ఉద్యోగ రంగంలో స్థానికతకు పట్టం

అసాధ్యాలను సుసాధ్యాలు చేయగల తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ ‌నీటిపారుదలకు సంబంధిం చిన ప్రపంచ రికార్డు నెలకొల్పా డానికి సిద్దమవుతున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సాఫల్యం చేయడంలో చేసిన అపర భగీరథ ప్రయత్నం సఫలీకృతం అవుతుం డగా, ఉద్యోగ రంగంలో దశాబ్దాల వివక్షతకు తెర దించుతూ, స్థానికత ఆధారంగా భర్తీలు పదోన్నతుల విషయంలోనూ పట్టిన పట్టు సడల నీయక విజయం సాధించిన క్రమంలో రాష్ట్రంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ఎట్టకేలకు శాసన సభలో సీఎం కేసిఆర్‌ ‌చేసిన వివరణాత్మక ప్రకటన యువతలో అవధులు లేని ఆనందాన్ని నింపుతున్నది. తెలంగాణ ప్రాంతీయులకు ఉద్యోగ రంగంలో దశాబ్దాలుగా చోటు చేసుకున్న అసమానతలను సమూలంగా రూపు మాపుతూ, ఉద్యోగ, పదోన్నతుల విషయంలో సమన్యాయం పాటించేందుకు కేసిఆర్‌ ‌నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చొరవ సత్ఫలితాన్ని అందించనుండగా, సదరు ప్రభుత్వ కృషి తెలంగాణ వాసులకు అమితానందాన్ని కలుగ చేస్తున్నాయి. •గతంలో అవిభక్త ఆంధ్ర ప్రదేశ్‌ ‌రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల, పదోన్నతుల విషయంలో జరిగిన అన్యాయమే తెలంగాణ తొలి, మలి దశల ఉద్యమాలలో ప్రధాన పాత్ర వహించింది. దానిపై సంపూర్ణ అవగాహన ఉన్న ఉద్యమ పార్టీ అధినేత, కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రంలో అసమానత, పక్షపాతం ఉండరాదని జోనల్‌ ‌వ్యవస్థ, సంబంధిత నిబంధనల మార్పు కోసం తీవ్ర కృషి చేసి, సఫలీకృతలయ్యారు.

సదరు నేపధ్యంలోకి వెళితే…ముల్కి నిబంధనలు, ఆరు సూత్రాల పథకం, పెద్దమనుషుల ఒప్పందం, రాష్ట్రపతి ఉత్తర్వులు, 610 ఉత్తర్వులు, గిర్‌ ‌గ్లానీ నివేదికలు, తెలంగాణ వాసులకు జరిగిన అన్యాయాన్ని నిలువరించ లేక పోయాయి. నిజాం పాలనలో ఉత్తరాది వారికే ఉద్యోగాలు అధికంగా దక్కగా, చాలాకాలం అనంతరం ఉవ్వెత్తున లేచిన ఉద్యమ ఫలితంగా మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ 1919 ‌లో ప్రవేశ పెట్టిన ముల్కీ నిబంధనల ప్రకారం తెలం గాణలోని ఉద్యోగాలన్నీ స్థానికులకే చెందాల్సి ఉండెను. దీని ప్రకారం 15 సంవత్సరాల కనీస నివాస యోగ్యతగా స్థానికత్వ నిర్ధారణ జరగాల్సి ఉండెడిది. అంతే కాక ఉద్యోగ విమణ తర్వాత కూడా తెలంగాణలోనే ఉండాలనే షర్తులు విధించ బడినాయి. తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగం పొందటానికి నివాస నిబంధన 12సంవతరాలు ఉండాలని నిర్ణయించ బడింది. 1973 సెప్టెంబర్‌ 28‌న జారీ అయిన ఆరు సూత్రాల పథకంలో భాగంగా 1975 అక్టో బర్‌ 18‌న రాష్ట్రపతి ఉత్తర్వులు 674 (ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌) ‌జారీ అయి, రాష్ట్రాన్ని 1,2,3 కోస్తాంధ్ర, రాయలసీమ మరియు 5,6 తెలంగాణ జోన్లుగా విభజించారు. ఈ ఉత్తర్వులోని పేరా 14 ప్రకారం కొన్నింటిని స్థానిక రిజర్వేషన్ల పరిధినుండి తప్పించడం జరిగింది. హైదరాబాద్‌ ‌లోని, మినహాయించిన ఆఫీసులకు కాకుండా, మిగిలిన అన్ని ప్రభుత్వ ఆఫీసులలో లోకల్‌ ‌రిజర్వేషన్‌ ‌పాటించాల్సిందని పేరా 20 సూచించింది. అలాగే పేరా 9 ప్రకారం 10వ తరగతి నుండి కింది స్థాయి 4 వ తరగతి వరకు చదివిన విద్యా సంస్థ జిల్లా పరిధిగా, ఆ జిల్లాలో 4సంవత్సరాలు చదువును స్థానికంగా వివరించారు.

రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లాస్థాయి కేడర్లలో 80%, జోనల్‌ ‌స్థాయిలో 60% స్థానికులకు ఉద్యోగాలు రిజర్వు చేయ బడినాయి. రిజర్వు చేయ బడినవి పోగా మిగిలినవి ఓపెన్‌ ‌కాంపిటీషన్‌ ‌ద్వారా భర్తీ చేయాలి. వాటిని స్థానికేతరులకు రిజర్వు చేయరాదని ఉత్తర్వులు స్పష్టంగా పేర్కొన్నాయి. 1918 నుండి అమలులో నున్న నివాస యోగ్యతను 15 నుండి 12కు (1956లో) అనంతరం 1975లో 4సంవత్సరాలకు తగ్గించగా, వివక్షత కొనసాగింది. రాష్ట్రపతి ఉత్తర్వులలో పేర్కొన్న విధంగా జోనల్‌ ‌వారీ విధానాన్ని సైతం తుంగలో తొక్కి, స్వార్ధమే పరమా ర్ధంగా పాలన కొనసాగించడం జరిగింది. నాటి ముఖ్య మంత్రి ఎన్టీ రామారావు నియమించిన జయభారత్‌ ‌రెడ్డి, కమలనాథన్‌, ఉమాపతిలతో, సీనియర్‌ ఐఎఎస్‌ అధికారుల త్రిసభ్య కమిటీ, 1975 నుండి 1984 మధ్య కాలంలో జరిగిన ఉద్యోగ నియామకాలను పరిశీలించి సమర్పించిన 36 పేజీల 1981 జూన్‌ 30‌నాటి నివేదికలో, జోన్ల రిజర్వేష న్లకు విరుద్ధంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన 1,2,3లకు చెందిన వారు తెలంగాణకు చెందిన 5.6 జోన్లలో 58,986మంది నిబంధనలకు విరుద్ధంగా నియమింప బడినట్లు పేర్కొనడం జరిగింది. ఈ నివేదికను పరిశీలించిన నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ 1985 ‌డిసెంబర్‌ 30‌న 610 జీవోను జారీ చేశారు.

గత పాలకులు చేసిన తప్పులను దిద్దుకునే క్రమంలో 1986 మార్చి 30కల్లా 610 జీవోను అమలు పరిచి, తెలంగాణలో ఉన్న ఆంధ్ర ఉద్యోగులందరినీ ఎవరి జోన్లకు వారిని పంపుతామని ఎన్టీఆర్‌ ‌ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఎన్టీఆర్‌ ‌ను గద్దెదింపి, ముఖ్య మంత్రి అయిన చంద్రబాబు రిటైర్డ్ ఐఎఎస్‌ అధికారి గిర్‌ ‌గ్లానీ ఏకసభ్య కమిషన్‌ ‌ను పునఃపరిశీలనకై నియమించగా, నివేదిక సమర్పించిన గిర్గ్లానీ స్థానికేతరులను నిర్ధారించ గల సంపూర్ణ సమాచారం పొందకుండానే, సమర్పిత నివేదికలో రాష్ట్రపతి ఉత్తర్వులను 126 పద్దతులలో ఉల్లంఘించడం జరిగిందని వివరించి, వాటిని 18రకాలుగా వర్గీకరించి, 35 పరిష్కార మార్గాలను సూచించడం జరిగింది. ఉద్యోగ నియామకాలన్నీ జోనల్‌ ‌నిబంధనలను అనుసరించి జరగాల్సి ఉండగా, జోనల్‌ ఆఫీసులను రాష్ట్రస్థాయి కార్యాలయాలుగా మార్చి ఇష్టారాజ్యంగా బదిలీలు చేయడం జరిగిందని, ఈ బదిలీలు తప్పని కమిషన్‌ అభి ప్రాయపడ్డది. గిర్గ్లానీ నివేదిక ప్రకారం సగంమంది స్థాని కేతరులు ఉన్నారని స్పష్టం అయింది.

ఇదిలా ఉండగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగాక, సదరు అన్యాయానికి ఇకనైనా అడ్డుకట్ట వేసేందుకు ఉద్యోగ ఉపాధ్యాయ, కార్మిక సంఘాల జేఏసి నేతలు పలు అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. తెలంగాణలోని జిల్లా, జోనల్‌, ‌రాష్ట్ర కేడర్ల 3లక్షల పోస్టుల వివరాలను పేర్కొంటూ, జూనియర్‌ అసిస్టెంట్‌, ‌క్రింది స్థాయి జిల్లా స్థాయికి, ఎస్టీటీ, స్కూల్‌ అసిస్టెంట్లు జిల్లా స్థాయిలో, గజి టెడ్‌ ‌హెచ్‌ఎం‌లు, ఎంఇఓలు జోనల్లో, ఉప విద్యాధికారులు బహుళ జోన్లో, అపైన రాష్ట్ర స్థాయిలో ఉండాలని సూచించారు. సదరు తీర్మానాల అంశాలను నాటి చీఫ్‌ ‌సెక్రటరీ సిఎస్‌ ‌జోషికి సమర్పించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి అంకురార్పణ జరిగింది సదరు వివక్షత కారణం ప్రధానం కాగా, అట్టి వివక్షత రూపు మాపేందుకు, సిఎం కేసిఆర్‌ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి, పలు అంశాలపై చర్చించి, 7జోన్లు, 2 మల్టీ జోన్లను 31 జిల్లాలను కలిపి ఖరారు చేశారు. ప్రధాన కార్యదర్శి ద్వారా నోట్‌ ‌ప్రభుత్వానికి సమర్పించ బడి, కేబినెట్‌ ‌సమావేశం నిర్వహించి, ఆమోదం పొంది, రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి సమర్పించి, మొత్తం వ్యవహారాన్ని అమలులోనికి తెచ్చేందుకు, సిఎం స్వయంగా పర్య వేక్షించారు. ప్రధానిని ఒప్పించి, మెప్పించిన ఫలితంగా కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించింది.

భారత ప్రభుత్వ గజెట్‌ ‌పార్ట్-2 ‌సెక్షన్‌ -3, ‌సబ్‌ ‌సెక్షన్‌ (1)…‌సంఖ్య 604, 20 ఆగస్టు 2018 ద్వారా హోంశాఖ జాయింట్‌ ‌సెక్రటరీ ఎస్‌.‌కే.షాహి సంతకంతో రాష్ట్రపతి పేరున గజిట్‌ ‌లో ప్రచురితమైంది. ప్రచురిత అంశాల ద్వారా స్థానికులకు 95 శాతం, ఓపెన్‌ ‌కోటాలో 5శాతం ఉద్యోగాల నియామకాలు, జిల్లా, జోనల్‌, ‌మల్టీ జోనల్‌ ‌పద్ధతులలో, రాష్ట్రస్థాయిలో పదోన్నతులు జరుప డానికి మార్గం సుగమం అయింది.•ఇదిలా ఉంటే… గత సాధారణ ఎన్నికల సమయంలో, ములుగు, నారాయణ పేట జిల్లాలను ఏర్పాటు చేయాలని, ప్రజలతో పాటు, టీఆర్‌ఎస్‌ ‌కేడర్‌ ‌కూడా ఉద్యమ బాట పట్టడం జరిగింది… అలాగే వికారాబాద్‌ ‌జిల్లాను గద్వాల జోన్‌ ‌నుంచి తొలగించి చార్మినార్‌ ‌జోన్‌ ‌లో కలపాలని, జనగామ జిల్లాలో కలిపిన గుండాల మండలాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలో కలపాలని ఆందోళనలు జరిగాయి.తదనుగుణంగా కెసీఆర్‌ ‌ములుగు, నారాయణ పేట జిల్లాలను ఎర్పాటు చేయడం జరిగింది. అలాగే జోనల్‌ ‌వ్యవస్థ కూడా సవరించే చర్యలు గైకొన్నారు.కేంద్ర హోంశాఖకు తిరిగి సమర్పి ంచారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు, ఇతర అంశా లపైహోం శాఖకు స్పష్టత రాలేదని ఆమోదంలో జాప్యం చేశారు.భారత రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 371- ‌డి ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు చేయడం కోసం. కేసిఆర్‌ ‌ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది.. కేసిఆర్‌ ‌స్వయంగా అనేకసార్లు ఢిల్లీకి వెళ్ళి. ప్రధానిని, రాష్ట్రపతిని కలిశారు. ప్రభుత్వ నిరంతర ప్రయత్నాల ఫలితంగా రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ సాధ్యమైంది.

ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలలో అత్యంత దిగువ స్థాయి క్యాడర్‌ ‌నుంచి ఉన్నత స్థాయి క్యాడర్‌ ‌దాకా అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్‌ అమలు చేయడానికి అవకాశం కలిగింది. దేశంలో స్థానికులకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 95 శాతం రిజర్వేషన్‌ ‌సాధించిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ కావడం గమనార్హం. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్‌ ‌శాతం పెరగటమే కాకుండా స్థానిక రిజర్వేషన్‌ ‌పరిధిలోకి వచ్చే పోస్టుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. గతంలో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 60 నుండి 80 శాతం వరకు మాత్రమే లోకల్‌ ‌రిజర్వేషన్‌ ‌పరిధి ఉండగా, నేడు అన్ని పోస్టులకు 95 శాతం లోకల్‌ ‌రిజర్వేషన్‌ అమలు చేసే అవకాశం ఏర్పడింది. స్థానిక అభ్యర్థులు తమ స్వంత జిల్లా జోన్‌, ‌మల్టీ 95% రిజర్వేషన్‌ ‌సౌకర్యాన్ని కలిగి ఉండడమే కాక ఇతర జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లలో 5% ఓపెన్‌ ‌కోటా ఉద్యోగాలకు కూడా పోటీ పడవచ్చు. శతాబ్దాల వలస పాలకుల వివక్ష వల్ల జరిగిన నష్టాన్ని, ఇబ్బందులను దూరం చేసేందుకు కేసిఆర్‌ అకుంఠిత కార్యదీక్ష అంకిత భావంతో కృషి, కనబరచిన చిత్తశుద్ది పట్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, నిరుద్యోగ యువ వర్గాల్లో అమితానందం వెల్లి విరుస్తున్నది. సాగునీరు విషయంలో చేసి, సత్ఫలి తాలు పొందుతున్న కేసిఆర్‌, ఉద్యోగ రంగంలోనూ చేసిన అపర భగీరథ ప్రయత్నం సఫలీకృతం అయిన వేళ… రాష్ట్ర యువతలో అవధులు లేని ఆనందం చోటు చేసుకుంది.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page