రేరాజు శ్రావణ నక్షత్రంలో
సంక్రమించే శుభకర మాసం
మహాలక్ష్మికి ప్రీతికర శ్రామం
పండుగలకు నెలవైన కాలం
ధైవనుగ్రహం పొందే ద్విపక్షం
పరమ పవిత్ర శ్రావణమాసం
దివ్యమాస ఆసాంతం
పూజలు దైవరాధనలు
భగవన్నామ స్మరణలతో
మందిరాలు మారుమ్రోగేను
గృహ సీమలు వెల్లివిరిసేను
పుణ్యకాల ఆధ్యంతం
పగలు ఉపవాస దీక్షలు
రాత్రివేళ స్వామివారిని
త్రికరణశుద్ధిగా కొలిచిన
సకల పాపాలు హరణం
పౌర్ణమి ముందు శుక్రవారం
పసుపు కుంకుమార్చనతో
వరలక్ష్మివ్రతం ఆచరించిన
భక్తుల మనోభీష్ట సాఫల్యం
ప్రతి మంగళవారం దినం
దేవి ప్రతిమ అలంకరించి
మంగళగౌరిని పూజించిన
మాంగళ్య బలం సుదృడం
శ్రావణమాస శుభ దినలో
నోములు వ్రతాలు యజ్ఞాలు
ఉపవాసదీక్షలు అభిషేకాలు
నియమబద్ధంగా ఆచరించిన
సకల బోగబాగ్యాలు సంప్రాప్తం
సర్వ జగతి శాంతి క్షేత్రమై వర్ధిల్లు
(శ్రావణ మాసం ఆరంభమైన సందర్భంగా..)
– కోడిగూటి తిరుపతి, 9573929493