సమాజం ముందు తలెత్తుకొని జీవించాలి

‘‘విద్యార్థులకు మార్కులు కాదు.. విజ్ఞానం ముఖ్యమనే విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి. తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి పెంచకూడదు. పిల్లలపై ఫలితాలు వచ్చే సమయంలో ఓ కన్నేసి ఉంచాలి. అధ్యాపకులు కూడా మార్కులు తక్కువగా వచ్చే విద్యార్థులను చిన్నచూపు చూడకూడదు. మార్కులు తక్కువ వచ్చినా, ఫెయిల్‌ అయినా విద్యార్థులు డిప్రెషన్‌కు గురి కాకూడదు. ప్రపంచంలోని మేధావులంతా అంతగా మార్కులు సాధించిన వారుకాదు.’’

ఫలితాలు వెల్లడిలో నెలకొన్న జాప్యం పలు కుటుంబాల్లో తీవ్ర మానసిక ఆందోళనలు గురి చేస్తున్నాయి. తెలంగాణలో ఇంటర్‌ ‌ఫలితాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు కాస్తంత ఉపశమనం లభించింది. మంగళ వారం ఇంటర్‌ ‌ఫలితాలు వెలువడ్డాయి. తమ పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలని ఆశించేది తల్లిదండ్రులే..! బుడిబుడి అడుగుల నుంచి కంటికి రెప్పలా చూసుకుంటూ పిల్లవాడి బంగారు భవిష్యత్తుకు బాటలు సుగమం చేసేది తల్లిదండ్రులే..! పిల్లలకు చిన్న దెబ్బ తగిలినా తమకే తగిలినట్టు విలవిల్లాడేది తల్లిదండ్రులే..! మరి పిల్లలు చేస్తున్నది ఏంటి? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే కన్నవారికి దైర్యంగా ఉండాల్సిన తరుణంలో తల్లిదండ్రులకు మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా వారిపై మార్కుల ఒత్తిళ్లు తేవడం సమంజసమేనా? కొద్దిగా ఆలోచించండి……… చులకనగా చేసిన సమాజం ముందే తలెత్తుకొని జీవించాలి ఇంటర్‌ ‌పరీక్షల్లో ఫెయిల్‌ అయినప్పటికీ విద్యార్థులకు మరో అవకాశం ఉంటుంది. సప్లిమెంటరీలు రాసి మళ్లీ పాస్‌ ‌కావచ్చు. గత పరీక్షల్లో చేసిన పొరపాట్లను సరిదిద్దుకొని ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. చులకనగా చేసిన సమాజం ముందే తలెత్తుకొని జీవించవచ్చు. కానీ ఇదేమీ ఆలోచించకుండా క్షణికావేశంలో విద్యార్థులు మనోవేదనకు లోనవుతున్నారు. పరీక్ష తప్పానని, ర్యాంకులు రాలేదని, ఎక్కువ మార్కులు తెచ్చుకోలేదని, విద్యాపరమైన ఒత్తిళ్లు ఎక్కువయ్యాయని అనేది అక్షర సత్యం..

పిల్లల ఉజ్వల భవిష్యత్తును కోరుకునేది తల్లిదండ్రులే
తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల స్నేహ భావంతో ఉండాలి. పరుష పదజాలంతో దూషించకూడదు. పిల్లల స్నేహాలు, విద్యాలయాలలో వారి ప్రవర్తన, చదువు తీరునూ పరిశీలిస్తుండాలి. చదువు తమ వంశ ప్రతిష్ట అంటూ గర్వాలకు పోకుండా పిల్లల పట్ల సానుకూలంగా ఉండాలి. మార్కులే ధ్యేయంగా పెంచకూడదు. 90% మార్కులు వచ్చిన వారు ఎంత ప్రతిభావంతులో 40% మార్కులు వచ్చిన వారు కూడా అంతే ప్రతిభావంతులనే చిన్న విషయాన్ని పిల్లలకు అర్థం చేయించాలి. ఒకసారి పరీక్షలో తప్పితేనే జీవితం నష్టం పోదనే భరోసా ఇవ్వాలి. మళ్లీ చదివి పాస్‌ ‌కావచ్చనే ధైర్యం ఇవ్వాలి. ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్థులను తిట్టకుండా, వేధించకుండా సముదాయించాలీ, తిరిగి పాసయ్యేలా ప్రోత్సహించాలి. విద్యార్థులు ప్రతి విషయానికి క్షణికావేశానికి లోనుకాకూడదు.మీ సమస్యను స్నేహితులు, తల్లిదండ్రులు, సన్నిహితంగా ఉండే ఉపాధ్యాయులతో చర్చించాలి. ఏ విషయమైనా తల్లిదండ్రులతో చర్చించాలి.మన ఉజ్వల భవిశ్యత్తును కోరుకునేది తల్లిదండ్రులే.

మార్కులు కాదు.. విజ్ఞానం ముఖ్యం
విద్యార్థులకు మార్కులు కాదు.. విజ్ఞానం ముఖ్యమనే విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి. తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి పెంచకూడదు. పిల్లలపై ఫలితాలు వచ్చే సమయంలో ఓ కన్నేసి ఉంచాలి. అధ్యాపకులు కూడా మార్కులు తక్కువగా వచ్చే విద్యార్థులను చిన్నచూపు చూడకూడదు. మార్కులు తక్కువ వచ్చినా, ఫెయిల్‌ అయినా విద్యార్థులు డిప్రెషన్‌కు గురి కాకూడదు.

ప్రపంచంలోని మేధావులంతా అంతగా మార్కులు సాధించిన వారుకాదు
విద్యార్థుల ప్రతిభకు మార్కులు కొలమానం కానే కాదు. మార్కుల ఆధారంగా వారి తెలివితేటలను కొలవకూడదు. ప్రపంచంలోని మేధావులంతా మార్కులేమీ సాధించిన వారుకాదు. పిల్లల చదువులను, మార్కులను తల్లిదండ్రులు వంశ ప్రతిష్టగా భావిస్తుంటారు. ఇది తప్పు. విద్యాసంస్థల యాజమాన్యాలు మార్కుల కోసం పిల్లలపై ఒత్తిడి పెట్ట కూడదు.జీవితాన్ని నడిపించేది సాధించాలనే కసివిద్యార్థులు అధైర్య పడకూడదు. విద్యార్థులు అధైర్య పడితే తల్లిదండ్రులకు బాధ కలిగించిన వాళ్లవుతారు. మార్కులే జీవితానికి ప్రాతిపదకన కాదు. జీవితాన్ని నడిపించేది సాధించాలనే కసి. పట్టుదల ఆత్మవిశ్వాసం. ఇవీ కలిగిన వ్యక్తులే ముందుకు వెళ్తారు. ఏదైనా సాధిస్తారు. ప్రపంచ విజేతలుగా నిలుస్తారు.
– అట్ల శ్రీనివాస్‌ ‌రెడ్డి రిహాబిలిటేషన్‌ ‌సైకాలజిస్ట్ ‌ఫ్యామిలీ కౌన్సెలర్‌,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page