డ్‌ ‌డ్రగ్గిస్టస్ అసోసియేషన్‌, ‌భవాని పాలిక్లినిక్‌ ‌సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి తన్నీరు హరీష్‌రావు, డాక్టర్‌ ‌వాసవచారి సమక్షంలో తల్లిపాలు చంటి పిల్లలకు శ్రీరామ రక్ష, గజ్వేల్‌ ‌తల్లులతో బుక్‌ ఆఫ్‌ ఇం‌డియాలో దేశంలోనే అతిపెద్ద చరిత్ర సృష్టించింది. 500 మంది తల్లులతో పాటు ప్రజలకు తల్లిపాల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించి బుక్‌ ఆఫ్‌ ఇం‌డియాలో రికార్డు నెలకొల్పింది. ఇప్పటికే 50 మంది తల్లులతో ఈ కార్యక్రమం జరిపి రికార్డు సాధించగా గజ్వేల్‌ ‌మహతి ఆడిటోరియంలో తాజాగా 500 మంది తల్లులతో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని చేపట్టగా బుక్‌ ఆఫ్‌ ఇం‌డియాలో మరో రికార్డు నమోదైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు తల్లిపాల ప్రాముఖ్యతను సవివరంగా అవగాహన కల్పిస్తూ..వివరించారు.

మొదటి గంట తల్లి పాలు బిడ్డకు మొదటి టీకాతో సమానమనీ, రోగనిరోధక శక్తి పెంచి బిడ్డను ఆరోగ్యంగా ఉంచుతుందన్నారు. పాలు ఇవ్వడం వల్ల బిడ్డకు, తల్లికి ఇద్దరికీ ఉపయోగంగా ఉంటుందన్నారు. ఆరోగ్య సమాజాన్ని నిర్మించడంలో ఆశాలు, ఏఎన్‌ఎం‌లు, అంగన్‌వాడీలది కీలక పాత్ర అని, మొదటి ఏఎన్‌సి చెకప్‌ ‌నుండే తల్లులకు అవగాహన పెంచాలనీ, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు సి సెక్షన్లు తగ్గేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో), యునిసెఫ్‌ ‌సంయుక్తంగా ఆగస్టు మొదటి వారంలో ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు నిర్వహిస్తాయనీ, కాబోయే తల్లుల్లో, సమాజంలో.. తల్లి పాల ప్రాముఖ్యతపై అవగాహన కల్గించడమే ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశ్యమన్నారు. దేశంలో మొదటి గంటలో తల్లి పాలు తాగుతున్న వారి శాతం కేవలం 41 శాతం అని, ఈ విషయంలో బంగ్లాదేశ్‌ ‌ప్రపంచంలోనే మొదటి స్థానంలో తల్లిపాలు తాగడంలో ఉందన్నారు. తె•లంగాణ రాష్ట్రంలో 41 శాతం మాత్రమే తల్లిపాలు పొంద గలుగుతున్నారనీ, కేవలం 36 శాతం మాత్రమే మొదటి గంట తల్లి పాలు తాగుతున్నారన్నారు. ప్రపంచంలో తల్లి పాలకు ప్రత్యామ్నాయం లేదనీ,  అత్యంత విలువైనవి. విశిష్టమైనవన్నారు.

తల్లి పాలు తాగడం వలన బిడ్డతో పాటు.. తల్లికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. తల్లి బిడ్డకు ఎంతో మంచి జరుగుతుందన్నారు. తల్లి పాలు అందని కారణంగా మన దేశంలో నిమోనియా, నీళ్ల విరేచనాలతో ఏటా లక్ష మంది పిల్లలు చనిపోతున్నారన్నారు. యేటా ఎంతో మంది తల్లులు రొమ్ము కేన్సర్‌, అం‌డాశయ కేన్సర్‌, ‌షుగర్‌ ‌వ్యాధి బారిన పడుతున్నారనీ, ఇవీ రెండు మనం నియంత్రించదగిన విషయాలనీ,  బిడ్డకు, తల్లికి జరుగుతున్న ఈ నష్టాన్ని ఆపడం మన చేతుల్లోనే ఉందనీ, దీనికి ఎలాంటి అదనపు ఖర్చు అవసరం కూడా లేదు. బిడ్డకు తల్లి పాలు పడితే చాలన్నారు. మొదటి గంటలో వొచ్చే పాలను ముర్రుపాలు అంటారనీ, ఇవీ  అమృతంతో సమానంమనీ, బిడ్డకు ముర్రుపాలు పట్టించడం ద్వారా వ్యాధి నిరోధకశక్తి పెరిగి శిశువుకు రోగాలు దరి చేరవన్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే రోగ నిరోధక శక్తిని పెంచే మొదటి టీకా ఇదన్నారు. తల్లి పాలు ఎక్కువ కాలం తాగించడం వల్ల బిడ్డకు రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్స్ ‌సోకకుండా కాపాడతాయనీ, భవిష్యత్‌లో షుగర్‌, అధిక బరువు, కేన్సర్‌, ఆస్తమా వంటి రోగాలు వొచ్చే అవకాశం ఉండదనీ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. తల్లి పాలు ఎక్కువ కాలం తాగిన పిల్లల్లో తెలివి తేటలు ఎక్కువగా ఉంటాయన్నారు. తల్లులు చనుపాలు ఇవ్వడంతో గర్భధారణ తర్వాత రక్తస్రావ ప్రమాదం తగ్గడంతో పాటు త్వరగా కోలుకుంటారన్నారు. జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. చనుపాలు ఇవ్వడంతో ఊబకాయం వొచ్చే ప్రమాదం తగ్గుతుందన్నారు. బిడ్డకు పాలు పట్టించడంతో రొమ్ము, గర్భ సంచి క్యాన్సర్లు రావన్నారు.

తల్లులకు మలి వయసులో వొచ్చే అస్టియో పొరొసిన్‌(ఎముకల బలహీనత) నుంచి కాపాడుతుంది. తల్లికి మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం ఉంటుందన్నారు. తల్లి బిడ్డకు ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఈ విషయంలో నిర్లక్ష్యం చూపుతున్నారనీ, ముర్రుపాలు అందించక పోవడానికి సిజెరియన్లు కారణం కాగా, వివిధ కారణాలతో ఎక్కువ కాలం పాటు బిడ్డకు చను బాలు ఇవ్వకుండా నేటి కాలంలో కొందరు నిర్లక్యం చూపిస్తున్నారన్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2021 ప్రకారం పుట్టిన మొదటి గంటలో ముర్రుపాలు అందిస్తున్న తల్లుల శాతం మన దేశంలో కేవలం 41.6 శాతం, మిగతా 58 శాతం అందించడం లేదనీ, రోగనిరోధక శక్తిని పెంచే సహజమైన మొదటి టీకాను పొందలేక పోతున్నారన్నారు. ప్రధాన కారణం అనవసరమైన సిజెరియన్లు. దీంతో ప్రసవం తర్వాత మొదటి గంటలో పాలు పట్టించడం సాధ్యం కావడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీ సెక్షన్‌ ఆపరేషన్లు తగ్గేలా ప్రయత్నం చేస్తున్నామనీ, వైద్యులు, ఆశా కార్యకర్తల సహకారంతో మంచి ఫలితాలు వొస్తున్నాయన్నారు. తల్లులు పాలు పట్టలేని నవజాత శిశువులకు, తల్లులు మరణించిన శిశువులకు, అనారోగ్యంతో ఉన్న లేదా తగినంత పాలు అందని శిశువులకు..లేదా తల్లి పాలను తీసుకోలేని  శిశువులకు పాలు అందించాలని మదర్‌ ‌మిల్క్ ‌బ్యాంకులను…సిఎం కేసీఆర్‌ ఆదేశాలతో ప్రభుత్వం త్వరలోనే ప్రారంభిస్తుందన్నారు. హైదరాబాద్‌ ‌నీలోఫర్‌ ‌పిల్లల దవాఖానలో మొట్ట మొదటగా ఏర్పాటు చేశామనీ, ఇది విజయవంతం కావడంతో వరంగల్‌, ‌ఖమ్మంలోనూ మదర్‌ ‌మిల్క్ ‌బ్యాంక్‌ అం‌దుబాటులోకి తెచ్చామన్నారు.

డబ్బాపాలు ఇచ్చేందుకు ప్రాధాన్యమివ్వొద్దనీ, దాని వల్ల బిడ్డకు ప్రయోజనం ఉండదనీ, తల్లిపాలు ముద్దు, డబ్బపాలు వద్దు అనే ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకు వెళ్దామన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచేలా విస్తృత కార్యక్రమాలు చేయాలనీ, 500 మంది తల్లులకు ఇక్కడ అవగాహన కల్పించడం మంచి విషయమనీ, తల్లి, బిడ్డ రక్షణకు  ఆశాలు, ఏఎన్‌ఎం‌లు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు డాక్టర్‌ ‌వంటేరు యాదవరెడ్డి, ఫారుఖ్‌హుస్సేన్‌, అదనపు కలెక్టర్‌ ‌ముజమ్మిల్‌ఖాన్‌, ‌టూరిజం ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ ‌గుప్తా, ఎఫ్‌డిసి ఛైర్మన్‌ ‌వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎంపిపి దాసరి అమరావతి శ్యాంమోహన్‌, ‌జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మునిసిపల్‌ ‌ఛైర్మన్‌ ‌నేతి చిన రాజమౌళి, ఇంఛార్జి డిఎంహెచ్‌వో కాశీనాథ్‌, ఏఎం‌సి ఛైర్మన్‌ ‌మాదాసు శ్రీనివాస్‌, ‌వైస్‌ ‌ఛైర్మన్‌ ‌రాచమల్ల ఉపేందర్‌రెడ్డితో పాటు నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, టిఆర్‌ఎస్‌ ‌శ్రేణులు, తల్లులు, బిడ్డలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page