తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఆశీస్సులతో, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టిన ‘‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’’ ఐదేళ్ళు పూర్తి చేసుకుంది. గొప్ప మనసుతో ప్రకృతి ప్రేమికుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించుకునే బాధ్యతను కూడా మనదేనని గుర్తు చేసి ప్రజలందరిని ఆలోచింపజేసి ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించి మొక్కలు నాటుతూ, వాటిని సంరక్షించుకుంటున్న తీరు అద్భుతం..అడవుల శాతాన్ని పెంచాలని, వర్షాలు సమృద్ధిగా రావాలని, పచ్చదనంతో దేశం కళకళలాడాలని చిరు సంకల్పంతో ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ,దేశం దాటి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నటువంటి తీరు ఎంతో ఆనందనిస్తుంది..
జోగినిపల్లి సంతోష్ కుమార్ మేధస్సుకు నేనైతే ఫిదా అయ్యా..! ఇంత గొప్ప ఆలోచన రావడం నిజంగా గొప్ప విషయం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మొక్కలు నాటడం ఇతరులకు చాలెంజ్ చేసి మొక్కలు నాటాలని సూచించడం అందరూ దాన్ని స్వీకరించి మొక్కలు నాటడం ఇలా, ఇలా ప్రముఖులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాల్లో పాల్గొనడంతో ప్రపంచనికే విస్తరించింది మొక్కలు నాటే కార్యక్రమం, మరి కొందరు సినీ హీరోలు ,వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, అడవులను దత్తత తీసుకొని మొక్కలు నాటి నాటిన మొక్కలను పెంచి, రక్షించే బాధ్యత ను కూడా తీసుకోవడం చాలా గొప్ప విషయం..
గత ఐదేళ్లుగా ఎక్కడ చూసినా జన్మదిన వేడుకలకు మొక్కలను ఇచ్చి శుభాకాంక్షలు తెలపడం, ప్రముఖులు ఎవరైనా వచ్చినప్పుడు, కలిసినప్పుడు మొక్కలను ఇచ్చి స్వాగతం తెలపడం, పెళ్లి రోజుకు ,నూతన గృహప్రవేశం, విజయం సాధించినప్పుడు, పదోన్నతి పొందినప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, ఏదైనా మంచి శుభకార్య ఉన్నప్పుడు, ప్రతి ఒక్కరూ ఇప్పుడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటి వాటిని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత తమదేనని సంతోష్ కుమార్ కు ట్విట్టర్ లో ట్వీట్ చేయడం ప్రస్తుతం ట్రెండింగ్ ఉన్న విషయం.. పాఠశాలల్లో విద్యార్థులు సైతం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వాములు అవుతున్నారు.అసలు నిజంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగుతున్న వారెందరో ఉన్నారు. ఎంతో మంది ప్రముఖులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ను ఇప్పటికి అభినందిస్తూనే ఉన్నారు. తనని ఆదర్శంగా తీసుకున్న వారెందరో ఉన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఒక ఉద్యమంలాగానే కొనసాగుతుంది.
తెలంగాణ రాష్ట్రం నుంచి, దేశం, ప్రపంచ దేశాలలో విస్తరించి పచ్చదనం పెంచేందుకు కృషి చేస్తున్నారు.. జోగినిపల్లి సంతోష్ కుమార్ రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఇట్టి కార్యక్రమానికి సమయం ఇచ్చి,ఇట్టి మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళుతున్న తీరు చరిత్రలో లిఖించబడింది… గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభమైన స్థాయి నుంచి ఎందరో ప్రముఖులు స్ఫూర్తిగా తీసుకుని ఇట్టి కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన తీరును… రేపటి భవిష్యత్తు తరాలకు తెలిసేలా చేసేందుకు కృషి చేయాలి విద్యార్థులకు పాఠ్య పుస్తకాల్లో ఇట్టి కార్యక్రమం గొప్పతనాన్ని తెలియజేసేలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి పాఠ్యపుస్తకాల్లో ఒక పాఠంగా చేర్చాలని ప్రభుత్వ పెద్ద దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాం.. ఎక్కడైనా రోడ్డు వెడల్పు లో, విద్యుత్ స్తంభాలకు ఇబ్బందిగా ఉన్నప్పుడు వందల సంవత్సరాల క్రితం నాటి భారీ చెట్లను తొలగించే అధికారం ఆ శాఖకు ఉన్నప్పటికీ.. అటువంటి భారీ వృక్షాలను కోల్పోతే తట్టుకోలేని సంతోష్ కుమార్ మనసు.. అటువంటి భారీ వృక్షాలను మిషన్ ల సహాయంతో వేర్లతో నెమ్మదిగా బయటకు తీసి మళ్లీ దానిని అడవి ప్రాంతంలో మళ్లీ పెట్టి సంతోష్ బతికిస్తున్నారు. ..
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఐదేళ్లు ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు.. నాకైతే చిన్న కోరిక అయితే ఉంది.. మాది యాదాద్రి భువనగిరి జిల్లా సంస్దాన్ నారాయణపురం మండల కేంద్రం.. మా ఊరి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి మొక్కలు నాటాలని కోరిక అయితే బలంగా ఉంది.. వీలున్నప్పుడు తప్పకుండ మా గ్రామనికి వస్తారని ఆశీస్తూ.. నా కోరిక ఎప్పటికైనా తిరుతుందనే విశ్వాసంతోనే ఉంటున్నాను.. ప్రత్యక్షంగా సంతోష్ కుమార్ ని కలిసి ఆహ్వానించే అవకాశం నాకైతె దొరకదు కాబట్టి ఈ వార్తను చూసైన మా గ్రామానికి వచ్చి మా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో నాతో కలిసి మొక్కలు నాటాలని మనస్పూర్తిగా కొరుకుంటు ఆహ్వానిస్తున్నాను…
– గుండమల్ల సతీష్ కుమార్.సంస్దాన్ నారాయణపురం.
94931 55522.