సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు

  • తొలి మెగా హెల్త్ ‌క్యాంపు విజయవంతం…
  • 56 మందికి మోకాళ్ల చిప్పల మార్పిడి సర్జరీ అవసరమని గుర్తింపు
  • మంత్రి హరీష్‌ ‌రావు చొరవతో త్వరలో ఉచితంగా ఆపరేషన్లు
  • 3 గురు క్యాన్సర్‌ ‌పేషంట్లను ఎంఎన్‌జె హాస్పిటల్‌కు రిఫర్‌
  • 40 ‌గ్రామాలు, 439 పేషేంట్లు..
  • ఎంఎన్‌జె, సిద్దిపేట వైద్య కళాశాల వైద్య బృందాన్ని అభినందించిన మంత్రి హరీష్‌ ‌రావు

సిద్దిపేట, మార్చి 26(ప్రజాతంత్ర బ్యూరో) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు సూచనల మేరకు సిద్దిపేట రూరల్‌ ‌మండలం రాఘవాపూర్‌ ‌గ్రామంలో క్యాన్సర్‌, ‌మోకాళ్ల నొప్పుల పరీక్షల కోసం చేపట్టిన ఉచిత క్యాంప్‌ ‌విజయవంతమైంది. శనివారం ఎంఎన్‌జె హాస్పిటల్‌, ‌సిద్ధిపేట ప్రభుత్వ హాస్పిటల్‌ ‌వైద్యుల సహకారంతో రాఘవాపూర్‌ ‌గ్రామంలో జరిగిన ఉచిత క్యాంపుకు సిద్దిపేట రూరల్‌, ‌సిద్ధిపేట అర్బన్‌, ‌నారాయణరావుపేట మండలాలకు చెందిన సుమారు 40 గ్రామాల నుంచి 449 మంది పేషెంట్లు ఉచిత పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో మోకాళ్ల నొప్పులకు సంబంధించి 336 మంది పరీక్షలు చేయించుకోగా 56 మందికి మోకాళ్ల మార్పిడి ఆపరేషన్‌ అవసరమని గుర్తించినట్లు తెలిపారు. అదే విధంగా క్యాన్సర్‌ ‌పరీక్షలు 113 మంది చేయించుకోగా అందులో 23 మందిలో క్యాన్సర్‌ ‌గుర్తింపు పరీక్షలు చేసి రిపోర్ట్‌లు పంపించామని త్వరలోనే వీరి ఫలితాలు వొస్తాయన్నారు.

ముగ్గురు పేషెంట్లను ఎంఎన్‌జె హాస్పిటల్‌కు రిఫర్‌ ‌చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. మోకాళ్ల మార్పిడి అవరసం ఉన్న వారికి హైదరాబాద్లో గానీ, సిద్ధిపేట జనరల్‌ ‌హాస్పిటల్‌లో ఉచిత మోకాళ్ల మార్పిడి చికిత్స కానీ , ఆవరమున్న పేషంట్లకు క్యాన్సర్‌ ‌చికిత్స అందిస్తామని వైద్యాధికారులు వెల్లడించారు. 50 మంది వైద్య బృందం మెగా హెల్త్ ‌క్యాంప్‌లో పాల్గొని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటళ్లలోనే మోకాళ్ల మార్పిడి జరిగేలా ఒక గొప్ప నిర్ణయం ప్రభుత్వం తీసుకుందన్నారు. క్యాన్సర్‌ ‌వ్యాధిని గుర్తించడానికి ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. అంతకుముందు ఈ ఉచిత మెగా హెల్త్ ‌క్యాంపు ఎంపీపీ శ్రీదేవి చందర్రావు, సుడా చైర్మన్‌ ‌రవీందర్‌ ‌రెడ్డి, ఓఎస్డీ బాలరాజు, జడ్పీటీసీ శ్రీహరిగౌడ్‌, ‌డీఎంహెచ్‌ఓ ‌మనోహర్‌, ‌వైద్యాధికారి కాశీనాథ్‌, ఎం‌పీడీఓ సమ్మిరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు…త్వరలో ఉచితంగా ఆపరేషన్లు : వైద్య బృందాన్ని అభినందించిన మంత్రి హరీష్‌ ‌రావు..
మోకాళ్ళ చిప్పల మార్పిడి ప్రయివేటు హాస్పిటల్‌లో మాత్రమే జరిగేది కానీ తెలంగాణ ప్రభుత్వం తొలి సారిగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ హాస్పిటల్‌లోనే చేసే విధంగా గొప్ప నిర్ణయం తీసుకుందని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. అందుకుగాను సిద్దిపేట నుండే తొలి అడుగు పడటం, హెల్త్ ‌క్యాంపుకు అపూర్వ స్పందన వొచ్చిందని, 336 మంది మోకాళ్ళకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తే 56 మందికి ఆపరేషన్‌ అవసరం ఉంటుందని గుర్తించామని, త్వరలోనే సిద్దిపేట ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజ్‌ ‌హాస్పిటల్‌ ‌వారికి రక్త, గుండె, ఇతర పరీక్షలు నిర్వహించి హైదరాబాద్‌ ‌గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ‌హాస్పిటళ్లకు పంపించి మోకాళ్ళ చిప్పల మార్పిడి చేపడతామని చెప్పారు. హెల్త్ ‌క్యాంప్‌ ‌విజయవంతం కావడంలో చొరవ చూపిన ప్రజాప్రతినిధులకు, ఎంఎన్‌జె, సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళశాల వైద్య బృందాన్ని మంత్రి అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page