వర్షాకాలం వచ్చేసింది. జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు వున్నాయి.ఇప్పటికే జ్వరాలు,దగ్గు,తుమ్ములు,జలుబు,
ఈ మధ్య కాలంలో పై స్థాయి సిబ్బంది వారి పర్యవేక్షణ కరువై గ్రామాలలో ,నగరాలు,పట్టణాల్లో డ్రైనేజ్ కాలువలు అపరిశుభ్రతకు నిలయాలుగా మారాయి. దీంతో అయా గ్రామాలలోని,పట్టణాల లోని ప్రజలు కాలువలలో చెత్త పేరుకుపోవడం మూలాన దోమల బెడద ఎక్కువై డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా వివిధ రోగాలు స్వల్పం గా ప్రభావం చూపుతూ వున్న గ్రామ పంచాయితీ,కార్పొరేషన్,మునిసి
ఇక ఖాలీ స్థలాలలో గుట్టలు, గుట్టలుగా పెరిగిపోయిన ముళ్ల పొదల గురించి ఎంత చెప్పిన తక్కువే. ఈ ముళ్ల పొదల మూలాన గృహస్తులకు పాముల బెడద ఎక్కువగా ఉంటుంది అని తెలిసినప్పటికీ పై స్థాయి అధికారులలో ఏమాత్రం చలనం ఉండటం లేదు. ఈ విషయం లో ఎన్నిమార్లు ప్రజలు గ్రామ పంచాయితీ సిబ్బందికి మొర పెట్టినా అవి బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోతున్నాయి తప్ప ఫలితం ఏమాత్రం కానరావడం లేదు.. దీంతో గ్రామ,పట్టణ ప్రజలు చేసేదేమి లేక తీవ్ర అసహనానికి గురి అవుతూ అపరిశుభ్ర వాతావరణం తోనే సావాసం చేస్తూ వున్నారు.
ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతుండటం ఏ మాత్రం భావ్యమో గ్రామ పంచాయితీ,పట్టణ ప్రాంతాల్లో పని చేసే వారెకే,వారి వివేకానికే వదిలేయాలి.ఇలా గ్రామంచాయితీ సిబ్బంది వారి అలసత్వం మూలాన పచ్చని ప్రకృతి సోయగాలతో, ప్రశాంత వాతావరణం తో అలరారే గ్రామాలు వ్యాధులకు కేర్ అఫ్ అడ్రస్ గా మారుతుండటం అత్యంత దురదృష్టకరమైన, బాధాకరమైన విషయం. ఏది ఏమైనా ఇప్పటికైనా గ్రామ పంచాయితీ సిబ్బంది,నగర,మునిసిపల్,కార్
అలా చేసినప్పుడే అయా గ్రామాల,నగరాలు,పట్టణాల ప్రజలు ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా మంచి ఆయురారోగ్యాలతో పది కాలాల పాటు జీవించగలుగుతారు. తత్పలితంగా మన పట్టణాలు, గ్రామాలు,నగరాలు ప్రగతికి, అభివృద్ధికి పర్యాయపదంగా నిలుస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటూ పూర్వవైభవాన్ని సంతరించుకునే దిశగా పురోగమిస్తాయి.అధికారులు నిత్యం గ్రామాలు,పట్టణాలలో పారి శుద్ధ కార్మికులు చెత్త సక్రమంగా తొలగిస్తూ వున్నారా,లేదా అనే విషయం మీద వారానికి ఒక సారి సమీక్ష నిర్వహించాలి. తెలంగాణ రాష్ట్రం లోని ప్రతీ గ్రామం,పట్టణం పరిశుభ్రంగా వుండేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలి.బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే వారిని గుర్తించి వారికి జరిమానలు విధించాలి.పల్లె ప్రగతి ,పట్టణ ప్రగతి లో మాత్రమే వీధులు,రోడ్లు ,నాళాలు శుభ్రం చేస్తూ వున్నారు.అలా కాకుండా ప్రతీ రోజు గ్రామ,పట్టణం,నగరాలలో వీధులు శుభ్రం చేయడం తో పాటు నాలాలు,మురికి కాలువలో చెత్త ను తొలగించాలి. సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని మనవి.
– కామిడి సతీష్ రెడ్డి జడలపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
.’’9848445134