తప్పని మరో పోరాటం

ఉపాధ్యాయుల  బదిలీలు, పదోన్నతుల కోసం..

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే విద్యారంగం అభివృద్ధి చెంది,నిరుద్యోగ సమస్య తీరుతుందని భావించిన తెలంగాణ సమాజం మోసపోయింది.కెజి.టు పీజి అని ప్రగ ల్భాలు పలికిన ప్రభుత్వం రాష్ట్రంలో సర్కార్‌ ‌చదువులకు సమాధి కడు తున్నది.ఈ ఎనిమిదేళ్ళుగా వేలాది సర్కార్‌ ‌బడులను మూసేసి,రాష్ట్ర బడ్జెట్‌ ‌లజ 16 శాతం పైగా వుండే విద్యశాఖ నిధులను 6.7శాతానికి తగ్గించింది.పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలు లక్షల సంఖ్యలో సర్కార్‌ ‌బళ్ళలో చేరుతుంటే సర్కార్‌ ‌బళ్ళ సమస్యలు పరిష్కరించటంలో నిమ్మకు నీరెత్తినట్లున్నది. ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కరిస్తే సర్కార్‌ ‌బళ్ళలో తరగతి గదులలో నాణ్యమైన విద్య , బోధన జరుగుతు ందన్న ప్రభుత్వ అవగాహన రాహిత్యం విద్యారంగాన్ని గందర గోళంలోకి నెడుతున్నది.

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖలో ఉపాధ్యాయులకు నాలుగేళ్ళుగా బదిలీలు, ఏడేళ్ళుగా పదోన్నతులు లేవు. పదిహేడేళ్ళుగా పర్యవేక్షణ అధికారుల పోస్టులు భర్తీ కాక విద్యాశాఖలో తీవ్ర సంక్షోభం నెలకొన్నది..10478 అప్గ్రేడేషన్‌ ‌పై ఉన్న న్యాయ వివాదాల పరిష్కారంలో ప్రభుత్వం చొరవ చూపటం లేదు. ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఉపాధ్యాయుల సమస్య మాత్రమే కాదు విద్యార్థులది కూడా అన్న ఇంగితం లేకుండా పోయింది. ప్రమోషన్లు ఇస్తే ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్ ‌టీచర్ల కొరత తీరుతుంది.విద్యార్థులకు నాణ్యమైనవిద్య అందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మన ఊరు మన బడి, ఇంగ్లీషు మీడియం పథకాలు సక్రమంగా అమలు జరగాలంటే కూడా పాఠశాలల్లో ఉపాధ్యాయుల, పర్యవేక్షణ అధికారుల కొరత తీర్చాల్సిన అవసరం ఉన్నది. ఉపాధ్యాయుల పదోన్నతుల అనంతరం క్రింది క్యాడర్లలో ఏర్పడిన ఖాళీలకు ప్రత్యక్ష నియామకాలు చేపట్టాలి. ఈలోగా తాత్కాలిక ఉపాధ్యాయులను (విద్యావా లంటీర్లను) నియమించాలంటే ప్రభుత్వం పట్టించుకోవటం లే దు.కోవిడ్‌ ‌కు ముందు పదిహేను వేలమంది విద్యావాలం టీర్లు పనిచేశారు. వారిని రీ ఎంగేజ్‌ ‌చేయటంలేదు. పాఠశాలల పారిశుద్ధ్య నిర్వహణ కోసం సర్వీస్‌ ‌పర్సన్స్ ‌నియామకానికి గత రెండు సంవత్సరాలుగా అనుమతించటం లేదు.గ్రామ పంచాయతీలు/ మునిసిపాలిటీలకు అప్పగించామన్నారు. ఇప్పుడు పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ ఎంత అధ్వాన్నంగా ఉందో మనకు తెలిసిందే. బడులకు రంగులేసి అందంగా తీర్చిదిద్దుతున్నామని ప్రచారం చేసుకుంటే సరిపోదు.బోధించే ఉపాధ్యాయులుండాలి. పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు సకాలంలో సరఫరా చేయాలి. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగాలి. అప్పుడు మాత్రమే సర్కారీ చదువులపట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది.

రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకువచ్చి అమలు చేసిన జిఓ 317 వలన వేలాది మంది ఉపాధ్యాయులకు తీరని నష్టం జరిగింది. అర్ధాంతరంగా చేపట్టిన ఉద్యోగుల విభజన కారణంగా నష్టపోయిన ఉపాధ్యాయులు చేసుకున్న అప్పీల్స్ ‌పరిష్కారం చేయటంలో అసాధారణ జాప్యం జరుగుతోంది. జూనియర్‌ ఉపాధ్యాయులు స్థానికతను కోల్పోయారు. భార్యాభర్తలు వేర్వేరు జిల్లాలకు కెటాయించబడి వేదన చెందుతున్నారు. వితంతువులు, ఒంటరి మహిళలను ప్రత్యేక కేటగిరీగా పరిగణించమంటే పట్టించుకోలేదు.అలాంటి వారందరూన్యాయం కోసం హైకోర్టు బాట పట్టాల్సివచ్చింది. జిఓ 317 సృష్టించిన విలయం నుండి బయట పడటానికి ఉపాధ్యాయులు పదే పదే రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పాఠశాలలు ప్రారంభమైనా కుటుంబాలను స్థిరపరచుకోలేక తీవ్రమైన మానసిక వత్తిడికి లోనౌతున్నారు. న్యాయమైన సమస్యల పరిష్కారంలో నిబంధనల పేరిట తాత్సారం చేస్తున్న అధికారులు ఏలినవారి ప్రాపకం కలిగిన వారికి, పైరవీ చేసుకున్న వారికి నిబంధనలతో నిమిత్తం లేకుండా జిల్లాలు దాటించి కోరుకున్న స్థానాలను కట్టబెడుతున్నారు. పరస్పర బదిలీల ప్రహసనం ఇంకా కొనసాగుతోంది. తొలివిడత చేసిన మూడు వేల బదిలీల్లో 300 పైగా గల్లంతయ్యాయి. అందుకు నిస్సందేహంగా ప్రభుత్వం బాధ్యత వహించాలి. స్వల్ప కారణాలకే ఉపాధ్యాయులను కఠినంగా దండించే అధికారులు వారి నిర్లక్ష్యం పై ఏంచర్యలు తీసుకు న్నారనేది ప్రభుత్వం ప్రకటించాలి.

ఉపాధ్యాయ సమస్యలపై ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యుయస్పీసి) ఆధ్వర్యంలో పలుమార్లు విద్యామంత్రిని కలిసి చర్చించారు.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, విద్యాశాఖ కార్యదర్శికి వినతి పత్రాలు ఇచ్చారు..సమస్యల పరిష్కారంలో పురోగతి లేకపోవటంచేత మే 18న జిల్లా కేంద్రాల్లో వేలాది మంది ఉపాధ్యాయులు ధర్నాలు నిర్వహించి,నిరసన వ్యక్తం చేశారు. ఎస్సెస్సీ మూల్యాంకన కేంద్రాలవద్ద ఆందోళన చేశారు. అయినా ప్రభుత్వం నుండి స్పందన లేకపోవటం విచారకరం. జూన్‌ ‌నెలాఖరులోగా అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ ‌విడుదల చేయని యెడల జులై 7న హైదరాబాద్‌ ‌లో ఉపధ్యాయుల మహాధర్నా నిర్వహిస్తామని యుయస్పీసి పక్షాన ప్రభుత్వానికి నోటీసు ఇచ్చినప్పటికీ చలనం లేదు. విద్యారంగం, ఉపాధ్యాయుల సమస్యలపై వేగంగా స్పందించి పరిష్కరించాల్సిన శాఖాధిపతి (డియస్‌ఈ)ఉపాధ్యాయ సంఘనాయకులకు, సాధారణ ఉపాధ్యాయులకు అందుబాటులో ఉండటం లేదని,కార్యాలయంలో నిర్దిష్టమైన సందర్శన వేళలు పాటించటం లేదనీ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ . ఉపాధ్యాయుల వ్యక్తిగత సర్వీసు సమస్యల పరిష్కారంలో నాన్చుడు ధోరణి కొనసాగుతున్నది.

న్యాయమైన తమ సమస్యలపై ఉద్యమించే ఉపాధ్యాయుల పై బురద చల్లే ప్రచారాలు చేసి పాఠశాలకు,పాఠశాల చుట్టూరా సమాజానికి మధ్య సంబంధాలను కలుషితం చేసే ప్రభుత్వ తీరును ప్రజలు ఎండగడ్తున్నారు. గ్రామాలలో,పట్టణాలలో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించటం పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రజలు ప్రత్యక్షంగా ఉద్యమిస్తున్నారు. విద్యా పరిరక్షణ కమిటీల ద్వారా చైతన్యమవుతూ విద్యార్థి సంఘాల, ఉపాధ్యాయుల పోరాటాలకు మద్దతు పలుకుతుండటం శుభపరిణామం. రాష్ట్ర విద్యారంగంలో నెలకొన్న అపసవ్య ధోరణిని, సమస్యల తీవ్రతను, ఉపాధ్యాయుల్లో ఉన్న అసంతృప్తిని ప్రజల దృష్టికి తీసుకువచ్చి ప్రభుత్వం పై వత్తిడి తేవటానికి ఐక్య ఉద్యమాలు అవసరమని ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు.ఈ మేరకు ఉపాధ్యాయుల ఆకాంక్షలకు అనుగుణంగా యుయస్పీసిఆధ్వర్యంలో జులై 7న హైదరాబాద్‌ ‌ధర్నా చౌక్‌ ‌లో ఉపాధ్యాయుల మహాధర్నా చేపట్టక తప్పటం లేదని ప్రకటిస్తున్నది. సంఘాలకు అతీతంగా సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో మహాధర్నా లోపాల్గొననున్నారు.

– ఎం.రవీందర్‌. (ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ స్టీరింగ్‌ ‌కమిటీ పక్షాన..)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page