జలమే….
సర్వ జీవులకు మూలం
విశ్వ జగత్తుకు ఆధారం
నిండు జలంతోనే…
ప్రకృతి పరవశించేను.
పుడమి పులకరించేను
వనం హరిత వన్నెలీనేను
పంట పైరు నాట్యమాడేను
పల్లె సిరులతో తులతూగేను
జగతి శాంతి క్షేత్రంగా వర్దిల్లేను
జలం లేకుంటే …
కరువులు కాటేసేను
కటిక దరిద్రం దరి చేరెను
ఆకలి మరణాలు పెరిగేను
చితి మంటలు మిన్నంటేను
జల యుద్దాలు సంభవించేను
జలమే మనకు
బలం… భవితవ్యం
సకలం…సౌభాగ్యం
నీటిని నిర్లక్ష్యం చేసిన
ఏ సమాజం బాగుపడదు
ఏ దేశం ప్రగతి సాధించదు
అందుకే …
జల పరిరక్షణకు
సమిష్టిగా ఉపక్రమిద్దాం
నీటి చుక్కల ఒడిసిపట్టి
పుడమి ఒడిలో దాచేద్దాం
జలాశయాలు పొంగించి
సిరుల పంటలు పండిద్దాం
సుసంపన్న జీవిక సాగిస్తూ
సుజల గీతికలు అలపిద్దాం
(మార్క్ 22న ప్రపంచ జల దినోత్సవం సందర్బంగా..)
– కోడిగూటి తిరుపతి, :9573929493