పునర్విభజన చట్టంలో హామీ మేరకు… ఖాజీపేటలో రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి

  • మంత్రి లాభదాయకం కాదని తెలిపారు
  • కానీ ఉద్దేశం రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం
  • రైల్వే బడ్జెట్‌పై లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎం‌పి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి

న్యూ దిల్లీ, మార్చి 16 : ఎనిమిదేళ్ళ క్రితం 2014లో చేసిన ఎపి పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఖాజీపేటలో రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సి ఉందని, గతంలో తాను పలు మార్లు లోక్‌సభలో ఈ అంశం గురించి ప్రస్తావించానని, ప్రధాని మంత్రిని, రైల్వే మంత్రిని కూడా కలిసి విజ్ఞప్తి చేశానని కాంగ్రెస్‌ ఎం‌పి ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి అన్నారు. చట్టపరమైన ఆ హామీకి ప్రాధాన్యత, అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని తెలిపారు. బుధవారం లోక్‌సభలో రైల్వే బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ప్రస్తుతం దేశంలో రైల్వే కోచ్‌లు తయారు చేసే అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే, ఖాజీపేటలో ఏర్పాటు చేయాల్సిన కోచ్‌ ‌ఫ్యాక్టరీ అంత లాభదాయకం కాదని గతంలో రైల్వే మంత్రి తెలిపారని, అయితే విభజన చట్టంలో రైల్వే కోచ్‌ ‌కర్మాగారం ఏర్పాటుకు హామీ ఇచ్చిన ఉద్దేశం ప్రధానంగా తెలంగాణలో అదనంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమేనని ఆయన నొక్కి చెప్పారు.

నూతనంగా 400 ‘‘వందే భారత్‌’’ అధునాతన ‘‘న్యూ జనరేషన్‌’’ ‌రైళ్ళను ప్రవేశపెట్ట పోతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన నేపథ్యంలో ఆ రైలు కోచ్‌లను తయారు చేయడానికి గతంలో ఇచ్చిన హామీ మేరకు ఖాజీపేటలో వందే భారత్‌ ‌రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం సముచితమని ఆయన అన్నారు. ప్రభుత్వానికి అంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇష్టం లేకపోతే, ప్రైవేట్‌, ‌ప్రభుత్వ భాగస్వామ్యంలో(పిపిపి) రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు చాలా మంది పారిశ్రామిక వేత్తలు సిద్ధ్దంగా ఉన్నారని అన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు, సాధ్యమైనంత త్వరగా ఖాజీపేటలో రైల్వే కోచ్‌ ‌కర్మాగారం ఏర్పాటు చేయాలని మరొకసారి తాను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని ఉత్తమ్‌ ‌తెలిపారు. అదే చట్టంలో హైదరాబాదు, విజయవాడల మధ్య రైల్వే, రోడ్డు మార్గాలను మరింతగా అభివృద్దిచేస్తామనే హామీ కూడా ఉందని, సూర్యాపేట, కోదాడల గుండా హైదరాబాదు నుంచి విజయవాడకు హైస్పీడు రైలు గాని, బుల్లెట్‌ ‌రైలు గానివేయాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. అహమ్మదాబాదు-ముంబై మధ్య ఏర్పాటు చేస్తున్న బుల్లెట్‌ ‌రైలు కంటే, హైదరాబాదు నుంచి విజయవాడకు బుల్లెట్‌ ‌రైలు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. తెలంగాణలో చిట్యాల నుంచి ఆంధ్ర ప్రదేశ్‌లోని జగ్గయ్యపేట వరకు కొత్త రైల్వే లైను వేయడంతో పాటు, ఆమార్గంలో హైస్పీడు రైళ్ళు నడిచిపించాలని విజ్ఞప్తి ఉత్తమ్‌కుమార్‌ ‌రెడిడ్డ ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనివల్ల హైదరాబాదు నుంచి విజయవాడకు 2 గంటల్లోనే ప్రయాణం చేయవొచ్చని, దేశంలో ఇతర రైలు మార్గాల కన్నా ఈ రైలు మార్గం చాలా లాభదాయకమనే విషయం అధ్యయనంలో స్పష్టంగా తెలుస్తుందని, కొత్తగా బాధ్యతలు తీసుకున్న రైల్వే శాఖ మంత్రి అధ్యయనం చేయిస్తే, స్పష్టంగా తెలుస్తుందని తాను విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న లోకసభ నియోజక వర్గంలోని కొన్ని అంశాలను సభ దృష్టికి తీసుకొస్తున్నానని, ప్రస్తుతం ఉన్న ‘‘మోటుమర్రి- మేళ్లచెరువు-మఠంపల్లి-జానపాడు-విష్ణుపురం’’ రైల్వే లైనులో కేవలంగూడ్సు రైళ్ళు నడుస్తున్నాయని, ఈ మార్గంలో ప్యాసింజర్‌ ‌రైళ్ళును కూడా నడపాలని రైల్వే మంత్రికి గతంలో పలుమార్లు విజ్ఞప్తి చేశానని గుర్తు చేశారు. అయుతే, ప్యాసింజర్‌ ‌రైళ్ళను ఈ మార్గంలో నడిపేందుకు కమిషనర్‌ ఆఫ్‌ ‌రైల్వే సేఫ్టీ అనుమతించలేదని సమాధానం ఇచ్చారని, ఈ అంశంపై ఆరా తీస్తే, ఇంతవరకు సంబంధిత అధికారులు, రైల్వే మంత్రిత్వ శాఖ అసలు ఈ అంశాన్ని కమిషనర్‌ ఆఫ్‌ ‌రైల్వే సేఫ్టీ దృష్టికే తీసుకెళ్ల లేదని తన పరిశీలనలో తేలిందని స్పష్టం చేశారు. రైల్వే మంత్రి ఈ విషయాన్ని గుర్తించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. తాను ఆ ప్రాంతం నుంచి వొచ్చినవాడినని, తనకు ఈ విషయంపై పూర్తి అవగాహన ఉందని, చాలా సులభంగా ప్యాసింజర్‌ ‌రైళ్ళను ఈ మార్గంలో నడపడం సాధ్యమేనని ఆయన అన్నారు. కమిషనర్‌ ఆఫ్‌ ‌రైల్వే సేఫ్టీ అనుమతించలేదని చెప్పడం వాస్తవంలా అనిపించడం లేదని, రైల్వే మంత్రి ఈ విషయాన్ని పరిశీలించాలని, కేవలం కొన్ని రైల్వే ప్లాట్‌ ‌ఫామ్‌లు మాత్రమే నిర్మించాల్సిఉంటుందని, ఇలాంటి మారుమూల ప్రాంతంలో ప్యాసింజర్‌ ‌రైళ్ళను నడపవచ్చునని తెలిపారు.

‘‘దోర్నకల్‌ ‌నుంచి నేలకొండపల్లి-కోదాడ్‌-‌హుజూర్‌ ‌నగర్‌-‌నేరేడుచర్ల గుండా మిర్యాలగూడెం’’ వరకు కొత్తరైల్వే లైను వేయాలని, ఆ రైల్వే మార్గం దేశంలోనే అత్యధిక సిమెంటు కర్మాగారాలు ఉన్న ప్రాంతం నుండి కాబట్టి ఈ రైల్వే లైను ఆర్ధికంగా ఎంతో లాభదాయకంగా ఉంటుందని అన్నారు. పెద్ద ఎత్తున బియ్యం మిల్లులు కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయని, అందుకే ఈ రైల్వే లైను వాణిజ్య పరంగా చాలా లాభదాయకమని, అందుకే ఈ కొత్త రైల్వే లైనును సాధ్యమైనంత త్వరగా నిర్మించాలని రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఏడాదిన్నర క్రితం పార్లమెంట్‌ ‌సభ్యులకు రైల్వే శాఖ అధికారులు ఓ ప్రెజెంటేషన్‌ ఇచ్చారని, అందులో దేశంలో పెద్ద నగరాలను కలిపే రైల్వే వ్యవస్థను మరింత మెరుగుపరచడమే రైల్వే శాఖకు అత్యంత ప్రాధాన్యత అని అధికారులు చెప్పారని, కానీ రైల్వే శాఖ ప్రాధాన్యత ఇస్తున్న నగరాల జాబితాలో హైదరాబాదు నగరం లేకపోవడం దురదృష్టకరం, అనాలోచిత విధానమని తెలిపారు. దేశంలో హైదరాబాద్‌ అత్యంత వేగంగా పెరుగుతున్న నగరమని, కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న పెద్ద నగరాల జాబితాలో తప్పనిసరిగా హైదరాబాద్‌ను చేర్చాలని ఉత్తమ్‌ ‌విజ్ఞప్తి చేశారు. మేళ్ల చెరువు నుంచి మిర్యాల గూడెం, నల్గొండ గుండా హైదరాబాదు వరకు ‘‘షటిల్‌ ‌రైలు’’ను వేయాలని కూడా ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page