భూ సమస్యలను పరిష్కరించేందుకే ధరణి

  • రైతులెవరూ పైరవీకారులను ఆశ్రయించొద్దు, డబ్బులు ఇవ్వొద్దు
  • సిఎం కేసీఆర్‌ ఆదేశాలతోనే ములుగులో అవగాహన సదస్సు
  • ములుగు మండలాన్ని పైలెట్‌ ‌ప్రాజెక్టు తీసుకున్నాం
  • 100 శాతం సమస్యలను పరిష్కరిస్తాం

ములుగులో ధరణి పోర్టల్‌ ‌సమస్యలు, అధ్యయనం వాటి పరిష్కారంపై జరిగిన సదస్సులో మంత్రి హరీష్‌ ‌రావు
సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 14 : ‌రైతుల భూసమస్యల పరిష్కారం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ధరణి పోర్టల్‌ ‌తీసుకు వొచ్చారనీ, ఇది అతి పెద్ద కార్యక్రమం అని కొన్ని సాంకేతిక సమస్యలతో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడ్డాయనీ త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. మంగళవారం సిద్ధిపేటలో జిల్లా ములుగులోని రైతు వేదికలో ధరణి పోర్టల్‌ ‌సమస్యలు, అధ్యయనం వాటి పరిష్కారంపై జరిగిన సదస్సులో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సిఎస్‌)‌సోమేష్‌కుమార్‌, ‌ముఖ్యమంత్రి కార్యాయానికి చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు స్మితాసబర్వాల్‌, ‌శేషాద్రి, రాహుల్‌బొజ్జా, సిద్ధిపేట జిల్లా కలెక్టర్‌ ‌ప్రశాంత్‌ ‌జీవన్‌ ‌పాటిల్‌ ‌తదితరులు పాల్గొన్నారు. ధరణి పోర్టల్‌తో రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను మంత్రి హరీష్‌రావు బాధితులను అడిగి తెలుసుకుని మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తీసుకువచ్చిన ధరణి అనే విప్లవాత్మకమైన మార్పు తేవడంతో అద్భుతమైన ప్రయోజనాలు కలిగాయనీ, గతంలో ఎల్‌ఆర్‌ ‌యూపీ ద్వారా కొన్ని భూ సమస్యలు మిగిలిపోయాయనీ, ఆ సమస్యల్ని మీ దగ్గరికి వొచ్చి అర్థం చేసుకుని, ఒక్క భూ సమస్య లేకుండా పరిష్కార దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఇవాళ ములుగులో ధరణిపై అవగాహన సదస్సు చేపట్టామన్నారు. ధరణి అనేది ఒక అద్భుతం. ధరణి అనేది ఒక విప్లవాత్మకమైన చర్య. ఆ ధరణిలో నెలకొన్న భూ సమస్యలు ఏమిటి? అంటే ధరణికి ముందు గత అధికారులు ఎల్‌ఆర్‌ ‌యూపీలో కొన్ని భూ సమస్యలు ధరణిలో ఎక్కనందున, ఎదురైన అవాంతరాలు.. తప్పుగా ఎక్కడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తాయి.

అలా ఎదురైనా భూ సమస్యలకు పరిష్కారం చూపేలా.. ఎలాంటి భూ సమస్య లేకుండా చూపాలన్నదే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ధరణిలో నెలకొన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారనీ, ములుగు మండలాన్ని పైలెట్‌ ‌ప్రాజెక్టుగా తీసుకుని వంద శాతం రైతుల భూ సమస్యలు పరిష్కరించనున్నామన్నారు. రైతులు భూములు విషయంలో తరరాలుగా ఎదుర్కుంటున్న సమస్యలు ధరణి ద్వారా పరిష్కారమయ్యాయనీ, కోర్టు కేసులు, కుటుంబ తగాదాల వల్ల కొన్ని భూసమస్యలు పెండింగ్‌లో పడ్డాయన్నారు. కోర్టు కేసులు కాకుండా, వ్యక్తిగత సమస్యలు లేకుండా ఉన్న ప్రతి భూ సమస్యను పరిష్కరించడానికి ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. పైలెట్‌ ‌ప్రాజెక్టుగా ములుగు మండలంలో వంద శాతం సమస్యలు పరిష్కరించి రైతులకు ధృవీకరణ పత్రాలు అందజేస్తామనీ, ములుగు తర్వాత ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్నీ గ్రామాల్లో చేపడతామనీ, టైం బౌండ్‌ ‌పోగ్రామ్‌తో ఈ కార్యక్రమాన్ని వంద శాతం అన్నీ గ్రామాల్లో భూ సమస్యలు పరిష్కారిస్తామనీ, ఎవరూ అసలు ఆందోళన చెందొద్దనీ, రైతులెవరూ తమ సమస్యల పరిష్కారం కోసం పైరవీకార్లను ఆశ్రయించవద్దు. డబ్బులు ఇవ్వొద్దన్నారు. రైతుల భూములకు వందేళ్ల వరకు కూడా పూర్తి భద్రత ఉంటుందనీ, ధరణి ద్వారా అనేక అక్రమాలకు చెక్‌ ‌పడిందనీ, భూమిపై పూర్తి హక్కు కల్పించబడిందన్నారు. రాష్ట్ర చీఫ్‌ ‌సెక్రటరీ సోమేష్‌కుమార్‌ ‌మాట్లాడుతూ..ధరణి ఒక విప్లవాత్మకమైన కార్యక్రమం అని సిఎం కేసీఆర్‌ ఈ ‌కార్యక్రమాన్ని స్వయంగా రూపొందించారనీ, నిజమైన భూ యజమానులకు భూమిపై పూర్తి హక్కు కల్పించాలనీ, భూమి బదిలీ పక్రియ వేగవంతంగా పూర్తి చేయాలన్నదే ధరణి ఉద్దేశ్యమన్నారు.

ధరణి పోర్టల్‌ ఇప్పటి వరకు 7 కోట్ల మంది ఉపయోగించుకున్నారనీ, భూముల అమ్మకాలు కొనుగోళ్లు విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు. పూర్తి పారదర్శకంగా ధరణి రిజిస్ట్రేషన్లు 15 నిమిషాల్లో పూర్తవుతున్నాయనీ, ధరణి పోర్టల్‌లో ఎలాంటి సమస్య లేదు, సాంకేతిక సమస్యలే కొన్ని ఉన్నాయన్నారు. ధరణిలో కొత్తగా మరో 33 మ్యాడ్యూల్స్ ‌చేర్చామని, వీటి ద్వారా చాలా సమస్యలు పరిష్కారమవుతాయనీ, ఇతర చిన్న చిన్న సమస్యలను కూడా వంద శాతం పరిష్కరించాలని సిఎం కేసీఆర్‌ ఆదేశించారనీ, రాష్ట్రంలో ములుగు మండలాన్ని పైట్‌గా ప్రారంభించామనీ, దీని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ సదస్సులు నిర్వహించి ప్రతి గ్రామంలో ఎవరికి ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తామన్నారు. ధరణి సమస్యల అధ్యయనంకు సంబంధించి ధరణి పోర్టల్‌ ‌ద్వారా వొచ్చిన ఫిర్యాదులన్నింటినీ ఒక్కొక్కటిగా చర్చించి, వాటిలో టెక్నికల్‌ ‌గా ఎదుర్కుంటున్న అంశాలపై కూలంకషంగా అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ధరణి పోర్టల్‌ ‌ద్వారా వొచ్చిన ఫిర్యాదులు, వాటి పరిష్కారం, వివిధ మాడ్యూల్స్, ఇతర సమస్యలపై అధికారులతో చర్చించారు. ఈ మేరకు గజ్వేల్‌ ఆర్డీఓ విజయేందర్‌ ‌రెడ్డి డివిజన్‌ ‌పరిధిలో ఇప్పటివరకు వివిధ రూపాల్లో 186, అలాగే ములుగు మండలంలో 46 ఫిర్యాదులు ఉన్నట్లు గుర్తించినట్లు వివరించారు. ఈ అవగాహన సదస్సులో టిఎస్‌టిఎస్‌ ‌టెక్నికల్‌ ‌సర్వీసెస్‌ ‌ఛై•ర్మన్‌ ‌వెంకటేశ్వరరావు, ఎఫ్‌డిసి ఛైర్మన్‌ ‌వంటేరు ప్రతాప్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ ‌ముజమ్మీల్‌ఖాన్‌, ‌శ్రీనివాస్‌రెడ్డి, గజ్వేల్‌, ‌ములుగు రెవెన్యూ అధికారులు, స్థానిక పిఏసిఎస్‌ ‌ఛైర్మన్‌ ‌బట్టు అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న పలువురు భూ సంబంధిత బాధితులు ధరణిలో ఎదుర్కుంటున్న తమ భూ సమస్యలు మంత్రి హరీష్‌రావు, చీఫ్‌ ‌సెక్రటరీ సోమేష్‌కుమార్‌ ‌దృష్టికి తెచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page