- రైతులకు మంత్రి కెటిఆర్ హావి•
- నారాయణపేటలో గోల్డ్‌స్టాక్ మార్కెట్‌కు శంకుస్థాపన
- ఉద్యోగ సాధనే లక్ష్యం కావాలి యువత చదువు పైనే దృష్టి సారించాలి : మంత్రి కెటిఆర్
నారాయణపేట/మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, మే 9 : ఇంటింటికి తాగునీరు ఇచ్చే మిషన్ భగీరథ పథకానికి ప్రారంభోత్సవం చేసుకున్నామని, అతి త్వరలోనే ప్రతి రోజూ ప్రతి ఇంటికి మంచినీరు ఇవ్వబోతున్నామని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. నారాయణ పేట జిల్లా కేంద్రంలో సోమవారం మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె, స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డితో కలిసి నారాయణపేట జిల్లా కేంద్రంలో రూ.81.94 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ బాట్లాడుతూ.. రూ. కోటి 68 లక్షలతో 33/11 కేవీ సబ్ స్టేషన్ ప్రారంభించుకున్నామని, రూ. కోటి 35 లక్షలతో నాన్ వెజ్ మార్కెట్ ప్రారంభించుకున్నామని, కొన్ని పార్కులు కూడా ప్రారంభించుకున్నామని, బంగారం మార్కెట్‌ను ఆధునీకరిస్తూ రూ. 20 కోట్లతో గోల్డ్ సూప్‌కు శంకుస్థాపన చేశామని, అన్ని కూడా సంవత్సర కాలంలో పూర్తి చేస్తామ మంత్రి కెటిఆర్ అన్నారు.
టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో నారాయణపేటలో రూ.20కోట్లతో నిర్మించనున్న గోల్డ్ సోక్ మార్కెట్‌కు భూమి పూజ చేడయంతోపాటు ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.29.59 కోట్లతో నిర్మించిన మిషన్ భగీరథ పంప్ హౌస్‌ను ప్రారంభించారు. రూ.4 కోట్ల వ్యయంతో కొండారెడ్డిపల్లి మినీ ట్యాంక్ బండ్ పనులకు శంకుస్థాపన చేశారు. సింగారం వద్ద మిషన్ భగీరథ పంప్ హౌస్‌ను, అక్కడే సిద్ధం చేసిన సబ్ స్టేషన్‌ను మంత్రి ప్రారంభించారు. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో బీసీ కాలనీ పార్కు వద్ద రూ.20 కోట్లతో నిర్మించనున్న గోల్డ్ సోక్ మార్కెట్‌కు భూమిపూజ చేశారు. పట్టణ క్రీడాకారుల కోసం రూ. 6.65 కోట్లతో నిర్మించనున్న మినీ స్టేడియం పనులకు, ఎర్రగుట్ట వద్ద రూ. 2కోట్లతో జిల్లా గ్రంథాలయం భవన నిర్మాణానికి, రజకుల కోసం రూ. కోటితో చేపట్టే ఆధునిక లాండ్రీకి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, డా. సి లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, అబ్రహం, కృష్ణమోహన్ రెడ్డి, అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీలు కూచుకుల్ల దామోదర్ రెడ్డి, సురభి వాణీ దేవి, కార్పొరేషన్ చైర్మన్లు వాల్యా నాయక్, అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి ఇంతియాజ్ ఇసాక్, జడ్పీ చైర్ పర్సన్లు స్వర్ణ, వనజ, కలెక్టర్ దాసరి హరిచందన, పార్టీ నేతలు దేవర మల్లప్ప, చిట్టెం సుచరిత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
200 మంది రైతులకు భూయాజమాన్య హక్కు : రైతులకు హావి• ఇచ్చిన మంత్రి కెటిఆర్
నారాయణపేట జిల్లాలోని కంసాన్పల్లి రైతులకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శుభవార్త వినిపించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి, సంక్షేమ పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..నియోజకవర్గ పరిధిలోని కంసాన్‌పల్లిలో ప్రభుత్వానికి సంబంధించిన స్థలం వెయ్యి ఎకరాలు ఉందని ఎమ్మెల్యే తన దృష్టికి తీసుకొచ్చారని కేటీఆర్ తెలిపారు. అయితే ఇందులో 200 ఎకరాల్లో పేద రైతులు సాగు చేసుకుంటున్నారని, వారికి భూ యాజమాన్య హక్కు కల్పించాలని ఎమ్మెల్యే కోరారు. మిగతా 800 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు 200 ఎకరాలు సాగు చేసుకుంటున్న రైతులకు తప్పకుండా యాజమాన్య హక్కులు కల్పిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తామన్నారు. ఆ రైతులందరికీ రైతుబంధు ఇస్తామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ కూడా ఏర్పాటు చేసి నారాయణపేట నియోజకవర్గ ప్రజలకు అందిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. నారాయణపేట పట్టణానికి ఆధునీకమైన మాస్టర్ ప్లాన్ రూపొందించి అందజేస్తామన్నారు. ఒక మానవ వ్యర్థాల శుద్దీకరణ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గిరిజన సోదరుల కోసం సేవాలాల్ భవన్‌ను కూడా మంజూరు చేయిస్తానని కేటీఆర్ హావి• ఇచ్చారు.
ఉద్యోగ సాధనే లక్ష్యం కావాలి యువత చదువు పైనే దృష్టి సారించాలి : మంత్రి కెటిఆర్
మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, మే 9 : నిరుద్యోగ యువత ఉద్యోగాలు లక్ష్యంగా అకుంఠిత దీక్షతో తమ చదువులు కొనసాగించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రబుత్వం ఉద్యోగ ప్రకటన విడుదల చేసినందున వారంతా ఉద్యోగాల సాధనలో నిమగ్నం కావాలన్నారు. రాబోయే ఆరు నెలల పాటు సోషల్ వి•డియాకు దూరంగా ఉండి సీరియస్‌గా ప్రిపరేషన్ పూర్తి చేసి ఉద్యోగాలు సాధించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. సోమవారం మహబూబ్‌నగర్ పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న ఎక్స్పో ప్లాజా వద్ద టీఆర్ఎస్ పార్టీ జెండాను మంత్రి శ్రీనివాస్ గౌడ్, కేటీఆర్‌తో కలిసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఎక్స్పో ప్లాజాలో శాంతా నారాయణ గౌడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్లో ఉద్యోగార్థులకు కేటీఆర్ పోటీ పరీక్షల పుస్తకాలను అందజేసారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ పట్టణం పూర్తి స్థాయిలో వేగంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మంత్రి విజ్ఞప్తి మేరకు మహబూబ్ నగర్ పట్టణానికి అవసరమైన నిధులు మున్సిపల్ శాఖ ద్వారా మంజూరు చేస్తామని ఆయన వెల్లడించారు. పట్టణ అభివృద్ధికి అవసరమైన మేర తమ సహకారం ఉంటుందని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సుమారు 90 వేల ఉద్యోగాలను భర్తీ చేసే పక్రియ చేపట్టారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు ఇంతియాజ్, వాల్యా నాయక్, వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.