రైతు బంధు పథకం ..దేశానికే ఆదర్శం…

ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి ఇప్పటివరకు, రైతుబంధు పథకం ద్వారా రూ.58,102 కోట్ల ఆర్ధిక సాయం అందించింది. ఆనాడు అస్తిత్వం కోసం పోరాడిన తెలంగాణ….నేడు అభ్యుదయ పథంలో దేశంలోనే అగ్రపధాన, అభివృద్ధి రాష్ట్రంగా అవతరించింది. రైతు సంక్షేమ రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా కీర్తిప్రతిష్టలు పొందుతున్నది. ఇప్పటివరకు రూ.58,102 కోట్ల రూపాయల ఆర్థిక సహాయంతో రైతు బంధు నిధులతో రాష్ట్ర రైతాంగానికి చేయూత నిచ్చింది. రైతాంగానికి మన ప్రభుత్వం ఇచ్చిన స్ఫూర్తికి, కేంద్ర ప్రభుత్వం కూడా ఫసల్‌ ‌బీమా యోజన పథకం ప్రారంభం చేసింది. రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటలు నిరంతర నాణ్యమైన విద్యుత్‌ ‌సరఫరా అందిస్తుంది. రాష్ట్రం తొలినాళ్ళలో 2014లో స్థాపిత విద్యుత్‌ ‌సామర్థ్యం 7778 మెగావాట్లు ఉండగా, నేడు మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌విజన్‌తో 17 వేల 234 మెగావాట్లు విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ రోజంతా నిరంతర విద్యుత్‌ ‌సరఫరా చేస్తున్నారు. నేడు తెలంగాణ రాష్ట్రం వెలుగు జిలుగులతో వెలిగి పోతుంది. ఆనాడు సమైక్య పాలకులు ఎన్నో అవాకులు, వెక్కిరింతలతో ఎగతాళి చేసిన సందర్భాలూ మనం చూశాం. ఇక సాగునీటి విషయంలో మన తెలంగాణ ‘‘ఆదికవి దాశరథి’’ చెప్పినట్లుగా ‘‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ’’ గా ‘‘నా తెలంగాణ రాష్ట్రం కోటి ఎకరాల మాగాణి’’గా రూపుదిద్దుకున్నది. ఈ వానా కాలం సీజన్లో రైతుబంధు ప్రభుత్వ ఆర్థిక సాయం కోసం కొత్తగా 3.64 లక్షల రైతులు దరఖాస్తు చేసుకున్నారు. రైతులకు సకాలంలో ఆర్ధిక సాయం అందించాలనే సత్‌ ‌సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రైతు బంధు నిధులు తక్షణం విడుదల చేయాలని ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో ఇటీవల జమ అయ్యాయి. ఎకరాకు రూ.5 వేల చొప్పున విడతల వారీగా రూ.7,654.43 కోట్లను రైతులకు ప్రభుత్వం చెల్లించింది. మొత్తం 68,94,486 మంది రైతులకు పెట్టుబడి సాయం అందింది. ఎకరాకు రూ.5 వేల చొప్పున విడతల వారీగా రూ.7,654.43 కోట్లను రైతులకు ప్రభుత్వం చెల్లించింది. రాష్ట్రంలోని 1.53 కోట్ల ఎకరాలకు రైతు బంధు అందింది. దాదాపు 1.50 లక్షల ఎకరాల భూమి కొత్తగా రైతుబంధు జాబితాలో చేరింది. యాసంగి సీజన్తో పోల్చితే 3.64 లక్షల మంది రైతులకు ఈ సారి కొత్తగా రైతుబంధు ఆర్థిక సాయం అందించారు. గత యాసంగి వరకు రైతుబంధు కింద రూ.50,448 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈ సీజన్లో జమ చేసిన రూ.7,654.43 కోట్లను కలిపితే..మొత్తంగా రైతుబంధు సాయం రూ.58,102 కోట్లకు చేరింది. ఇప్పటి వరకు దేశంలో ఏ ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాయం చేసిన దాఖలాలు లేవు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు సృష్టించినా వాటన్నింటినీ దాటుకొని రైతుల కోసం సీఎం కేసీఆర్‌ ‌రైతుబంధు నిధులను మంజూరు చేశారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి అన్నారు. రైతులపై సీఎం కేసీఆర్‌కు గల ప్రేమకు ఇది నిదర్శనమని చెప్పారు. రైతుబంధు వార్తతో రైతుల్లో సంతోషం నెలకొందని తెలిపారు. ఈ సీజన్లో సమృద్ధిగా పంటలు పండి రైతులు సంతోషంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని వివరించారు. గ్రామాల్లో వ్యవసాయ ఉత్పత్తి మరింత ప్రోత్సహించి, రైతుల ఆదాయం పెంచేందుకు నగదు రూపంలో రుణాలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే రైతు బంధు. రైతులు ప్రైవేట్‌ అప్పుల ఊబిలో చిక్కుకుపోకుండా ఈ స్కీమ్‌ ‌కాపాడుతుంది.

ఒక్కో ఎకరానికి, ఒక్కో రైతుకి ప్రతి సీజన్లో రూ.5000ను ప్రభుత్వం రైతుల అకౌంట్లోకి జమ చేస్తుంది. ప్రధానాంగా, అప్పుల ఊబిలో రైతులు చిక్కుకోకుండా రైతు బంధు సహాయ పడుతుంది. రైతులకు కావాల్సిన తొలి పెట్టుబడి బాధ్యతంతా ప్రభుత్వానిదే. తెలంగాణ రైతుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి స్కీమ్‌. ‌రైతుల కోసం దేశంలోనే తీసుకొచ్చిన తొలి స్కీమ్‌ ఇదే, రైతుల ఆదాయం పెంచేందుకు నగదు రూపంలో రుణాలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే రైతు బంధు. రైతులు ప్రైవేట్‌ అప్పుల ఊబిలో చిక్కుకుపోకుండా ఈ స్కీమ్‌ ‌కాపాడుతోంది. 2018-19 ఖరీఫ్‌ ‌సీజన్‌ ‌నుంచి రైతులకు కావాల్సిన తొలి పెట్టుబడిని ప్రభుత్వమే చూసుకుంటోంది. ఒక్కో ఎకరానికి, ఒక్కో రైతుకి ప్రతి సీజన్లో రూ.5000ను ప్రభుత్వం రైతుల అకౌంట్లోకి జమ చేస్తుంది. ఇలా రెండు పంటలుగా తీసుకుంటే ప్రజలకు రూ.10 వేలు ప్రభుత్వం నుంచి అందుతున్నాయి. విత్తనాలు, రసాయనాలు, ఎరువులను కొనుగోలు చేసుకునేందుకు, ఇతరాత్ర అవసరాలకు రైతుల చేతికి ఈ నగదును ప్రభుత్వం రైతు బంధు కింద ఇస్తోంది. రైతులకు మద్దతునిచ్చేందుకు దేశంలో ప్రవేశపెట్టిన తొలి పెట్టుబడి పథకం ఇదే కావడం విశేషం. రైతు బంధు కింద డబ్బులను తెలంగాణ ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్లలోకే వేస్తుంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులను ఆదుకోవడానికి ప్రతి రైతుకి ఖరీఫ్‌, ‌రబీ సీజన్లలో ఒక్కో ఎకరానికి రూ.5000, మొత్తంగా రూ.10 వేలు అందిస్తున్నారు. రైతు బంధు పథకాన్ని తొలిసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు(కేసీఆర్‌) ‌జయశంకర్‌ అ‌గ్రికల్చర్‌ ‌యూనివర్సిటీలో జరిగిన రైతుల సమన్వయ కమిటీ(రైతు సమన్వయ సమితి) కాన్ఫరెన్స్లో ఫిబ్రవరి 25న, 2018లో ప్రకటించారు. ఆ తర్వాత 2018 మే 10న కరీంనగర్‌ ‌జిల్లా, హుజురాబాద్‌ ‌నియోజకవర్గంలోని ధర్మరాజుపల్లి గ్రామంలో అధికారికంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రారంభించారు. 2018-19 బడ్జెట్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు బంధు పథకం కోసం రూ.12 వేల కోట్లను కేటాయించింది. అంతేకాక 2021 వరకు ఈ పథకం కింద రూ.50 వేల కోట్లను రైతు ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేసింది. కేవలం తొలి పెట్టుబడిని అందించడమే కాకుండా…ఈ పథకం కింద తెలంగాణ ప్రభుత్వం రుణాలను అందిస్తుంది. ఈ పథకం కింద తీసుకునే రుణాలకు కూడా రైతులు ఎలాంటి వడ్డీని చెల్లించాల్సినవసరం లేదు. 68 లక్షల మంది రైతులు ఈ పథకం కింద ప్రతి ఏడాది పెట్టుబడి సాయం పొందుతున్నారు. రాష్ట్రంలో కోటి 50 లక్షల 43 వేల 606 ఎకరాలకు పంట సాగు జరుగుతోంది. తెలంగాణలో సుమారు 55 శాతం మంది జనాభా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఈ పంట పెట్టుబడి పథకం వల్ల 90.5 శాతానికి పైగా పేద ప్రజలు ప్రయోజనం పొందుతున్నారు. అంతకుముందు రైతులకు పంట సాయం దొరకకపోతుం డటంతో..పెట్టుబడిదారులు, దలారుల నుంచి అప్పులు తెచ్చుకునేవారు. వారు రైతులపై అధిక వడ్డీలు విధించేవారు. ఈ వడ్డీలతో రైతులు అప్పులు పాలై, ఆత్మహత్యలు చేసుకునేవారు. ఈ సమస్యలకు చెక్‌ ‌పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వ రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది.

– కమిషనర్‌, ‌సమాచార పౌర సంబంధాల శాఖ చే జారీచేయనైనది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page