“ప్రారంభంలో సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్,ఆర్ వి ఎమ్ లలో భాగంగా కే జీ బి వి లు ఉన్నప్పటికీ ప్రస్తుతం సమగ్ర శిక్ష లో భాగంగా ప్రభుత్వ,లోకల్ బాడీ ఉపాధ్యాయుల వలె జిల్లా విద్యా శాఖ అధికారి పరిధిలో నియామకం అవుతు,వారి పర్యవేక్షణలోనే పని చేస్తున్నారు.6,7,8 తరగతులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అప్గ్రేడ్ చేసిన 9,10,11,12 తరగతులను కూడా బోధిస్తున్నారు..కేంద్ర ప్రభుత్వం ఎక్కువ వేతనాలు చెల్లిస్తునప్పటికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తక్కువ వేతనాలు పొందుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నియమింపబడుతూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే వేతనాలు పొందుతున్నారు.కాబట్టి రెగ్యులర్ చేయాలనే వారి డిమాండ్,కనీసం టైం స్కెల్ అయిన ఇవ్వాలనే వారి డిమాండ్ న్యాయబద్ధమైనదే.”
అసెంబ్లీలో ముఖ్యమంత్రి వీ ఆర్ ఎ లకు,సెర్ప్ ఉద్యోగులకు, మెప్మా,ఐ కే పి సిబ్బందికి,ఫిల్డ్ అసిస్టెంట్లకు వరాలు కురిపించారు.ఆ ప్రకటనల పట్ల ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలుగా హర్షం వక్తం చేస్తున్నాం. కానీ ఎంతోకాలంగా బాలికల విద్యకు,విద్యా వ్యవస్థకు సేవాలంసిస్తున్న కే జీ బి వి ఉపాధ్యాయుల, సమగ్ర శిక్ష ఉద్యోగుల ఊసే ఎత్తక పోవడం పట్ల విచారాన్ని వక్తం చేస్తున్నాం.వారం రోజుల క్రితం వనపర్తి సభలో ముఖ్య మంత్రి మాటలు ఎందరో నిరుద్యోగుల్లో,మరెందరో కాంట్రాక్టు ఉద్యోగ,ఉపాధ్యాయులలో ఆశలు రేపాయి.రేపు అందరు టీవీలు చూడండి అసెంబ్లీలో 10 గంటలకు అత్యంత ముఖ్యమైన విషయం ప్రకటిస్తానని చెప్పేసరికి నిరుద్యోగులతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగ,ఉపాధ్యాయులందరు ఎంతో ఆశతో ఎదురు చూశారు.గత ఎన్నికల ముందు కూడా వనపర్తి సభలోనే ముఖ్యమంత్రి కే జీ బి వి లో పని చేస్తున్న ఆడపడుచుల కష్టాన్ని గుర్తించాం, కే జీ బి వి లో పని చేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని మాట కూడా ఇచ్చారు.మళ్లీ అదే వనపర్తి సభలో రేపు అసెంబ్లీలో ముఖ్యమైన విషయం ప్రకటిస్తానని చెప్పేసరికి కాంట్రాక్టు ఉద్యోగ , ఉపాధ్యాయులందరు మాకు న్యాయం చేస్తారని ఆశించారు.
ఒకింత నిరుద్యోగుల ఆశలకు ఆవిరి పోస్తూ 80,039 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించినప్పటి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కాంట్రాక్టు ఉద్యోగ,ఉపాధ్యాయులకు నిరాశే మిగిలింది. కేవలం 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులనే రెగ్యులర్ చేయనున్నట్లు ప్రకటించడంతో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కే జీ బి వి ఉద్యోగ ,ఉపాధ్యాయులు,యు ఆర్ యస్ ఉపాధ్యాయులు,సమగ్ర శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న ఉద్యోగులు నిరాశకు గురి అయ్యారు. 2004వ సంవత్సరంలో కే జీ బి వి పాఠశాలలను భారత ప్రభుత్వం ప్రారంభించింది.మన రాష్ట్రంలో 2005బి2006లో కే జీ బి వి లు ప్రారంభించబడ్డాయి.అంటే గత 15 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా దశల వారిగా 475 కే జీ బి వి పాఠశాలల్లో సుమారు 11 వేల బోధన,బోధనేతర సిబ్బంది నియామకమై పని చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 8వ తరగతి వరకే నిధులు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆయా పాఠశాలలలో 9,10 తరగతులనే కాకుండా 11,12 తరగతుల వరకు అప్గ్రేడ్ చేస్తూ కొనసాగిస్తుండడం అభినందనీయం.కానీ ఆయా తరగతులకు సరిపోయిన ఉద్యోగ,ఉపాధ్యాయులను నియమించక పోవడం వల్ల పని ఒత్తిడి పెరిగింది.
ప్రారంభంలో సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్,ఆర్ వి ఎమ్ లలో భాగంగా కే జీ బి వి లు ఉన్నప్పటికీ ప్రస్తుతం సమగ్ర శిక్ష లో భాగంగా ప్రభుత్వ,లోకల్ బాడీ ఉపాధ్యాయుల వలె జిల్లా విద్యా శాఖ అధికారి పరిధిలో నియామకం అవుతు,వారి పర్యవేక్షణలోనే పని చేస్తున్నారు.6,7,8 తరగతులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అప్గ్రేడ్ చేసిన 9,10,11,12 తరగతులను కూడా బోధిస్తున్నారు..కేంద్ర ప్రభుత్వం ఎక్కువ వేతనాలు చెల్లిస్తునప్పటికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తక్కువ వేతనాలు పొందుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నియమింపబడుతూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే వేతనాలు పొందుతున్నారు.కాబట్టి రెగ్యులర్ చేయాలనే వారి డిమాండ్,కనీసం టైం స్కెల్ అయిన ఇవ్వాలనే వారి డిమాండ్ న్యాయబద్ధమైనదే. రాష్ట్రంలో ఉన్న ఇతర ఆశ్రమ పాఠశాలలతో పోల్చితే కే జీ బి వి ఉపాధ్యాయుల వేతనాలు చాలా తక్కువ.రెగ్యులర్ ఉపాధ్యాయుల కంటే మంచి ఫలితాలు సాధిస్తున్న రెగ్యులర్ ఉపాధ్యాయుల మినిమం బేసిక్ పే తో పోలిస్తే సగం జీతం కూడా కేజీబివి ఉపాధ్యాయులకు లేదు.
వార్డెన్ లేకపోవడం వల్ల వారంలో ఒకరోజు తప్పనిసరిగా రాత్రి డ్యూటీ చేయాల్సి వస్తుంది.చాలా కాలంగా మినిమం టైం స్కేల్ ఇవ్వాలని కోరుతు న్నప్పటికి గత పీ ఆర్ సిలో 30 శాతం జీతాలు మాత్రమే పెంచారు. మినిమం టైం స్కేల్ ప్రస్తావనే రాలేదు.ఇతర కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఇప్పటివరకు టైం స్కేల్ ఇచ్చారు.ప్రస్తుతం వారి సర్వీస్ ను కూడా రెగ్యులర్ చేస్తున్నారు.కానీ ఎంతో కష్టపడి బాలిక అక్షరాస్యతకు కృషి చేస్తున్నా కే జీ బి వి ఉపాధ్యాయునియులను మాత్రం రెగ్యులర్ చేయకపోవడం శోచనీయం.
ఉపాధ్యాయుల ఎమ్ ఎల్ సి ఎలక్షన్లు వచ్చినప్పుడు,గ్రాడ్యుయేట్ ఎమ్ ఎల్ సి ఎలక్షన్లు వచ్చినప్పుడు అనేక రకాల హామీలు ఇస్తూ వోట్లు్ల వేయించుకున్న తదుపరి వారిని పలకరించిన పాపాన పోలేదు.వారికి కనీస సౌకర్యాలు కల్పించలేక పోతున్నారు. దేశవ్యాప్తంగా 2001-2002 సంవత్సరంలో సర్వ శిక్ష అభియాన్ ప్రారంభము కాగా 2018లో దాన్ని సమగ్ర శిక్ష అభియాన్ గా మార్చారు.
2004 సంవత్సరం నుంచి అంటే సుమారు 17 సంవత్సరాలుగా మండల వనరుల కేంద్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు పనిచేస్తున్నారు.గత 15 సంవత్సరాలుగా 797 మంది ప్రత్యేక ఉపాధ్యాయులు(ఐ ఈ ఆర్ పి లు)ఇప్పటికీ కాంట్రాక్టు ప్రాతిపదికనే పనిచేస్తున్నారు.గత తొమ్మిది సంవత్సరాలుగా రాష్ట్రవ్యాప్తంగా 2500 మంది సిఆర్పి లు మండల వనరుల కేంద్రం పరిధిలో కాంట్రాక్టు పద్ధతిన విధులు నిర్వహిస్తున్నారు.గత తొమ్మిది సంవత్సరాలుగా ఎమ్ఐయెస్ కోఆర్డినేటర్లు ఎంఆర్సి పరిధిలో కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్నారు.గత 9 సంవత్సరాలుగా మెసెంజర్స్ కూడా ఎంఆర్సి పరిధిలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. పైన తెలిపిన వారే కాకుండా జిల్లా కేంద్రాలలో కూడా సమగ్ర శిక్ష లో అనేక ఉద్యోగులు కాంట్రాక్టు పద్దరిలోనే పని చేస్తూన్నారు.చాలిచాలని వేతనాలతో జీవితాలు కొనసాగిస్తున్నారు.గత పి ఆర్ సి లో కాంట్రాక్టు వారికి 30 శాతం వేతనాలు పెరిగినప్పటికి పెరిగిన ధరలతో పోలిస్తే అవి చాలా తక్కువే.
ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ ఇకా రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగ,ఉపాధ్యాయులు ఉండకూడదు అని ప్రకటించారు.అ విషయాన్ని ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాలుగా స్వాగతిస్తున్నాం.వీఆర్ఎ లకు,సెర్ప్ ,మెప్మా,ఐకెపి ఉద్యోగులకు మీరిచ్చిన వరాలను ప్రశంసిస్తున్నాం.దానితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 475 కేజీబివి లో పనిచేస్తున్న 11 వేల ఉద్యోగ,ఉపాధ్యాయులు యు.ఆర్.యెస్ ఉపాధ్యాయులు, సమగ్ర శిక్ష ఉద్యోగులు ఇతర డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగ ఉపాధ్యాయులందరిని న్యాయం చేయాలి.వారందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన వేతనాలు ఇవ్వాలి.బంగారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లో వారిని భాగస్వాములను చేయాలి.
– జుర్రు నారాయణ యాదవ్,తెలంగాణ టీచర్స్ యూనియన్,
జిల్లా అధ్యక్షులు,మహబూబ్ నగర్•,9494019270.