సర్కారి వైద్యానికి జవసత్వాలు నింపండి..!

“ఏ ‌దేశంలోనైనా రాష్ట్రాలలోనైనా ప్రజలు పూర్తి ఆరోగ్యంగా జీవించాలంటే ? వైద్య, ఆరోగ్యరంగానికి నిధులు బడ్జెట్‌లో పెంచాల్సి ఉంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అత్యవసర వసతులు, యంత్రాలు, ఔషదాలు, వైద్య నిపుణులు, ఆ రంగంలోని అన్ని రకాల సిబ్బందిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన నియామకాలు చేపట్టాల్సి ఉంది. నేటి సర్కారీ దవాఖానాల దుస్థితికి గత ప్రభుత్వాలతో పాటు నేటి పాలకుల నిర్లక్ష్యమే కారణం.

మన దేశంలో సర్కారు దవాఖానాల దుస్థితి రోజు రోజుకు పెరిగిపోతుంది. అత్యవసర సేవలు ఔషధాలు, వైద్య సిబ్బంది లేమితో దయనీయ స్థితికి దిగజారి పోతున్నాయి. వైద్య, ఆరోగ్య రంగానికి ప్రభుత్వాలు బడ్జెటులో సరైన ప్రాధాన్యత ఇవ్వడంలో ప్రపంచంలోని 189 దేశాల్లో 179వ స్థానంలో నిలిచిందని 2020-21 ఆర్థి సర్వేనే స్పష్టం చేసింది. ప్రజల ఆయురారోగ్యాలకు భరోసా కల్పించడంలో, సర్కారు దవాఖానాలక• పరిపుష్టి నింపడంలో నానాటికీ వెనకడుగు వేస్తూనే ఉన్నాయి. ఇలా ప్రభుత్వాల నిర్లక్ష్య విధానాల మూలంగా దేశంలోని ప్రజలకు ప్రాథమిక స్థాయి నుంచి సరైన వైద్య సదుపాయాలు కల్పించడం లేదు. అంతేకాదు ప్రభుత్వ దవాఖానాలు విఫలమౌతున్నందువల్లే ప్రైవేట్‌, ‌కార్పొరేట్‌ ‌రంగంలోని దవాఖానాలు ధనార్జనే ధ్యేయంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. 1947 సం।।లో కేవలం 8% (ఎనిమిది) శాతం ప్రైవేట్‌ ‌దవాఖానాలు ఉండగా, నేడు 93 శాతం దవాఖానాలు ప్రైవేటు, కార్పొరేటు రంగంలోనే ఉన్నాయి. 64 శాతం దవాఖానాల పడకలు, 80-85 శాతం వైద్యులు ప్రైవేట్‌, ‌కార్పొరేట్‌ ‌దవాఖాలకే పరిమితమైనారు. దేశంలో సుమారు 75 శాతం డిస్పెన్సరీలు, 60 శాతం దవాఖానాలు, 80 శాతం వైద్యులు పట్టణాలు, నగరాల్లోనే కేంద్రీకృతమై ఉండటం గమనార్హం.

ప్రజారోగ్యంపై భారత ప్రభుత్వం ఏటా చేసే తలసరి వ్యయం మన పొరుగున ఉన్న శ్రీలంక, చైనాల కన్నా తక్కువ. ఆరోగ్య భీమాకు బ్రిటిష్‌ ‌ప్రభుత్వం 83.5 శాతం వాటా సమకూర్చుచుంటే ? భారత్‌ ‌కేవలం 32 శాతం సమకూర్చుతున్నట్లు భీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డిఎ) తెలిపింది. 76 శాతం భారతీయులకు ఆరోగ్య భీమా లేనందువలన చికిత్సకు సొంతంగా ఖర్చు పెట్టుకోవలసి వస్తుంది. ఇటీవల వెలువడిన జాతీయ ఆరోగ్య ముఖచిత్రం ప్రకారం తెలంగాణలో 75 శాతం, ఏ.పి.లో 50 శాతానికి పైగా దవాఖానాల ఖర్చులను సామాన్యులు సొంతంగా భరిస్తున్నారు. ఇలాంటి స్థితిలో చాలామంది సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. అమెరికా, స్వీడన్‌, ‌జపాన్‌ ‌లాంటి దేశాలు ప్రజారోగ్యానికి జి.డి.పి.లో పదిశాతంకు పైగా కేటాయిస్తుంటే ? వాటికి భిన్నంగా మనదేశంలో కోతలు విధిస్తూ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం వలన ప్రజా ఆరోగ్యం, వారి ప్రాణాలు గాలిలో దీపంగా మారిపోతున్నాయి.

మన రాజ్యాంగంలోని పౌర హక్కుల్లో అంతర్భాగమైన ప్రజల వైద్య చికిత్సల వ్యయం అందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు చూడాల్సిన బాధ్యతల నుండి తప్పుకోవడం భావ్యమా ! ఇలా దేశంలో వైద్య, ఆరోగ్య రంగంలో అసమానతలు రాజ్యమేలుతున్న వేళ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అత్యవసర(అత్యాధునిక) నాణ్యమైన వైద్య సేవలు అందని ద్రాక్షలే అవుతున్నాయి. మన దేశంలో 24 శాతం ఆరోగ్య ఉపకేంద్రాలు, 29 శాతం పి.హెచ్‌.‌సీ.లు, 38 శాతం సీ.హెచ్‌.‌సీల కొరత ఉన్నట్లుగా 2019-20 గ్రామీణ ఆర్థిక గణాంకాలు సాక్ష్యమిస్తున్నాయి. దవాఖానాల్లో అవసరాల మేరకు తగినంత సంఖ్యలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది లేని దుస్థితికి ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి ఉందనేది మరువరాదు. కరోనాకు సీజన్‌ ‌వ్యాధులు తోడైనందున సర్కారీ వైద్యులు, సిబ్బంది ప్రజలకు వైద్యసౌకర్యాలు అందించడంలో చాలా ఒత్తిడికి లోనౌతున్నారు.

ఏ దేశంలోనైనా రాష్ట్రాలలోనైనా ప్రజలు పూర్తి ఆరోగ్యంగా జీవించాలంటే ? వైద్య, ఆరోగ్యరంగానికి నిధులు బడ్జెట్‌లో పెంచాల్సి ఉంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అత్యవసర వసతులు, యంత్రాలు, ఔషదాలు, వైద్య నిపుణులు, ఆ రంగంలోని అన్ని రకాల సిబ్బందిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన నియామకాలు చేపట్టాల్సి ఉంది. నేటి సర్కారీ దవాఖానాల దుస్థితికి గత ప్రభుత్వాలతో పాటు నేటి పాలకుల నిర్లక్ష్యమే కారణం. అక్కడితో ఆగకుండా నిర్థాక్షిణ్యంగా వైద్య రంగాన్ని ప్రైవేట్‌, ‌కార్పొరేటు రంగానికి ధారాదత్తం చేస్తున్న తీరు విశ్లేషకులక•, ప్రజలక• విస్మయాన్ని కలిగిస్తుంది. వ్యాపార ధోరణిలోకి వైద్య, ఆరోగ్యాలు వెళ్లిపోతే సామాన్య, మధ్య తరగతి ప్రజల సంపాదనంతా వారి వైద్యానికే పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడున్న దోపిడి మించి పోతుందని ఆవేదన చెందుచున్నారు. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరిగా వైద్య ఖర్చుల భారం ప్రజలపై పడకుండా ప్రభుత్వాలే ఎక్కువ మొత్తంలో భరించేలా మన విధానాలు రావాలి. ఆరోగ్య భీమాను చిత్తశుద్ధితో అమలు జరుపుచూ ప్రభుత్వం సర్కారీ వైద్య ఆరోగ్య రంగానికి ఆర్థిక పరిపుష్టి నింపుతూ ప్రజారోగ్య రంగానికి సమగ్ర చికిత్స చేయాల్సి ఉంది. రక్తాన్ని పీల్చే జలగల్లాంటి ధనార్జనే ధ్యేయమైన కార్పొరేట్‌, ‌ప్రైవేట్‌ ‌రంగానికి వైద్య ఆరోగ్యాన్ని అప్పజెప్పి పాలకులు రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా మానవీయ బాధ్యతల నుండి తప్పించుకోరాదు.

ముమ్మాటికి ప్రజలకు మెరుగైన వైద్యాన్ని ఆరోగ్యాన్ని అందించాల్సిన రాజ్యాంగ బద్ధ పదవి ప్రమాణాల బాధ్యతలను  నిర్వహించాలి. ప్రజల ఆరోగ్యం వారి ఆస్తికన్న మిన్న కావున పాలకులు వారికి దేన్నైనా సమకూర్చవచ్చు. కానీ చేజారిన ఆరోగ్యాన్ని తిరిగి సమకూర్చడం చాలా కష్టం. ఈసురో మంటున్న జనాలు.. ఆరోగ్యమే మహాభాగం అన్నది.. సాదారణ నినాదం కాదు ? జనాలు సరైన జీవన విధానం. మన దేశంలో తీవ్రమైన పోషకాహార లోపాన్ని, వైద్యుల, దవాకానాల, ఇతరత్ర సిబ్బంది కొరతను తీర్చాలి. వైద్య రంగానికే సవాల్‌ ‌విసురుతున్న క్లిష్టమైన వ్యాధుల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలకు, నిరంతర పరిశోధనలను, సత్వర నాణ్యమైన చికిత్సలు అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రజా వైద్యాన్ని అందించాలి. స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగానైనా పాలకులు చిత్తశుద్ధితో అమలు పరిచి, సర్కారి వైద్యానికి రేపటి తరానికి జవసత్వాలు నింపాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానవీయ పాలనను అందించాలి.

meriki dhamodhar
మేకిరి దామోదర్‌, ‌వరంగల్‌ ‌సోషల్‌ ఎనలిస్ట్, ‌వరంగల్‌
9573666650

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page