బిజెపి ఫేక్‌ ‌ప్రచారాలను తిప్పికొట్టాలి…

  • ఉద్యోగాల నోటిఫికేషన్‌తో బిత్తర పోయిన ‘బత్తాయి’నేతలు
  • నిరుద్యోగ యువకుల్లో అవగాహన కలిపించాలి
  • టిఆర్‌ఎస్‌ ‌యువనేతలకు మంత్రి హరీష్‌రావు పిలుపు

సిద్ధిపేట, మార్చి 18(ప్రజాతంత్ర బ్యూరో) : కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మరోసారి తనదైనశైలిలో విరుచుకుపడ్డారు. కేంద్రం పరిధిలో ఉన్న ఉద్యోగాల భర్తీ ఎన్నడూ మాట్లాడని రాష్ట్రానికి చెందిన బిజెపి నేతలు అలియాస్‌ ‌బత్తాయి నేతలు…రాష్ట్ర పరిధిలో 91వేల ఉద్యోగాల భర్తీ చేసేందుకు సిఎం కేసీఆర్‌ ‌నోటిఫికేషన్‌ను అనౌన్స్ ‌చేయడంతో రాష్ట్రంలోని నేతలు బిత్తరపోయాయరన్నారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో నారాయణరావుపేట మండల టిఆర్‌ఎస్‌ ‌యూత్‌ ‌విభాగం అధ్యక్షుడిగా ధీకొండ భాస్కర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందరాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి హరీష్‌ ‌రావును యూత్‌ ‌నేతలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే దాదాపుగా 91 వేల ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్లను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ..అందుకు యువత ఉద్యోగాల నోటిఫికేషన్లపై దృష్టి పెట్టాలన్నారు.

గ్రామాల్లో ఉండే నిరుద్యోగ యువతీ, యువకుల్లో అవగాహన కల్పించాలని నూతన యువజన విభాగం నాయకులకు సూచించారు. సిద్దిపేటలో కానిస్టేబుల్‌, ఇతర గ్రూప్స్ అన్ని పోటీ పరీక్షలకు త్వరలోనే ఉచిత శిక్షణ కార్యక్రమం పెట్టానున్నామన్నారు. సిఎం  కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా 91 వేల ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తునట్లు ప్రకటించడంతో బిజెపి బత్తాయిలు బిత్తర పోయారన్నారన్నారు. ఎంత సేపు నిరుద్యోగుల పట్ల వాళ్లకే ప్రేమ ఉన్నట్టు ఫేక్‌ ‌ప్రచారం చేస్తూ కాలం గడుపుతున్నారనీ, వారి ఫేక్‌ ‌ప్రచారాన్ని తిప్పికొట్టాలని టిఆర్‌ఎస్‌ ‌యువ నేతలకు పిలుపునిచ్చారు. కేంద్రం పరిధిలో ఖాలీగా ఉన్న ఉద్యోగాల భర్తీ సంగతిపై రాష్ట్రంలోని బిజెపి నేతలు ఎందుకు మాట్లాడరనీ ప్రశ్నించారు. విద్యా, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత సిఎం కేసీఆర్‌దేననీ, సిద్ధిపేటలో రెండు మెడికల్‌ ‌కాలేజీలను ఏర్పాటు చేసుకున్నామనీ, దేశం గర్వించే పథకాలు  తెలంగాణ రాష్ట్రంలో అమలు పరుస్తున్నామన్నారు.

ప్రభుత్వ పథకాలు, పార్టీ కార్యక్రమాలను ప్రజల వద్దకు చేర్చడంలో యువతదే బాధ్యత అన్నారు. గతంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినం.. ఇప్పుడు ఎన్ని ఇచ్చాం అనేది నిరుద్యోగ యువకుల్లో అవగాహన కలిపించాలన్నారు. కానిస్టేబుల్‌ ఉచిత శిక్షణకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page