క్లౌడ్‌ ‌బరస్ట్ ‌తో మేఘాలకు చిల్లు..!

‘‘‌కేసీఆర్‌ ‌కామెంట్లతో క్లౌడ్‌ ‌బరస్ట్ అం‌టే ఏమిటి? మేఘాల విస్ఫోటనంతో వరదలు స్పష్టించవచ్చా? ఒక ప్రాంతాన్ని టార్గెట్‌ ‌చేసి కుండపోతగా వర్షాలు కురిపించవచ్చా? ఒకటి, రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా రసవత్తరమైన చర్చ జరిగిన, భూతాపం పెరిగి ప్రకృతి ఉత్ఫాతాలు సంభవిస్తున్నాయంటూ 2010నుంచి అనేక కథనాలు వస్తున్నాయి. క్లౌడ్‌ ‌బరస్ట్ ‌లేదా గెరిల్లా వర్షపు తుఫాను అనేది వాతావరణ సంస్థచే నిర్వచించబడిన శాస్త్రీయమైన పదం మాత్రం కాదు,ఈ పదానికి 1969లో యోమియురి షింబున్‌ ‌జపానీస్‌ ‌వార్త పత్రికలో ఉపయోగించ బడింది.’’

గోదావరి పరివా హిక ప్రాం తం గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలతో ఉగ్ర రూపం దాల్చి బేజారు చేసింది. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా జన జీవనాన్ని అతులాకుతలం చేసింది. బాధితులు వరద ఉదృతికి బిక్కు,బిక్కూ మంటూ చిరిగిన బట్టలతో, పేరుకపోయిన బురదతో ఎముకలు కొరికే చలిలో అపన్న హస్తం కోసం ఎదురు చూసారు .. గోదావరి తీరాన పోటెత్తిన వరద,జల ప్రళయంలో చిక్కుకున్న వరద ప్రభావిత ప్రాంతాలలో జరిగిన విపత్తు నష్టం పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి నివారణ చర్యలు చేపట్టారు.తొలుత భద్రాచలం సారపాక వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్‌ ‌కు అధికారులు, ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదీ ప్రవాహాన్ని, పరిసర ప్రాంతాలను బ్రిడ్జి మీద నుంచి సీఎం కేసీఆర్‌ ‌పరిశీలించారు. అక్కడ గంగమ్మ తల్లికి సీఎం కేసీఆర్‌ ‌శాంతి పూజలు జరిపారు. పసుపు, కుంకుమలు చల్లి సారె, సమర్పిచారు. ప్రకృతి విపత్తుతో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో హెలీకాప్టర్లో ఏరియల్‌ ‌సర్వే నిర్వహించారు. చేపట్టవలసిన చర్యలపై అధికారులకు సూచనలిచ్చారు. వరద ముంపు బాధిత కుటుంబాలకు రూ. 10వేల చొప్పున ఆర్థిక సాయం, 20కిలోల బియ్యం అందజేస్తామని అపన్నహస్తం అందించారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత వచ్చిన గోదావరి 71.9 అడుగులను దాటి 1990 రికార్డును బద్దలు కొట్టింది. ముంపు ప్రాంతాల బాధితులను పరామర్శించి సమీక్ష జరిపారు.క్లౌడ్‌ ‌బరస్ట్ అనే కొత్త పద్దతి ద్వారా దేశంలో ఆకస్మిక వరదలు స్పష్టిస్తున్నారని, గతంలో 2013 ఉత్తరాఖండ్‌లోనూ, 2016 కశ్మీర్‌ ‌లో లద్దాఖ్‌, ‌లేహ్‌లో ఇతర దేశాల వాళ్లు అక్కడక్కడ క్లౌడ్‌ ‌బరస్ట్ ‌చేశారని 2016 లో కేంద్రమంత్రి ‘అనిల్‌ ‌మాధవ్‌ ‌దవే’ పార్లమెంట్‌ ‌సాక్షిగా చెప్పిన విషయాన్నిగుర్తు చేశారు. అదే తరహలో గోదావరి వరదలకు కూడా క్లౌడ్‌ ‌బరస్ట్ ‌కుట్ర జరిగి ఉండవచ్చని సీఎం కేసీఆర్‌ అనుమానం వ్యక్తం చేశారు.

కేసీఆర్‌ ‌కామెంట్లతో క్లౌడ్‌ ‌బరస్ట్ అం‌టే ఏమిటి? మేఘాల విస్ఫోటనంతో వరదలు స్పష్టించవచ్చా? ఒక ప్రాంతాన్ని టార్గెట్‌ ‌చేసి కుండపోతగా వర్షాలు కురిపించవచ్చా? ఒకటి, రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా రసవత్తరమైన చర్చ జరిగిన, భూతాపం పెరిగి ప్రకృతి ఉత్ఫాతాలు సంభవిస్తున్నాయంటూ 2010నుంచి అనేక కథనాలు వస్తున్నాయి. క్లౌడ్‌ ‌బరస్ట్ ‌లేదా గెరిల్లా వర్షపు తుఫాను అనేది వాతావరణ సంస్థచే నిర్వచించబడిన శాస్త్రీయమైన పదం మాత్రం కాదు,ఈ పదానికి 1969లో యోమియురి షింబున్‌ ‌జపానీస్‌ ‌వార్త పత్రికలో ఉపయోగించ బడింది. ‘‘క్లౌడ్‌ ‌బరస్ట్’’ అనేది తక్కువ వ్యవధిలో తీవ్ర వర్షపాతం వరద పరిస్థితులను సృష్టించగలదు. ‘‘క్లౌడ్‌ ‌బరస్ట్ ‘‘‌లు త్వరగా పెద్ద మొత్తంలో నీటిని డంప్‌ ‌చేయగలవు, ఉదా. 25 మిమీ వర్షపాతం చదరపు కిలోమీటరుకు 25,000 మెట్రిక్‌ ‌టన్నులకు అనుగుణంగా ఉంటుంది (1 అంగుళం ఒక చదరపు మైలుపై 72,300 చిన్న టన్నులకు అనుగుణంగా ఉంటుంది). ఏది ఏమైనప్పటికీ, ‘‘క్లౌడ్‌ ‌బరస్ట్’’ ‌చాలా అరుదుగా ఉంటాయి, ఎందుకంటే అవి ఓరోగ్రాఫిక్‌ ‌లిఫ్ట్ ‌ద్వారా లేదా అప్పుడప్పుడు ఒక వెచ్చని గాలి పార్శిల్‌ ‌చల్లటి గాలితో కలిసినప్పుడు మాత్రమే సంభవిస్తాయి, ఫలితంగా ఆకస్మిక ఘనీభవనం ఏర్పడుతుంది. ‘క్లౌడ్‌ ‌బరస్ట్’ అనే పదం మేఘాలు నీటి బుడగలను పోలి ఉంటాయి మరియు పేలవచ్చు అనే భావన నుండి ఉద్భవించింది, ఫలితంగా వేగవంతమైన అవపాతం ఏర్పడుతుంది.ఈ ఆలోచన అప్పటి నుండి తిరస్కరించ బడినప్పటికీ, ’క్లౌడ్‌ ‌బరస్డ్’ ‌పదం ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది.క్లౌడ్‌ ‌బరస్ట్ అనేది కొత్త పద్దతేదో వచ్చిందని అమెరికా అలస్కాలో హై ఫ్రీక్వెన్సీ యాక్టీవ్‌ అరోరల్‌ ‌రిసెర్చ్ ‌ప్రోగ్రామ్‌ (‌హార్ఫ్) ‌ప్రాజేక్ట్ ‌పరిశోధనలో భాగంగా కుట్ర జరిగిందా ? అనే అనుమానం కూడ దాపరించింది.ఇలాంటి ప్రయోగాలు రహస్యంగా చేయడంకష్టం అని శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచంలో ఎక్కువగా ఆసియా తూర్పు దేశాల్లో విస్ఫోటనం 80% సంభవిస్తున్నాయి. వాతావరణ శాఖ వివరాల ప్రకారం ఒక చిన్న ప్రదేశంలో ఒక గంటలో 10 సెంటిమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వర్షం కురిస్తే దాన్ని క్లౌడ్‌ ‌బరస్ట్ అం‌టారు. ఒక్కోసారి ఒకే ప్రాంతంలో ఒకటి కన్నా ఎక్కువసార్లు మేఘాల విస్ఫోటనం సంభవించే అవకాశం ఉంటుంది. అది అక్కడి భౌగోళిక, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మన దేశంలోని ఉత్తర ప్రాంతాల్లో మే నుంచి ఆగస్ట్ ‌వరకు క్లౌడ్‌ ‌బరస్ట్ ‌వాతావరణ పరిస్థితులు కనిపిస్తాయి. నదులు, సరస్సులు ఉన్న ప్రాంతంలో క్లౌడ్‌ ‌బరస్ట్ ‌జరిగితే అపార నష్టం జరగనుంది. ప్రాణ, ఆస్తినష్టం భారీగా జరుగుతూ ఉంటుంది, వరదలనుండి కాపాడేందుకు ఆయా ప్రాంత ప్రజలను హెచ్చరించేందుకు ‘నైలో మీటర్‌’ ‌సాధనాన్ని ఉపయోగిస్తారు. మన దేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే చిరపుంజి లాంటి ప్రాంతాల్లో క్లౌడ్‌ ‌బరస్ట్ ఎక్కువగా సంభవిస్తుంటాయి. వరద నీరు ఒకే దగ్గర ఉండదు, లోతట్టు ప్రాంతానికి ప్రవహిస్తూనే ఉంటుంది. వరద వచ్చే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో జనాలు ఉండరు. అందుకే అక్కడ క్లౌడ్‌ ‌బరస్ట్ అయినా ప్రాణ, ఆస్తి నష్టాలు జరగవు. ఒకటి నుంచి పది కిలోమీటర్ల లోపు ఉన్న ప్రాంతాల్లో తేమతో కూడిన భారీ మేఘాలు ఢీకొనడం వలన క్లౌడ్‌ ‌బరస్ట్ ‌జరుగుతుంది. రాడార్‌ ‌సహాయంతో ఎక్కడెక్కక భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేయగలుగుతుంది.కానీ ఏ ప్రాంతంలో క్లౌడ్‌ ‌బరస్ట్ ‌జరగవచ్చన్నది అంచనా వేయడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా సరైన సమయంలో ఋతువులు రాక వర్షాభావ పరిస్థితులు తలెత్తుతున్నాయి.దీంతో సరైన సమయంలో పంటలు పండక రైతులు, ప్రజలు నానా అవస్తలకు గురౌతున్నారు. దశాబ్దాల ముందే అమెరికాలో ‘‘క్లౌడ్‌ ‌సీడింగ్‌’’ (‌కృత్రిమ వర్షం) జరిగింది. వాయుమండలంలోకి వివిధ రకాల పదార్థాలను పంపించిన తర్వాత రసాయనిక క్రియలతో మేఘాలలో ఇవి మార్పులు తీసుకు వస్తాయి.దీంతో వర్షాలు కురుస్తాయి.ఇలాంటి ప్రయోగాలలో దాదాపు 25నుంచి 40శాతం వర్షాలు కురుస్తున్నాయని, కొరోనా మహామ్మారిని పుట్టించిన చైనా దేశం క్లౌడ్‌ ‌సీడింగ్‌ ‌పద్దతిని అవలంబించి 2008లోజరిగిన బీజింగ్‌ ఒలింపిక్స్ ‌సమయంలో ఆటలు సజావుగా సాగేందుకు ముందే వర్షాలను కురిపించిన చైనా లాంటి దేశాలు క్రౌడ్‌ ‌బరస్ట్ ‌చేయలేదనే నమ్మకం ఎట్లా అని సాంకేతిక నిపుణులు వ్యాఖ్యానించడం గమనార్హం.ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ విధానాలు, గెరిల్ల దాడులు, కాల్పుల మోతతో దద్దరిల్లే గోదావరి పరివాహిక ప్రాంతం ఈ విస్ఫోటనం వెనుక నిజంగానే కుట్ర ఉందా? అన్న కోణంలో అడవితల్లి ఇన్వెస్టిగేటివ్‌ ‌మొదలు పెట్టిందంటే అతిశయోక్తి కాదు. వాతావరణంలో సంభవించే మార్పుల వల్ల ఇట్లాంటి ఉత్పాతాలు వస్తూ ఉంటాయి కాబట్టి, విపక్షాలు రాజకీయాలు చేయకుండా సాటి ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.నష్ట నివారణ చర్యలను సమీక్ష చేయకుండా పోటా,పోటిగా ముంపు గ్రామాలను పరిశీలించిన గవర్నర్‌ ‌తమిళి సై రాష్ట్ర ప్రజలకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెల్లి, ‘జాతీయ విపత్తు’ గా ప్రకటించే విదంగా నిర్వాసితులను అక్కున చేర్చుకుంటుందో వేచి చూడాలి.

dr sangani mallesam
డా.సంగని మల్లేశ్వర్‌,‌జర్నలిజం విభాగాధిపతి,
కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్‌.9866255355

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page