న్యూఢిల్లీ, మే 27 : దేశంలో కొరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గురువారం 2628 కేసులు నమోదవగా, శుక్రవారం 2710 మందికి పాజిటివ్ వొచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,31,47,530కు చేరాయి. ఇందులో 4,26,07,177 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకోగా, 5,24,539 మంది మరణించారు. మరో 15,814 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
కాగా, గత 24 గంటల్లో 14 మంది మృతిచెందగా, 2296 మంది డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.04 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపింది. ఇక రికవరీ రేటు 98.75 శాతం, మరణాల రేటు 1.22 శాతం, రోజువారీ పాజిటివిటీ రేటు 0.58 శాతంగా ఉందని పేర్కొన్నది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 192.97 కోట్ల కరోనా టీకా డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.