‘‘ఆ సమయంలో జమ్మూ కాశ్మీర్లో పోస్ట్ చేయబడిన సీనియర్ బ్యూరోక్రాట్ వజాహత్ హబీబుల్లా, కాశ్మీరీ పండిట్ల వలసలను ఆపమని లోయలోని చాలా మంది ముస్లింలు తనను అభ్యర్థించారని, వీరి అభ్యర్ధన తర్వాత దూరదర్శన్ టెలికాస్ట్ ద్వారా కాశ్మీరీ పండిట్లను ఉద్దేశించి జగ్మోహన్ను ఓ ప్రసంగం చేయమని కోరాను అని తెలిపారు. ఈ సత్యం రికార్డు అయి ఉంది. కాశ్మిరీ పండితులు లోయ వదిలి పొద్దు అని టీవీ ప్రసంగం చేయమని చెప్పినా చేయకుండా జగ్మోహన్ కాశ్మీరీ పండిట్లు లోయను విడిచి వెళ్ళిపోతే, వారి కోసం శరణార్థి శిబిరాలు ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు వారి జీతాలు కొనసాగిస్తామని ప్రకటించారు. కాశ్మీరీ పండితుల వలసల విషయంలో గవర్నర్ జగ్మోహన్ పాత్ర కూడా సినిమాలో పూర్తిగా మాయం అయింది. ’’
‘‘కాశ్మీరీ పండిట్లపై అత్యంత క్రూరమైన నేరాలు జరిగిన కాలంలో ఢిల్లీలో వీపీ సింగ్ ప్రభుత్వం ఉండేదన్న విషయం కూడా సినిమాలో చాకచక్యంగా దాచారు. ఈ వీపీ సింగ్ ప్రభుత్వన్ని బీజేపీ మద్దతు ఇస్తున్నది. కాశ్మీరీ పండితులపై అఘాయిత్యం జరిగిందని బీజేపీ తన మద్దత్తుని ఉపసంహరించుకోలేదు. సినిమాలో ఈ కాలంలో రాజీవ్‌గాంధీ హయాంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లుగా చూపే ప్రయత్నం చేసారు. ’’
‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా 1989-90ల కాలంలో జరిగిన కాశ్మీరీ పండిట్ల హత్యలు అనంతర వలసలను ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ బీజేపీ ఆలోచనల మేరకు చూపే సినిమా అని అర్థం చేసుకోవాలి అంటే కాశ్మీర్ రాజకీయ చరిత్ర కొంత తెలిసి ఉండాలి. ఆ చరిత్ర పరంపర సంక్షిప్తంగా ఇలా వుంది.
భారత-పాక్ లు ఆక్రమించిన కాశ్మీర్ మొత్తం ను స్వతంత్ర దేశంగా సాధించటం కోసం సాయుధ పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన నాయకుడు మక్బూల్ భట్ ఫిబ్రవరి 11, 1984 న తీహార్ జైలులో ఉరితీయబడ్డాడు. ఈ సంఘటన కాశ్మీరీ యువతలో అసంతృప్తిని పెంచడానికి కారకంగా పనిచేసింది. జూలై 1984లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని పడగొట్టారు. ఈ సంఘటన కాశ్మీర్ లోయలో మరోసారి అసంతృప్తిని రగిలించింది. శ్రీనగర్‌లో 72 రోజుల పాటు కర్ఫ్యూ విధించారు. ఇందిరాగాంధీ మరణం తర్వాత భారత ప్రధాని గా రాజీవ్ గాంధీ తో, 1986లో ఫరూక్ అబ్దుల్లా ఒప్పందం చేసుకుని మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.
జమ్మూ కాశ్మీర్ శాసనసభకు మార్చి 1987లో ఎన్నికలు జరిగాయి, ఇందులో నేషనల్ కాన్ఫరెన్స్..కాంగ్రెస్ జత కట్టి కూటమిగా ఏర్పడ్డాయి. ఈ ఎన్నికల్లో పెద్దఎత్తున రిగ్గింగ్ జరిగింది. ప్రతిపక్ష ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ (%వీఖఖీ%), కాశ్మీర్ లోయలో విపరీతమైన ప్రజాదరణ ఉన్నప్పటికీ, జరిగిన రిగ్గింగ్ వలన అసెంబ్లీ లో సీట్లు సాధించలేకపోయింది. ఈ ఎన్నికల రిగ్గింగ్ తర్వాత, కాశ్మీరీ యువతలోని అధిక జనాభా ఎన్నికల ప్రక్రియపై విశ్వాసం కోల్పోయింది… పెద్ద సంఖ్యలో యువకులు తుపాకులు పట్టుకున్నారు. అప్పటి నుంచి కాశ్మీర్లో సాయుధ పోరాటం బలమైన రూపం తెరపైకి వచ్చింది.
అయితే దీని తర్వాత కూడా తీవ్రవాద బాట పట్టాలని నిర్ణయించుకున్న చాలా మంది నేతలు 1987 ఎన్నికల్లో పాల్గొని ఎన్నికల రిగ్గింగ్‌తో భంగపడ్డారు అనేది గమనించదగ్గ విషయం. 1986లో ఏర్పడిన ఇస్లామిక్ స్టూడెంట్స్ లీగ్‌లోని నలుగురు ప్రముఖ సభ్యులు – అబ్దుల్ హమీద్ షేక్, అష్ఫాక్ మాజిద్ వానీ, జావేద్ అహ్మద్ మీర్, యాసిన్ మాలిక్ (వీరిని హాజీ గ్రూప్ అని పిలుస్తారు) వీరు ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ (%వీఖఖీ%)కి మద్దతుగా ప్రచారం చేశారు. హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ కూడా 1987 ఎన్నికలలో %వీఖఖీ% అభ్యర్థిగా పాల్గొన్నాడు. ఇతని అసలు పేరు మొహమ్మద్ యూసుఫ్ షా. కాశ్మీర్లో 1987లో జరిగిన ఎన్నికలలో భారీ రిగ్గింగ్ జరగడానికి మునుపటి 40 ఏళ్ల దుష్పరిపాలనలోని ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, అవినీతి కూడా ప్రధాన కారణాలు. 1988లో విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా జరిగిన ఓ ప్రదర్శనను అణచివేయడంతో కాశ్మీర్ లోయ ప్రజలలో తీవ్ర ఆగ్రహం రగిలింది. ఇదే సంవత్సరం, మక్బూల్ భట్ జయంతి సందర్భంగా, ‘‘స్వతంత్ర కాశ్మీర్’’ మద్దతుదారులపై పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
కాశ్మీర్లో జిహాద్ కోసం అమెరికా సహాయంతో ‘‘స్వతంత్ర కాశ్మీర్’’ పోరాటానికి ఇస్లామిక్ ఛాందసవాద రంగును పూలమాలనే మోసపూరిత ఆలోచనతో, ఆఫ్ఘనిస్తాన్లోని సోవియట్ యూనియన్‌పై పోరాడటానికి పాకిస్తాన్ శిక్షణ పొందిన ముజాహిదీన్లను పంపడం మొదలు పెట్టిన కాలం అది. ఆ సంఘటన ‘‘స్వతంత్ర కాశ్మీర్’’ పోరాటకి ముస్లిం రంగు పులమటంతో పాటు, మైనారిటీ కాశ్మీరీ పండిట్లపై ద్వేషాన్ని వ్యాప్తి చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది.
ఆ సమకాలీన చరిత్రను పూర్తిగా కనుమరుగు చేసి చరిత్ర పేరుతో కాశ్మీర్ ప్రాచీన చరిత్ర వైభవాన్ని, మధ్యయుగ భూస్వామ్య ముస్లిం పాలకుల అనాగరికతను చరిత్ర పేరుతో కథగా మలిచి వివేక్ అగ్నిహోత్రి ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాను తయారు చేసారు. ఈ సినిమా మొత్తం ‘హిందూ సమాజం ప్రమాదంలో ఉంది’ శత్రువు మరెవరో కాదు ‘ఇస్లాం ఛాందసవాదం’ అనే సంఘ్ పరివార్ ప్రచారానికి ఆజ్యం పోసేదిగా ఉంది. ఈ చిత్రం మొత్తంలో కాశ్మీరీ ముస్లిం జనాభాను కరడు గట్టిన సంఘటిత సమూహంగా చిత్రీకరిస్తుంది. కాశ్మీరీ ముస్లిం పాత్రలన్నీ, కాశ్మీరీ పండిట్ల రక్తం కోసం హిందువుల సంపదను ఆక్రమించుకోవాలని, హిందూ మహిళలను చెరబట్టడానికి తహతహలాడుతున్నట్టు ఈ చిత్రం చూపింది. ముస్లిం పిల్లలు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మద్దతుదారులు అని చూపారు. ముస్లిం మహిళలు రేషన్ డిపోలలో పండిట్లకు రేషన్ దొరకకుండా చేసేవారు. ముస్లింలు తమ పొరుగునున్న పండితులు పారిపోయే వరకు వేచి చూసి వారి ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు అని ముస్లిం మతపెద్దల దృష్టి హిందూ పండిత స్త్రీలపై ఉండేది అని సినిమాలో చూపే ప్రయత్నం చేసారు.
కాశ్మీర్ లో 1990లో పండిట్లపై ద్వేషం తారాస్థాయికి చేరుకున్న పరిస్థితిలో కాశ్మీరీ ముస్లిం జనాభాలో ఇలాంటి వ్యక్తులు ఉండి ఇలాంటి కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి అనేది కాదనలేము. ఎందుకంటే అలాంటి సంఘటనలు కొన్ని నమోదు అయి వున్నాయి. ఇదే కాలంలో కాశ్మీరీ ముస్లింలలో చాలా మంది కాశ్మీరీ పండిట్లను రక్షించారు. కాశ్మీరీ పండిట్లు లోయను విడిచి వెళ్లడం తమకు ఇష్టం లేదని వీరు ఎలుగెత్తి చాటారు. ఈ సంఘటనలు చాలా నమోదు అయి వున్నాయి అయితే వీటి ప్రస్తావన ‘ది కాశ్మీర్ ఫైల్స్’లో చూపలేదు. పండిట్ల వలసలు చూసి బాధపడే ఒక్క ముస్లిం పాత్ర కూడా సినిమాలో చూపెట్టలేదు. ఇలాంటి క్యారెక్టర్స్ చూపితే ముస్లిం ద్వేష ప్రభావం కాస్త తగ్గుతుందనేది డైరెక్టర్ కి తెలుసు.
కాశ్మీరీ పండిట్లపై దాడులు జరుగుతున్న కాలంలో మిర్వాయిజ్ మహ్మద్‌తో పాటు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ నాయకులు కాశ్మీరీ ముస్లింలందరినీ టార్గెట్ చేశారన్న సత్యాన్ని కూడా ఈ సినిమా చూపదు. పాకిస్తాన్ అనుకూల ఇస్లామిక్ ఛాందసవాదులు, కాశ్మీర్‌ను పాకిస్తాన్లో చేర్చడాన్ని వ్యతిరేకించే ముస్లింలను టార్గెట్ చేసారు. పాకిస్తాన్ తో కలవటానికి ఇష్టంలేని ముస్లింలలో కొందరు, భారతదేశంలో కలవాలి అనుకున్నారు. మరికొందరు పాకిస్తాన్ భారత్ రెండు వద్దు ‘‘స్వతంత్ర కాశ్మీర్’’ కావాలి అనుకున్నవారు వున్నారు. వీరంతా తీవ్రవాద పెచ్చరిల్లిన కాలంలో కాశ్మీరీ పండిట్ల కంటే చాలా రేట్లు అధికంగా హత్యగావించబడ్డారు. దీన్ని వివేక్ అగ్నిహోత్రి సినిమాలో చేపలేదు.
కాశ్మీరీ పండిట్లపై అత్యంత క్రూరమైన నేరాలు జరిగిన కాలంలో దిల్లీలో వీపీ సింగ్ ప్రభుత్వం ఉండేదన్న విషయం కూడా సినిమాలో చాకచక్యంగా దాచారు. వీపీ సింగ్ ప్రభుత్వాన్ని బీజేపీ మద్దతు ఇస్తున్నది. కాశ్మీరీ పండితులపై అఘాయిత్యం జరిగిందని బీజేపీ తన మద్దత్తుని ఉపసంహరించుకోలేదు. సినిమాలో ఈ కాలంలో రాజీవ్‌గాంధీ హయాంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లుగా చూపే ప్రయత్నం చేసారు.
వీపీ సింగ్ ప్రభుత్వం 2 డిసెంబర్ 1989న దిల్లీ పీఠం ఎక్కింది. డిసెంబర్ 8న కాశ్మీరీ మిలిటెంట్లు ఈ ప్రభుత్వంలోని హోం మంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ కుమార్తె, రూబియా సయీద్‌ను కిడ్నాప్ చేశారు. హోం మంత్రి కుమార్తెను విడుదల చేయించేందుకు భారత ప్రభుత్వం 5 మంది ఉగ్రవాదులను విడుదల చేసింది. దీని తర్వాత కాశ్మీర్ లోయలో తీవ్రవాదుల ఆధిపత్యం …కాశ్మీరీ పండిట్ల హత్యలు గణనీయంగా పెరిగాయి. దీనిని సినిమా చూపలేదు.
18 జనవరి 1990న, ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం రాజీనామా చేసింది. దీని తర్వాత అపఖ్యాతి పాలు నాయకుడైన జగ్మోహన్ ను కాశ్మీర్లో రెండవసారి గవర్నర్ పదవిలో నియమించారు. చాలా మంది కాశ్మీరీ పండిట్లు, జర్నలిస్టులు, విశ్లేషకులు గవర్నర్ గా జగ్మోహన్ స్వయంగా కాశ్మీరీ పండిట్లను లోయను ఖాలీ చేసి వెళ్లిపొమ్మని కోరారని. కాశ్మీరీ పండిట్లు తప్పించుకోవడానికి వాహనాలను కూడా అందించారని చెబుతారు. ఇలా చేయటం ద్వారా కాశ్మీర్ లోయలో భద్రతా బలగాలను నిర్దాక్షిణ్యంగా దింపేందుకు అవకాశం చేజిక్కుతుంది కనుక ఇలా చేసారు అని చెబుతారు. ఈ వివరణ వివాదాస్పదమైనప్పటికీ, జగ్మోహన్ హయాంలో కాశ్మీరీ పండిట్లు సురక్షితమైన వాతావరణాన్ని చూడలేకపోయారు అనేది కాదనలేని నిజం. దీని కారణంగా కాశ్మీరీ పండిట్ల వలసలు వెళ్ళవలసి వచ్చింది.
ఆ సమయంలో జమ్మూ కాశ్మీర్లో పోస్ట్ చేయబడిన సీనియర్ బ్యూరోక్రాట్ వజాహత్ హబీబుల్లా, కాశ్మీరీ పండిట్ల వలసలను ఆపమని లోయలోని చాలా మంది ముస్లింలు తనను అభ్యర్థించారని, వీరి అభ్యర్ధన తర్వాత దూరదర్శన్ టెలికాస్ట్ ద్వారా కాశ్మీరీ పండిట్లను ఉద్దేశించి జగ్మోహన్ను ఓ ప్రసంగం చేయమని కోరాను అని తెలిపారు. ఈ సత్యం రికార్డు అయి ఉంది. కాశ్మిరీ పండితులు లోయ వదిలి పొద్దు అని టీవీ ప్రసంగం చేయమని చెప్పినా చేయకుండా జగ్మోహన్ కాశ్మీరీ పండిట్లు లోయను విడిచి వెళ్ళిపోతే, వారి కోసం శరణార్థి శిబిరాలు ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు వారి జీతాలు కొనసాగిస్తామని ప్రకటించారు. కాశ్మీరీ పండితుల వలసల విషయంలో గవర్నర్ జగ్మోహన్ పాత్ర కూడా సినిమాలో పూర్తిగా మాయం అయింది.
అదేవిధంగా, ఈ చిత్రం జనవరి 19, 1990న శ్రీనగర్‌లో కాశ్మీరీ పండిట్లపై జరిగిన దాడులను విద్వేషపూరిత నినాదాలను వివరంగా చూపింది. ఇక్కడికి రెండు రోజుల తరువాత, శ్రీనగర్‌లోని గౌకడల్ వంతెన సమీపంలో సీ ఆర్ పీ ఎఫ్ విచక్షణారహితంగా చేసిన కాల్పులు వాస్తవాన్ని దాచిపెట్టింది. ఈ కాలంలో 50 మంది కాశ్మీరీలు ప్రాణాలు కోల్పోయారు. దీని తర్వాత కాశ్మీర్ లోయలో వాతావరణం మరింత దిగజారింది. ఇవన్నీ దాచేసిన సినిమా ‘ది కాశ్మీర్ ఫైల్స్’.