యువత కోసం బీజేపీ ఏం చేసింది..? చేసిందేం లేదు… చేసేదేం లేదు

రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు
పటాన్‌చెరు, ప్రజాతంత్ర, జూలై 19: బీజేపీ కేంద్ర ప్రభుత్వం యువతకు చేసిందేమి లేదని, బీజేపీ నాయకుల మాటలు కోటలు దాటుడే తప్పా యువత కోసం చేసింది సున్నా అని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యపై బండి సంజయ్‌ ‌పార్లమెంటులో నిలదీయాలని హితవు పలికారు. దమ్ముంటే 16.5 లక్షల ఉద్యోగాలు యువతకు దక్కేలా చేయాలని మంత్రి విసిరారు. మంగళవారం పటాన్‌ ‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌ ‌రెడ్డి ఆధ్వర్యంలో జీఎంఆర్‌ ‌ఫంక్షన్‌ ‌హాల్‌ ‌లో చేపట్టిన పోలీస్‌ ఉచిత శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో మంత్రి హరీష్‌ ‌రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శిక్షణ పొందిన విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేశారు. అదేవిధంగా పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్‌ ‌సెంటర్‌ ‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి హరీష్‌ ‌రావు మాట్లాడుతూ స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చారన్నారు. ప్రభుత్వ శాఖల్లోని అన్ని ఖాళీలను దశల వారీగా భర్తీ చేస్తున్నామని చెప్పారు. 2లక్షల 50 వేల ఉద్యోగాలు కేసీఆర్‌ ఇస్తే బీజేపీ ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను పీకేస్తుందన్నారు. కేంద్రంలో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదన్నారు. కేంద్రంలోని ఖాళీలు భర్తీ చేస్తే తెలంగాణ ప్రాంత నిరుద్యోగ యువత 30 వేల మంది వరకు ఉద్యోగం పొందే అవకాశం ఉందన్నారు. అగ్నిపథ్‌ ఆర్మీ లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు కల్పిస్తున్నారని, తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలతో యువత ఆశల మీద నీరు చల్లుతున్నారని మంత్రి వాపోయారు.

అమీన్‌ ‌పూర్‌ ‌లో బస్తీ దవాఖాన ప్రారంభించిన మంత్రి హరీష్‌ ‌రావు
అమీన్‌ ‌పూర్‌ ‌మున్సిపాలిటీ పరిధిలోని మంజీరా నగర్‌, ‌లింగమయ్య కాలనీ, బంధంకొమ్ము కాలనీలో నూతనంగా మున్సిపాలిటీ ప్రజల ఆరోగ్య అవసరాలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలను స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ ‌రెడ్డి, అమీన్‌ ‌పూర్‌ ‌మున్సిపల్‌ ‌ఛైర్మన్‌ ‌తుమ్మల పాండురంగా రెడ్డి లతో కలిసి మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు ప్రారంభించారు. అనంతరం స్థానిక మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌తుమ్మల పాండురంగారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్‌ ‌రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షలో భాగంగానే ఈ రోజు పెద్ద ఎత్తున బస్తి దావకాలను ప్రారంభించుకుంటున్నామని కావున ఈ యొక్క చక్కటి అవకాశాన్ని ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఈ యొక్క బస్తీ దవాఖానలో అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి కావలసిన మందులను ఇస్తారని తెలిపారు.

ఒకప్పుడు ప్రభుత్వ దావకానులకు పోవాలంటే నేను రాను బిడ్డ సర్కారు దావకానకు అన్న నేడు నేను పోతాను బిడ్డ సర్కారు దావకానకు అనే రీతిలో వైద్యం అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పనిచేస్తుందని ఆయన తెలిపారు. సభ అనంతరం మంత్రి హరీష్‌ ‌రావును మునిసిపల్‌ ‌చైర్మన్‌ ‌తుమ్మల పాండురంగారెడ్డి ఘనంగా సత్కరించి మెమొంటోను బహుకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ‌శరత్‌ ‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ ‌రాజర్షి షా, మున్సిపల్‌ ‌వైస్‌ ‌చైర్మన్‌ ‌నందారం నరసింహ గౌడ్‌, ‌కమిషనర్‌ ‌సుజాత, ఎమ్మార్వో విజయ్‌ ‌కుమార్‌, ‌తదితరులు పాల్గొన్నారు.

ఇక్కడి వైద్య సేవలకు వందకు వంద శాతం మార్కులు వేస్తా…
పటాన్‌ ‌చెరు ఏరియా ఆసుపత్రిలో మంత్రి హరీశ్‌ ‌రావు అడిగిన ప్రశ్నకు ఓ అవ్వ సమాధానం. బిడ్డ డెలివరీ కోసం దవాఖానకు వచ్చిన మహబూబ్‌ ‌నగర్‌ ‌కు చెందిన అవ్వ సీఎం కేసీఆర్‌ ఇచ్చిన కల్యాణ లక్ష్మి అందుకున్నాము.. మనువరాలు పుట్టింది.. ఇక్కడి దవాఖానాలో మంచి వైద్యం అందుకుంటు న్నామని సంతోషంగా చెప్పింది.చదువు కోలేదు కానీ ఇక్కడి వైద్యులకు 100 మార్కులిస్తానంది .అవ్వ మాటలకు ఆనందం వ్యక్తం చేసిన మంత్రి హరీశ్‌ ‌రావు ఆ బాలింతకు కేసీఆర్‌ ‌కిట్‌ అం‌దజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page