చదువుతోనే మన తలరాత మార్చుకోవచ్చు

  • అమ్మఒడి నిబంధనల మేరకు 1.14 శాతం మందికి కట్‌
  • ‌పిల్లలను రెగ్యుర్‌గా బడికి పంపాలని తల్లులకు సూచన
  • బైజూస్‌తో ఒప్పందంతో పిల్లలకు అత్యున్నత విద్య
  • శ్రీకాకుళం పర్యటనలో అమ్మఒడి కింద నిధులు జమ

శ్రీకాకుళం, జూన్‌ 27 :‌బడికి వెళ్తేనే పిల్లలకు మంచి భవిష్యత్‌ ఉం‌టుందని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ ‌రెడ్డి వ్యాఖ్యానించారు. పిల్లకు విద్యనుచేరువ చేసే క్రమంలో విద్యారంగంలో మూడేళ్లలో సమూలమార్పులు చేశామని అన్నారు. సోమవారం ఆయన శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా కోడి రామూర్తి స్టేడియంలో అమ్మ ఒడి పథకం మూడో విడత కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 75 శాతం హాజరు ఉండాలని ఆ జీవోలోనే పొందుపర్చామన్నారు. హాజరు శాతం తగ్గడంతోనే 51 వేల మందికి అమ్మఒడి ఇవ్వలేదని, మొత్తంగా 1.14 శాతం మంది తల్లులకు అమ్మఒడి పథకం ఇవ్వలేకపోయామని, ఈ విషయంలో తనకు బాధగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. భవిష్యత్‌లో ఇది పునరావృతం కాకుండా పిల్లల్ని బడికి పంపాలని తల్లులకు సూచించారు. సమాజం, దేశం, మనిషి తలరాత మార్చే శక్తి చదువుకే ఉందని సీఎం జగన్‌ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ‘జగనన్న అమ్మఒడి’ నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. చదువే నిజమైన ఆస్తి అని గ్రహించాలన్నారు. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి బతికే శక్తి చదువుకే ఉందని జగన్‌ ‌తెలిపారు. ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డకు చదువు అందాలన్నదే నా తపన. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాం.

మంచి చదువు హక్కుగా అందించాలన్నదే లక్ష్యం. ’జగనన్న అమ్మఒడి’ అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. పిల్లలను బడికి పంపిస్తున్న ప్రతి పేద తల్లి ఖాతాలో జమ చేస్తున్నాం. దాదాపు 80 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరుస్తున్నాం. 40లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.6,595 కోట్లు జమ చేస్తున్నాం. కేవలం జగనన్న అమ్మఒడి కింద ఇప్పటి వరకు రూ.19,618 కోట్లు జమ చేశాం. ఆర్థిక ఇబ్బందులతో పిల్లల చదువు మధ్యలో ఆపకూడదు. బాగా చదవాలనే కనీసం 75శాతం హాజరు తప్పనిసరి చేశామని ముఖ్యమంత్రి అన్నారు. పాఠశాలలు, టాయిలెట్‌ ‌మెయింటెనెన్స్ ‌కింద రూ.2వేలు వసూలు చేస్తుంటే కొంతమంది విమర్శలు చేస్తున్నారని సీఎం జగన్‌ ‌మండిపడ్డారు. విమర్శలు చేసేవాళ్లు చదివించే అమ్మకు ఒక్క రూపాయైనా ఇచ్చారా అని ధ్వజమెత్తారు. అమ్మఒడి పథకంపై కొందరు దుష్పచ్రారం చేస్తున్నారని, ఈ పథకాన్ని విమర్శించే వారిలో ఒక్కరైనా.. పిల్లల్ని చదివించే తల్లులకు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? అని సీఎం జగన్‌ ‌ప్రశ్నించారు. టీడీపీ హయాంలో అమ్మఒడి లాంటి పథకం తెచ్చారా? అని అన్నారు.

విద్యారంగం సంక్షేమానికి ఏనాడైనా ఒక్క రూపాయి ఇచ్చారా?.. విమర్శించే దుష్టచతుష్టయానికి నిజాలు చెప్పే ధైర్యం ఉందా అని ముఖ్యమంత్రి నిలదీశారు. ప్రజలకు ఇచ్చిన హాల్లో 95 శాతం నెరవేర్చామన్నారు. ఎగ్గొట్టే ప్రభుత్వమైతే 95 శాతం హాలు అమలు చేస్తామా?.. మనం మారీచులతో యుద్ధం చేస్తున్నామని, ప్రజల అండ ఉన్నంతవరకు ఎవరూ తన వెంట్రుక కూడా పీకలేరని జగన్‌ ‌వ్యాఖ్యానించారు. దేశంలోనే అతిపెద్ద ఎడ్యుకేషన్‌ ‌టెక్‌ ‌కంపెనీ బైజ్యుస్‌ ‌యాప్‌తో ఒప్పందం చేసుకున్నామని, శ్రీమంతుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉండే బైజ్యుస్‌ ‌యాప్‌ ఇప్పు‌డు పేదలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. త్వరలో 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తామన్నారు. 4.7 లక్షల మంది 8వ తరగతి పిల్లలకు సెప్టెంబర్‌లో రూ. 12వేలు విలువజేసే ట్యాబ్‌ ఇవ్వబోతున్నామన్నామని సీఎం జగన్‌ ‌చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు బొత్స, ధర్మాన, స్పీకర్‌ ‌తమ్మినేని తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page