వెబ్సైట్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్ అరెస్ట్
న్యూఢిల్లీ, జూన్ 28 : మతపరమైన మనోభావాలను దెబ్బతీయడంతోపాటు, అల్లర్లను రెచ్చగొట్టారని ఆరోపిస్తూ ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్సైట్ ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ట్విటర్లో ఢిల్లీ పోలీసులను ట్యాగ్ చేసిన వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా అతన్ని అరెస్టు చేశారు.జుబైర్‌పై భారతీయ శిక్షాస్మమీతిలోని సెక్షన్లు 153, 295ఎ కింద అభియోగాలు మోపారు. జుబైర్‌ను ఢిల్లీలోని బురారీలోని డ్యూటీ మేజిస్ట్రే నివాసంలో హాజరుపర్చారు.
అనంతరం అతడిని ఒకరోజు పోలీసు కస్టడీకి తరలించారు. మత సామరస్యానికి విఘాతం కలిగించే ట్వీట్ల గురించి ట్విట్టర్ హ్యాండిల్ పోలీసులను అప్రమత్తం చేయడంతో జుబైర్‌ను ఢిల్లీ పోలీసు విభాగం అరెస్టు చేసింది. ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హా మాట్లాడుతూ, జుబైర్ కు నోటీసు ఇవ్వలేదని, పలుసార్లు అభ్యర్థించినా ఎఫ్ఐఆర్ కాపీని ఇవ్వలేదన్నారు.జుబైర్ అరెస్టు నిజంపై దాడిగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అభివర్ణించారు.