వరద ప్రాంతాల్లో నేడు సిఎం కెసిఆర్‌ ఏరియల్‌ ‌సర్వే

  • గోదావరి తీర ప్రాంతాల్లో హెలికాప్టర్‌ ‌ద్వారా పరిశీలన
  • భదాద్రిలో అధికారులతో సీఎం కేసీఆర్‌ ‌సమీక్ష సమావేశం

గోదావరి పరీవాహక ప్రాంతంలో పోటెత్తిన వరదల నేపథ్యంలో నేడు ఏరియల్‌ ‌సర్వే చేపట్టాలని సీఎం కేసీఆర్‌ ‌నిర్ణయించారు. ఈ మేరకు సీఎంఓ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆదివారం ఉదయం సిఎం ఏరియల్‌ ‌సర్వే చేపట్టనున్నారని వెల్లడించింది. కడెం నుంచి భద్రాచలం వరకున్న గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఏరియల్‌ ‌సర్వే కొనసాగుతుందని తెలిపింది. ఈ సర్వేలో సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాల్గొననున్నారని వెల్లడించింది. దీనికి సంబంధించి హెలికాప్టర్‌ ‌రూటు సహా తదితర విధి విధానాలను అధికార యంత్రాంగం పర్యవేక్షించి రూట్‌ను ఫైనల్‌ ‌చేయనుంది. ఇక ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని వైద్యశాఖ అధికారులను సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ఆదేశించారు.

సహాయక చర్యల్లో స్పీడ్‌ ‌పెంచాలని సూచించారు. గోదావరి వరద ముంపు ప్రాంతాల్లోని హాస్పిటల్‌కు చెందిన డాక్టర్లు, ఉన్నతాధికారులతో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు సవి•క్షా సమావేశాన్ని నిర్వహించారు. సీఎం ఏరియల్‌ ‌సర్వే చేపట్టనున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన కార్యాచరణపై వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తుంది. ప్రజారోగ్య సంరక్షణలో భాగంగా, వరదల వల్ల అంటువ్యాధులు ప్రబలకుండా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గోదావరి వరద ముంపు ప్రాంతాల్లోని దవాఖానాలకు చెందిన డాక్టర్లు, ఉన్నతాధికారులతో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు సవి•క్షాసమావేశాన్ని నిర్వహించనున్నారు. నేడు ఏటూరునాగారంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు పర్యటించనున్నారు. అటు భూపాలపల్లి జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్‌ ‌పర్యటిస్తున్నారు.

భదాద్రిలో అధికారులతో సీఎం కేసీఆర్‌ ‌సమీక్ష సమావేశం
భద్రాచలం : గత వారం రోజులుగా గోదారి వరదలతో అతలాకుతలమైన భద్రాచలం డివిజన్లో ఆదివారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఏరియల్‌ ‌సర్వే నిర్వహించనున్నారు. ఆ తర్వాత పునరవాస కేంద్రాల్లో ఉన్న ముప్పుబాధితులు పరామర్శించనున్నారు. పంపు బాధితులకు అందుతున్న సౌకర్యాలను ఆయన నేరుగా అడిగి తెలుసుకోనున్నారు. అలాగే గతంలో నిర్మించిన వరద నిరోధక కరకట్ట గోదావరి వరద ఎక్కువ వస్తే పట్టణానికి ఇబ్బందికరంగా ఉన్న దృశ్య కర్కట ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. అనంతరం అధికారి యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. కర్కట సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకొని ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌భద్రాచలం పర్యటన ప్రజల్లో ఆసక్తిగా మారింది. భద్రాచలం అభివృద్ధి పట్ల ఎటువంటి ప్రకటన చేస్తారని ప్రజలు ఎంతో ఆశతో ఉన్నారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం జిల్లా అధికారి యంత్రాంగం ఇప్పటికి అన్ని ఏర్పాట్లు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page