- ఒక్కో క్లస్టర్‌కు ఇన్‌ఛార్జులుగా కేంద్రమంత్రులు
- హైదరాబాద్ క్లస్టర్ ఇంచార్జ్‌గా కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య
- ప్రజల్లోకి జాతీయకార్యవర్గ సమావేశాల నిర్ణయాలు
హైదరాబాద్, జూలై 5 : తెలంగాణలోని లోక్‌సభ స్థానాలను బీజేపీ క్లస్టర్లుగా విభజించింది. 3, 4 లోక్‌సభ నియోజకవర్గాలు కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసింది. క్లస్టర్ ఇంచార్జ్‌లుగా కేంద్రమంత్రులకు బాధ్యతలు అప్పగించింంది. హైదరాబాద్ క్లస్టర్ ఇంచార్జ్‌గా కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా, వరంగల్ క్లస్టర్ ఇంచార్జ్‌గా కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్, ఆదిలాబాద్ క్లస్టర్ ఇంచార్జ్‌గా కేంద్రమంత్రి పురుషోత్తమ్, జహీరాబాద్ క్లస్టర్ ఇంచార్జ్‌గా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, మహబూబ్‌నగర్ క్లస్టర్ ఇంచార్జ్‌గా మహేంద్రనాథ్ పాండేలకు బాధ్యతలు అప్పగించింది. ప్రధాని నరేంద్రమోడీ బహిరంగ సభ సక్సెస్ తో జోష్ దున్న బీజేపీ పార్టీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీని బలోపేతం చేయడం కోసం జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించిన కీలక నిర్ణయాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది.
ఇందుకోసం 7 పాయింట్స్ ఫార్ములాను రూపొందించింది. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ అధ్యక్షతన పదాధికారుల సమావేశం జరిగింది. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను పదాధికారులకు బండి సంజయ్ వివరించారు. పదాధికారుల సమావేశానికి బండి సంజయ్ తో పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రఘునందన్ రావు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంచార్జీలు హాజరయ్యారు. పార్టీ బలోపేతం కోసం సెవెన్ పాయింట్స్ ఫార్ములా అమలు చేయాలని నిర్ణయించారు. మొదటి సారి ఓటు వేసేవారిని బీజేపీ వైపు మళ్లించేందుకు కృషి చేయాలని నిర్ణయించారు. మూడు నెలలపాటు పార్లమెంట్ ప్రవాస్‌యోజన కార్యక్రమం చేపడుతామని బీజేపీ నేతలు అన్నారు.
ఇందులో భాగంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కేంద్రమంత్రులు, జాతీయ నేతలు 48గంటల పాటు పర్యటించనున్నారు. పార్లమెంట్ ప్రభారి, పార్లమెంట్ కన్వీనర్, పార్లమెంట్ ఫుల్ టైం కార్యకర్తలతో త్రిసభ్య కమిటీ వేయాలని నిర్ణయించారు. అదేవిధంగా.. అసెంబ్లీల పరిధిలో అసెంబ్లీ ప్రభారి, అసెంబ్లీ కన్వీనర్, అసెంబ్లీ ఫుల్ టైం కార్యకర్తలతో మరో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. కేందప్రభుత్వ పథకాలు, జాతీయ, రాష్ట్ర పార్టీ కార్యక్రమాలను వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఈ కమిటీకి బాధ్యతలు అప్పగిస్తామన్నారు.
ద్రౌపతి ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికైన వెంటనే గిరిజన తాండాలు, గ్రామాల్లో ఆమె చిత్ర పటాలతో ర్యాలీలు నిర్వహించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. మరోవైపు పదాధికారుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై బీజేపీ స్టేట్ చీఫ్ బండిసంజయ్ మండిపడ్డారు. బీజేపీ టింగ్ ఉందని పోటీగా టీఆర్ఎస్ ప్లెక్సీలు, బ్యానర్లు పెట్టి చిల్లర రాజకీయం చేసిందన్నారు. రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థి ప్రచారానికి వస్తే ప్లెక్సీలు పెట్టడం బండిసంజయ్ ఏంటని ప్రశ్నించారు.