నేటి ఆందోళనను విజయవంతం చేద్దాం..! టీయుడబ్ల్యుజె

హైదరాబాద్‌, ‌మే 9 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావ ప్రకటన స్వేచ్ఛను హరించే కుట్రలు, జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఇండియన్‌ ‌జర్నలిస్టస్ ‌యూనియన్‌(ఐజేయూ) దేశ వ్యాప్త ఆందోళనకు పిలుపు నిచ్చింది.

ఇందులో భాగంగా నేడు ఉదయం10.30 గంటలకు, విద్యానగర్‌  ‌శివం రోడ్డు, కేంద్ర కార్మిక శాఖ కార్యాలయం ముందు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ ‌జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె) ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్‌, ‌ప్రధాన కార్యదర్శి కె.విరాహత్‌ అలీ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page