తెలంగాణలో రజాకార్ల పాలన

  • మహిళలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి
  • ‘కుటంబ’ సంక్షేమ కార్యక్రమాలతో కెసిఆర్‌ ‌బిజీ
  • పాద యాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌
  • ‌వంద కిలోవి•టర్లు పూర్తి చేసుకున్న కేక్‌ ‌కట్‌ ‌చేసిన పార్టీ కార్యకర్తలు

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 23 : ‌నిజాం కాలంలో రజాకార్లు బయటకు వొస్తే.. మహిళలు భయంతో తలుపులు వేసుకునేవాళ్లని, ఇప్పుడు తెలంగాణలో కెసిఆర్‌ ‌పాలనలో మళ్లీ అదే పరిస్థితి దాపురించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ‌పాలనలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కేసీఆర్‌ ‌ప్రభుత్వం దోపిడీ చేయని రంగం లేదన్నారు. తెలంగాణ వొచ్చింది కేసీఆర్‌ ‌వల్ల కాదని సుష్మాస్వరాజ్‌ ‌వల్ల అని బండి సంజయ్‌ ‌పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ‌తెలంగాణ ఇవ్వకుంటే బీజేపీ ఇస్తుందని సుష్మా పేర్కొన్నారని తెలిపారు. కాంగ్రెస్‌ ‌బిల్లు పెట్టకుంటే బీజేపీ ప్రైవేట్‌ ‌బిల్లు పెడుతుందని సుష్మా ప్రకటించారన్నారు. బీజేపీ హావి•కి భయపడే కాంగ్రెస్‌ ‌తెలంగాణ బిల్లు పెట్టిందన్నారు. బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని బండి సంజయ్‌ ‌తెలిపారు. ఏర్పడ్డ తెలంగాణలో అనేక హావి•లు ఇచ్చిన కెసిఆర్‌ ఇప్పు‌డు కుటుంబ సంక్షేమ కార్యక్రమాన్ని చూసుకుంటున్నారని మండిపడ్డారు.

ఎవరేమైతే నాకేంటన్న ధోరణిలో తన సంక్షేమం లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని అన్నారు. పెట్రోలు, డీజిల్‌ ‌ధరలపై మాట్లాడే అర్హత టీఆర్‌ఎస్‌కు ఉందా అని ఆయన  ప్రశ్నించారు. పెట్రోల్‌ ‌ధరలపై సీఎం కేసీఆర్‌, ‌కేటీఆర్‌ అవగాహన లేకుండా మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ‌వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేంద్ర ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో పెట్రోల్‌ ‌ధరలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్‌ ‌ధరలు తక్కువగానే ఉన్నాయన్నారు. కేసీఆర్‌ ‌పోరాట ఫలితంగానే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడన్న కేటీఆర్‌ ‌వ్యాఖ్యలపై బండి సంజయ్‌ ఎదురుదాడి చేశారు. తాను రాష్ట్రానికి చెందిన పార్టీకి అధ్యక్షుడిని కాదని..దశాబ్దాల కాలంనాటి జాతీయ పార్టీలో నాయకుడినని చెప్పారు.

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా వనపర్తి జిల్లా అమరచింత మండలంలో పాదయాత్ర చేస్తున్న బండి.. శనివారం పదోరోజు కిష్టంపల్లె స్టేజి వద్ద 100 కిలోవి•టర్లు పూర్తి చేసుకున్నారు. 100 కిలోవి•టర్ల పూర్తి చేసుకున్న సందర్భంగా బండి సంజయ్‌..‌కేక్‌ ‌కట్‌ ‌చేసి.. తన వెంట నడుస్తున్న శ్రేణులకు అభినందనలు తెలిపారు. తెరాసను తోక పార్టీగా పేర్కొంటూ..ఇతర పార్టీలపై ఆధారపడే మనుగడ సాగిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హావి•లను కేసీఆర్‌ ‌తుంగలో తొక్కి.. పేదప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. భాష, యాస పేరుతో ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తున్న కేసీఆర్‌ ‌మాటలను నమ్మవద్దని ఆయన సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page