హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 9 : డీజిల్, పెట్రోల్, గ్యాస్, నిత్యవసర ధరల పెంపునకుఎ నిరసనగా మహిళా కాంగ్రెస్ నేతలు రోడ్డెక్కారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలంటూ ఆందోళన నిర్వహించారు. సోమవారం గాంధీ భవన్ నుంచి మొజాంజాహి మార్కెట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.
నిత్యవసర ధరలు పెంచి కేంద్ర సర్కార్ పేదల నడ్డి విరిచిందని వారు మండిపడ్డారు. ఖాళీ గ్యాస్ సిలిండర్లతో ప్రదర్శన నిర్వహించారు. మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన గ్యాస్ ధరలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఖాళీ గ్యాస్ బండలను పెట్టి వినూత్న నిరసన తెలిపారు. బిజెపి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలన్నారు.