- ఉరుములు, మెరుపులతో దంచికొట్టిన వాన
- పలు ప్రాంతాలు మరోమారు జలమయం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 29 : హైదరాబాద్‌లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వర్షం దంచి కొట్టింది. ఒక్కసారిగా సాయంత్రం వాతావరణం మారిపోయింది. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. యూసుఫ్‌గూడలో ఓ గల్లీలో రిపేర్ సెంటర్లోని వాషింగ్ మిషన్ నీటిలో కొట్టుకుపోయింది. దాన్ని ఆపేందుకు ఆ వ్యక్తి చాలా ప్రయత్నించాడు. వాటర్‌లో అది కొట్టుకుపోతుండగా.. పట్టుకునేందుకు శ్రమించినా..ఫలితం దక్కలేదు. నీటి ప్రవాహం చాలా వేగంగా రావడంతో… ఆ వాషింగ్ మిషన్ నీటిలో కొట్టుకుపోయింది. మరోవైపు పంజాగుట్టలో వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు కి.వి•టర్ల మేర నిలిచిపోయాయి. అందులో అంబులెన్స్ సైతం ఉండిపోయింది. ఒక్కసారిగా భారీ వర్షంతో హైదరాబాద్ నగరం అతలకుతలం అయింది. వాహనదారులు, ప్రయాణికులు, నగరవాసులు అందరూ… తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. మహానగరాన్ని వర్షం వీడకుండా నిత్యం దంచికొడుతుండడంతో గ్రేటర్ వాసులు విలవిల్లాడుతున్నారు. ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, మలక్‌పేట్, సరూర్‌నగర్, కూకట్పల్లి, గాజులరామారం, నిజాంపేట్, చింతల్, జీడిమెట్ల, నాంపల్లి, మణికొండ, షేక్‌పేట్‌లో భారీ వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకోవడంతో మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ భావించింది.
అయితే మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండ కనిపించింది. ఆ తర్వాత 4 గంటల నుంచి భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఉద్యోగులు ఇంటికి వెళ్తున సమయంలో వర్షం పడుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి రోడ్లపై నరకయాతన అనుభవిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. చెరువులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మూసీనది పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. నదిని ఆనుకుని ఉన్న కాలనీల లోని ఇళ్లలోని నీరు ప్రవేశించాయి.
హైదరాబాద్ మహానగరాన్ని వర్షం వీడేలా కనిపించడం లేదు. బుధవారం, గురువారం కాస్త తెరిపినిచ్చినా.. తిరిగి శుక్రవారం మధ్యాహ్నం నుంచి ముసురు కమ్మేసింది. కాసేపటికే వర్షం కురవడంతో రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. నేరేడ్మెట్లో 7.3 సెంటీవి•టర్లు, మల్కాజ్‌గిరిలో 5.1, బాల్నగర్లో 5, అల్వాల్‌లో 4.8సె.వి•. వర్షపాతం నమోదైంది. మరో గంట పాటు హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో జీహెచ్ఎంసీ కమిషనర్ (ఉఊఓఅ అనీపపతిబబతినీని।స) డిజాస్టర్ బృందాలను అప్రమత్తం చేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది.