ఐటీ రంగంలో మేటిగా హైదరాబాద్‌

  • అతిపెద్ద గూగుల్‌ ‌క్యాంపస్‌ ‌శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్‌            
  • ‌లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌రంగంలో 100 బిలియన్‌ ‌డాలర్ల సాధనే లక్ష్యం : థర్మో ఫిషర్స్ ‌సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌హైదరాబాద్‌ ఐటీ రంగంలో దేశంలోనే మేటిగా విరాజిల్లుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అమెరికాలోని మౌంటెన్‌ ‌వ్యూలో ఉన్న తమ ప్రధాన కార్యాలయం తర్వాత టెక్‌ ‌దిగ్గజం గూగుల్‌ ‌సంస్థ 3.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్‌లో గచ్చిబౌలి డివిజన్‌ ‌పరిధిలోని నానక్‌ ‌రామ్‌ ‌గూడాలో నూతనంగా నిర్మించతలపెట్టిన రెండవ అతిపెద్ద క్యాంపస్‌ ‌నిర్మాణ పనులకు మంత్రి తెరాస పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌, ‌చేవెళ్ల ఎంపి గడ్డం రంజిత్‌, ‌శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, మాజీ కార్పొరేటర్‌ ‌సాయి బాబా, గూగుల్‌ ‌సంస్థ ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ‌మాట్లాడుతూ…అమెరికాలోని మౌంటెన్‌ ‌వ్యూలో ఉన్న తమ ప్రధాన కార్యాలయం తర్వాత టెక్‌ ‌దిగ్గజం గూగుల్‌ ‌సంస్థ వారు 3.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్‌ ‌లో రెండవ అతిపెద్ద క్యాంపస్‌ను ఈ రోజు మన ప్రాంతంలో నిర్మించడం చాలా సంతోషకరమైన విషయం అని, ఐటిలో ప్రపంచం మొత్తము మన వైపే చూస్తుందనడానికి ఇది ఒక ఉదాహరణ అని, టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం వొచ్చినప్పటి నుంచి అనేక ఐటీ కంపెనీలు ముందుకు వొచ్చి సంస్థలను స్థాపించడం జరిగింది అన్నారు.

దీని ద్వారా తెలంగాణలోని చదువుకున్న యువతకు లక్షలాది ఉద్యోగాలు లభించాయని తెలిపారు, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మాట్లాడుతూ…హైదరాబాద్‌ ఐటిలో మేటి రంగంగా విరజిల్లుతుందని, ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్‌ ‌కార్యాలయంను మన ప్రాంతంకు తీసుకువచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‌మంత్రి, తెరాస పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మన ప్రాంత వాసులకు,,యువతకు సాఫ్ట్ ‌వెర్‌ ‌రంగంలో మరిన్ని ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వ విప్‌ ‌గాంధీ తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ఐటీ ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీ జయేష్‌ ‌రంజన్‌, ‌తెరాస నాయకులు ఆదర్శ్ ‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌రంగంలో 100 బిలియన్‌ ‌డాలర్ల సాధనే లక్ష్యం : థర్మో ఫిషర్స్ ‌సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌


‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి మంచి వాతావరణాన్ని కల్పిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణలో అనేకులు ఆకర్శితులై పెట్టుబడులు పెటేందుకు వొస్తున్నారని ఆయన అన్నారు. 2030 లోపు లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌రంగంలో 100 బిలియన్‌ ‌డాలర్ల సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్‌ ‌గచ్చిబౌలిలో థర్మో ఫిషర్స్ ఇం‌డియా ఇంజినీరింగ్‌ ‌సెంటర్‌ను మంత్రి కేటీఆర్‌ ‌ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. లైఫ్‌ ‌సైన్సెస్‌లో డేటా సైన్స్ ‌కలుస్తుందన్నారు. థర్మో ఫిషర్స్ ‌పరిశోధన, అభివృద్ధి సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. 15 మిలియన్‌ ‌డాలర్ల పెట్టుబడితో ఈ సంస్థ ఏర్పడుతున్నదని చెప్పారు.

దీంతో నైపుణ్యం కలిగిన 450 మందికిపైగా ఇంజినీర్లు పనిచేస్తారన్నారు. థర్మో ఫిషర్స్ ‌కొత్త ఉత్పత్తులు, విశ్లేషణాత్మక పరిష్కారాలకు కేంద్రంగా ఉండనుందని చెప్పారు. ఈ సంస్థ పరిశోధన కోసం ఏటా 1.4 బిలియన్‌ ‌డాలర్లు ఖర్చవుతుందని వెల్లడించారు. ఈ సంస్థ ఇప్పటికే ఉత్పత్తి, భూ, నీటి వనరులపై పరిశోధన చేస్తున్నదని తెలిపారు. గత నెలలో బోస్టన్‌లో థర్మో ఫిషర్స్ ‌ప్రతినిధులను కలిశానని గుర్తుచేశారు. పరిశోధన కేంద్రాల విషయంలో ఆసియాలోనే క్రియాశీలక స్థానంలో ఉన్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. నైపుణ్యం, సామర్థ్యం విషయంలోనూ హైదరాబాద్‌ది ప్రత్యేక స్థానమని చెప్పారు. నగరంలో ఇప్పటికే ఐడీపీఎల్‌, ఇ‌క్రిశాట్‌, ‌సీఎస్‌ఐఆర్‌ ‌వంటి ఎన్నో పరిశోధన కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. గ్లోబల్‌ ‌కేపబిలిటి సెంటర్లకు కూడా హైదరాబాద్‌ ‌మంచి ప్రదేశమని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page