మార్చి 23… అమర వీరుల దినోత్సవం

భారతదేశ చరిత్రలో మార్చి 23వ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది.  విప్లవవీరులైన సర్దార్‌ ‌భగత్‌సింగ్‌, ‌రాజ్‌గురు, సుఖదేవ్‌లు ఉరితీయ బడిన రోజు 1931 మార్చి 23. ప్రత్యేక పాకిస్తాన్‌ ‌కావాలని 1940లో తీర్మానించిన రోజు మార్చి 23. పాకిస్థాన్‌ ఇస్లామిక్‌ ‌ప్రజాస్వామ్యమని 1956లో తీర్మానం చేసి అమలులోకి తెచ్చుకున్న రోజు మార్చి 23.విప్లవ వీరులైన సర్దార్‌ ‌భగత్‌సింగ్‌, ‌రాజ్‌గురు, సుఖదేవ్‌లు ఉరితీయ బడిన రోజు 1931 మార్చి 23. ఈ రోజును అమర వీరుల దినోత్సవంగా జరుపు కుంటారు.

1927లో  భారతదేశానికి వచ్చన సైమన్‌ ‌కమిషన్‌ ‌లోఒక్క భారతీయుడైనా లేనందుకు నిరసనగా, ఉద్యమంలో
లాల్‌జీ కీలక పాత్ర వహించి, సైమన్‌ ‌కమిషన్‌ను బహిష్కరించాలి అంటూ పంజాబ్‌ అసెంబ్లీలో ఆయన తీర్మానం పెట్టి గెలిపించారు. ఇది ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. అక్టోబర్‌ 30, 1928‌న ఆ కమిషన్‌ ‌లాహోర్‌ ‌రాగా, లాల్‌జీ కూడా అహింసతో, మౌనంగా సైమన్‌ ‌వ్యతిరేక కార్యక్రమాన్ని నిర్వహించారు. మౌనంగా ఉద్యమిస్తున్న వారిపైన కూడా లాఠీ చార్జికి ఆదేశించాడు పోలీసు సూపరింటెండెంట్‌ ‌జేమ్స్ ఏ ‌స్కాట్‌. ‌తను స్వయంగా లాల్‌జీ మీద దాడి చేసి, లాల్‌జీ ఛాతీ మీద లాఠీ తో స్కాట్‌ ‌తీవ్రంగా కొట్టాడు. ఆ దెబ్బలతోనే లాల్‌జీ నవంబర్‌ 17‌న చనిపోయారు.

ఈ సంఘటనను కళ్లారా చూసిన భగత్‌ ‌సింగ్‌ ‌ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించు కున్నాడు. పోలీసు అధికారి స్కాట్‌ను హతమార్చడానికి విప్లవకారులు శివరామ్‌ ‌రాజ్‌గురు, జై గోపాల్‌, ‌సుఖ్‌దేవ్‌ ‌థాపర్‌లతో ఆయన చేతులు కలిపాడు. డీఎస్పీ జే. పీ. సాండర్స్ ‌కనిపించినప్పుడు పొరపాటుగా స్కాట్‌ అనుకుని,  జైగో పాల్‌ ఆయన్ను కాల్చమంటూ సింగ్‌కు సంకేతాలిచ్చాడు.  ఫలితంగా స్కాట్‌కు బదులు సాండర్స్ ‌హతమయ్యాడు. ఫిరోజ్‌ ‌పూర్లో బ్రిటిష్‌ ‌పోలీసు అధికారి జె.పి.సాండర్స్ ‌ను హత మార్చినందుకు గాను వారికి 1930లో అక్టోబర్‌ 7‌వ తేదీని ఈ మరణ శిక్షను ఖరారు చేశారు.

భగత్‌ ‌సింగ్‌ ‌సహా ముగ్గురికి ఉరిశిక్ష ఖరారు చేసిన   తీర్పు వివరాలను 2015లో ప్రచురించారు. ‘ఔ•తీతీ•అ• శీ• జుఞవశీఅఅ వఅవఅవ  ణవ••ష్ట్ర’ అనే విడుదల చేసిన పత్రంలో 1930 అక్టోబర్‌ 7‌వ తేదీన ఉరిశిక్ష విధిస్తూ తీర్పిచ్చినట్లు స్పష్టంగా ఉంది. 1931, మార్చి 23న ఉరిశిక్ష అమలు చేసినట్లు మరో పత్రంలో వివరాలు ఉన్నాయి. జైలు సూపరింటెండెంట్‌ ‌సంతకం చేసిన పేపర్‌ను టైమ్స్ ‌ఫ్యాక్ట్ ‌చెక్‌ ‌గుర్తించి బహిర్గతం చేసి, లాహోర్‌లోని పంజాబ్‌ ‌శాఖలో ఈ పత్రాలను ఇటీవల ప్రదర్శనకు ఉంచారు. 1930 అక్టోబర్‌ 7 ‌న న్యాయ స్థానము తీర్పును వెలువరించింది. తీర్పు 281 పేజీల్లో ఇవ్వబడింది. విచారణ ఎదుర్కొన్న వారందరికీ వివిధ శిక్షలు ఇవ్వబడ్డాయి. ఉరిశిక్ష: 1.భగత్‌ ‌సింహ్‌ 2. ‌సుఖఃదేవ్‌ 3. ‌రాజగురులకుబీ అలాగే ఆజన్మాంతర జీవిత ఖైదు: 1.కిశోరీలాల్‌ 2. ‌మహావీర్‌ ‌సింహ్‌ (అం‌డమాన్లో 9 రోజులు నిరాహార దీక్ష చేసి అమరుడయ్యాడు. 3. విజయ్‌ ‌కుమార్‌ ‌సింహ్‌ 4. ‌శివవర్మ 5. గయా ప్రసాద్‌ 6. ‌జయ దేవ్‌ ‌కపూర్‌ 7. ‌కమల్‌ ‌నాథ్‌ ‌తివారిలకుబీ అలాగే జీవిత ఖైదు: 1.కుందాన్లాల్‌ ( 7 ‌సంవత్సరాలు) 2. ప్రేమదత్‌ ( 5 ‌సంవత్సరాలు)లకుబీ అలాగే అజయ్‌ ‌ఘోష్‌, ‌సురేంద్రనాథ్‌ ‌పాండియ ఇంకా జితేంద్రనాథ్‌ ‌సన్యాల్‌ ‌లను విడిచి పెట్టారు. విచారణ లో ఉన్నవారందరూ కోర్టులను బహిష్కరించడం వలన తీర్పును లాహోర్‌ ‌లోని సెంట్రల్‌ ‌జైలు లో వినిపించారు.

తమను యుద్ధ ఖైదీలుగా గుర్తించడం ద్వారా ఉరి తీయకుండా కాల్పుల బృందం చేత హత మార్చాలని జైలులో ఉన్నప్పుడు భగత్‌ ‌సింగ్‌ , ‌మరో ఇద్దరు వైస్రాయికి లేఖ రాశారు. క్షమాభిక్ష ముసాయిదా లేఖపై సంతంకం కోసం భగత్‌ ‌సింగ్‌ ‌మిత్రుడు ప్రన్నత్‌ ‌మెహతా ఆయన్ను ఉరి తీయడానికి నాలుగు రోజుల ముందు మార్చి 20న జైలులో కలిశాడు. అయితే సంతకం చేయడానికి సింగ్‌ ‌నిరాకరించాడు. మార్చి 23న ఉరి తీసినట్లు జైలు అధికారులు మరణ ధ్రువీకరణ పత్రాన్ని విడుదల  చేశారు. అప్పటి సూపరింటిండెంట్‌ ఆఫ్‌ ‌పోలీస్‌ ‌వి.ఎన్‌. ‌స్మిత్‌ ‌ప్రకారం, భగత్‌ ‌సింగ్‌ను ముందుగానే ఉరితీశారు.

సాధారణంగా ఉదయం 8 గంటలకు ఉరి తీసేవారు. అయితే ఏమి జరిగిందో ప్రజలు తెలుసుకునే లోగానే ఆయన్ను ఉరితీయాలని నిర్ణయించుకుని…సుమారు రాత్రి 7 గంటల ప్రాంతంలో ఉరి తీశారు.
భగత్‌ ‌సింగ్‌ ‌వీర మరణం వృథా కాలేదు, ఎందరో యువకులను భారత స్వాతంత్య్రోద్యమము వైపుకు మరల్చింది. భగత్‌ ‌సింగ్‌ ‌మరణం భారత స్వాతంత్య్రోద్యమ కొనసాగింపుకు సాయపడేలా వేలాది మంది యువకుల్లో స్ఫూర్తిని నింపింది. ఆయన ఉరి అనంతరం ఉత్తర భారతాన పలు ప్రాంతాల్లో బ్రిటీష్‌ ‌ప్రభుత్వమునకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి.
 – రామ కిష్టయ్య సంగన భట్ల…
     9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page