విద్యుత్‌ ‌ఛార్జీలను తగ్గించండి

  • పాతబస్తీలో బిల్లులు వసూలు చేయాలి
  • బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌డిమాండ్‌
  • ‌కృష్ణా వాటా దక్కక పోవడానికి కెసిఆరే కారణం : రంగారెడ్డికి చేరుకున్న బండి పాదయాత్రపాతబస్తీలో బిల్లులు వసూలు చేయాలి
  • బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌డిమాండ్‌
  • ‌కృష్ణా వాటా దక్కక పోవడానికి కెసిఆరే కారణం : రంగారెడ్డికి చేరుకున్న బండి పాదయాత్ర

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 10 : పెంచిన విద్యుత్‌ ‌ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. కరెంట్‌ ‌ఛార్జీలపై రిఫరెండంకు తాను రెడీ అంటూ సవాల్‌ ‌విసిరారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం కారణంగా సామాన్యులపై ఆరు వేల కోట్ల భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయంపై టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజలే ఆ పార్టీకి కరెంట్‌ ‌షాక్‌ ఇస్తారన్నారు. రూ.48 వేల కోట్ల రూపాయలు డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడంతో డిస్కంలు దివాలా తీసి అప్పుల ఊబిలోకి కూరుకుపోయాయన్నారు. టీఆర్‌ఎస్‌ అసమర్థత విధానాల వల్ల విద్యుత్‌ ‌సరఫరాలో సాంకేతిక నష్టాలు ప్రతిసంవత్సరం పెరిగిపోతున్నాయన్నారు. పాతబస్తీలో ఎంఐఎంకు భయపడి విద్యుత్‌ ‌బిల్లులు వసూలు చేయడంలో టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. విద్యుత్‌ ఉద్యోగులపై ఎంఐఎం నాయకులు దాడులు చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని బండి సంజయ్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యుత్‌ ‌ఛార్జీలు తగ్గించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.

కృష్ణా వాటా దక్కక పోవడానికి కెసిఆరే కారణం: రంగారెడ్డికి చేరుకున్న బండి పాదయాత్ర
కృష్ణా నది నీళ్లలో మనకు దక్కాల్సిన వాటా దక్కకపోవడానికి సీఎం కేసీఆర్‌ ‌కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. 500లకు పైగా టీఎంసీలు నీళ్లు తెలంగాణకు రావాల్సి ఉండగా..కేవలం 299టీఎంసీలకు  కేసీఆర్‌ ఎం‌దుకు ఒప్పుకున్నారని ఆయన ప్రశ్నించారు. బండి సంజయ్‌ ‌చేస్తున్న  ప్రజా సంగ్రామయాత్ర  మంగళవారం ఉదయం రంగారెడ్డి జిల్లాకు చేరుకుంది. షాద్‌ ‌నగర్‌ ‌నియోజకవర్గం తొమ్మిది రేకుల గ్రామం దగ్గర బండి సంజయ్‌కు ..పార్టీ నాయకులు, కార్యకర్తలు  ఘన స్వాగతం పలికారు. తర్వాత గ్రామంలోని ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page