‌ద్రౌపది ముర్మును గెలిపించుకోవాల్సి ఉంది

రాష్ట్రపతిగా గిరిజన మహిళను గెలిపించుకుందాం
ద్రౌపది ముర్ముకు మద్దతు పలికిన సిఎం జగన్‌
ఆమెకు మద్దతుగా సభ నిర్వహణ..ఘనంగా సన్మానం
మోదీ తరఫున కృతజ్ఞతలు తెలిపిన కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి

అమరావతి,జూలై12 : ద్రౌపది ముర్మును గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని సిఎం జగన్‌ అన్నారు. రాష్ట్రపతిగా గిరిజన మహిళను గెలిపించుకుందామని సూచించారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముర్ముకు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎన్నికలకు ముందు మాక్‌ ‌పోలింగ్‌ ‌నిర్వహిస్తామని జగన్‌ ‌పేర్కొన్నారు. ఓటు వేసే ముందు కచ్చితంగా మాక్‌ ‌పోలింగ్‌లో పాల్గొనాలన్నారు. ఎమ్మెల్యేలు వచ్చి ఓటు వేసేలా మంత్రులు బాధ్యత తీసుకోవాలని వ్యాఖ్యానించారు. ఎపిచేరుకున్న ద్రౌది ముర్మకు ఘనస్వాగతం లభిచింది. మంగళగిరి సీకే కన్వెన్షన్‌ ‌సెంటర్‌లో మంగళవారం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ద్రౌపది ముర్ము సమావేశం అయ్యారు. సీకే కన్వెన్షన్‌ ‌సెంటర్‌కు రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము, సీఎం జగన్‌ ‌చేరుకున్నారు. ద్రౌపది ముర్మును సీఎం జగన్‌ ‌సన్మానించారు. అనంతరం స్టేజీపై సీఎం వైఎస్‌ ‌జగన్‌.. ‌ద్రౌపది ముర్ముకు పుష్ఫగుచ్చం అందించి శాలువతో సత్కరించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల మద్దతు కోరుతున్నారు. ఈ సందర్భంగా జగన్‌ ‌మాట్లాడారు.

సామాజిక న్యాయంలో భాగంగా ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ద్రౌపది ముర్ముకు వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు సీఎం జగన్‌ ‌తెలిపారు. వైఎస్సార్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ తరపున మొత్తం 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులంతా ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని, ఓటేయాలని సీఎం జగన్‌ ‌కోరారు. రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారి గిరిజన మహిళకు అవకాశం లభించింది. మొదటి నుంచి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపిస్తూ వస్తోంది. కాబట్టి, సహృదయంతో పార్టీ నిర్ణయాన్ని బలపర్చాలని పార్టీ ప్రతినిధులను సీఎం జగన్‌ ‌కోరారు. అంతేకాదు ఒక్క ఓటు కూడా వృథా కాకూడదని, జులై 18న మాక్‌ ‌పోలింగ్‌ ‌కూడా నిర్వహిస్తామని, మాక్‌పోలింగ్‌లో పాల్గొన్న తర్వాతే ఓటింగ్‌కు వెళ్లాలని సభ్యులకు సూచించారు. ఎంపీల తరపున విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డిలు బాధ్యతలు తీసుకుంటారని, అలాగే విప్‌లు, మంత్రులు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం జగన్‌ ‌స్పష్టం చేశారు.

అనంతరం వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధుల ను ముర్ముకు సీఎం జగన్‌ ‌పరిచయం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. వారసత్వ కట్టడాలకు ఆంధప్రదేశ్‌ ‌నిలయం. ఆంధప్రదేశ్‌కు ఘనమైన చరిత్ర ఉంది. ఎందరో మహనీయులు తెలుగు గడ్డపై జన్మించారు. ఈక్రమంలో తెలుగు కవులైన నన్నయ్య, తిక్కన, ఎరప్రగడలను ముర్ము స్మరించుకున్నారు.తిరుపతి, లేపాక్షి వంటి ప్రసిద్ధ క్షేత్రాలకు ఏపీ నిలయం. స్వాతంత్య స్రమరంలో ఏపీకి ఘన చర్రిత ఉంది. ఈ పోరాటంలో రాష్ట్ర మహనీయులు కీలక ప్రాత పోషించారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ ఇం‌డియా ఉద్యమంతో కీలక పాత్ర పోషించారు. రాష్ట్రంలో ప్రకృతి సహజసిద్దమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని అన్నారు. అనంతరం ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతు కోరారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ తరఫున సీఎం వైఎస్‌ ‌జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైఎస్సార్‌సీపీ మద్దతు పలకడం సంతోషం అన్నారు. అందరితో చర్చించాకే ద్రౌపది ముర్మును అభ్యర్థిగా ప్రకటించామని అన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారి గిరిజనమహిళకు అవకాశం లభించింది. పార్టీలకు అతీతంగా ముర్ముకు అందరం మద్దతు పలకాలని కిషన్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page