హిజాబు ధరించడం మతపరమైన ఆచారం కాదు

  • యూనిఫామ్‌ను ధరించడం ఫ్రాథమిక హక్కులకు భంగం కాదు
  • స్కూల్‌ ‌నిబంధనల మేరకు నడుచుకోవాల్సిందే
  • పాఠశాలల్లో యూనిఫామ్‌ ‌ధరించాలన్న ఆదేశాలు పాటించాల్సిందే
  • కర్నాటక హైకోర్టు సంచనల తీర్పు.. పిటిషన్లన్నీ కొట్టివేత
  • హైకోర్టు తీర్పును స్వాగతించిన రాష్ట్ర సిఎం బొమ్మై

బెంగుళూరు, మార్చి 15(ఆర్‌ఎన్‌ఎ) : ‌హిజాబ్‌ ‌వివాదంపై కర్నాటక హైకోర్టు మంగళవారం సంచలన తీర్పును వెలువరించింది. స్కూళ్లలో హిజాబ్‌ ‌ధరించడం తప్పనిసరి కాదని కోర్టు తెలిపింది. హిజాబ్‌ ‌ధారణ ఇస్లాం మతంలో తప్పనిసరి ఆచారమేవి• కాదని హైకోర్టు చెప్పింది. స్కూల్‌ ‌నిబంధనల మేరకు నడుచుకోవాలని సూచించింది. విద్యా సంస్థల్లో హిజాబ్‌ను బ్యాన్‌ ‌చేయాలని దాఖలైన పలు పిటీషన్లలను కొట్టి పారేసింది. అయితే  ఇటీవల ఉడిపి కాలేజీలో ఆరుగురు అమ్మాయిలు హిజాబ్‌ ‌ధరించడం వల్ల వివాదం ముదిరిన విషయం తెలిసిందే. ఆ జిల్లాలో ఇవాళ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. విద్యాసంస్థల్లో హిజాబ్‌ ‌బ్యాన్‌ అం‌శంపై మంగళవారం త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విద్యాసంస్థల్లో హిజాబ్‌పై విధించిన బ్యాన్‌ను కోర్టు సమర్థించింది.

 

యూనిఫామ్‌ను ధరించడమనేది ఫ్రాథమిక హక్కులకు భంగం కాదని, కేవలం ఆంక్ష మాత్రమే అవుతుందని కోర్టు తెలిపింది. జస్టిస్‌ ‌రీతు రాజ్‌ అవాస్తీ కోర్టు తీర్పును వెలువరించారు. ఫిబ్రవరి 5వ తేదీని జారీ చేసిన ప్రభుత్వ జీవోను నిర్వీర్యం చేయడంలేదని కోర్టు చెప్పింది. కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల్లో హిజాబ్‌ ‌నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లను కర్ణాటక హైకోర్టు మంగళవారం కొట్టి వేసింది.ముస్లిం మహిళలు హిజాబ్‌ ‌ధరించడం ఇస్లాం ప్రకారం ముఖ్యమైన మతపరమైన ఆచారంలో భాగం కాదు. పాఠశాల యూనిఫాం ధరించడం సహేతుకమైన పరిమితి మాత్రమే, దీనిని విద్యార్థులు అభ్యంతరం చెప్పలేరు. యూనిఫాం ధరించడంపై జీవో జారీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పులో పేర్కొంది. పాఠశాల యూనిఫాం ధరించడం అనేది విద్యాసంస్థల ప్రొటోకాల్‌ అని, దీన్ని విద్యార్థులంతా తప్పనిసరిగా పాటించాల్సిందేనని హైకోర్టు పేర్కొంది. హైకోర్టు ఫుల్‌ ‌బెంచ్‌ ‌ఫిబ్రవరి 10వతేదీ హిజాబ్‌ ‌పిటిషన్‌లపై విచారణను ప్రారంభించింది. రెండు వారాల పాటు వాదనలు విన్న హైకోర్టు ఫిబ్రవరి 25వతేదీన తీర్పును రిజర్వ్ ‌చేసింది.

 

పాఠశాల, కళాశాల క్యాంపస్‌లలో హిజాబ్‌ను నిషేధించాలనే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. దీనిపై ఉడిపిలోని బాలికల ప్రభుత్వ కళాశాలకు చెందిన విద్యార్థినులు ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ పిటిషన్లు సమర్పించారు. కౌంటర్‌లో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం హిజాబ్‌ ‌ముఖ్యమైన మతపరమైన ఆచారం కాదని వాదించింది.దీంతో కర్ణాటక హైకోర్టు విద్యాసంస్థల్లో సంప్రదాయ వస్త్రధారణపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కోర్టు సమర్థించింది. కాగా కర్ణాటక హైకోర్టు తీర్పుపై పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.

హైకోర్టు తీర్పును స్వాగతించిన రాష్ట్ర సిఎం బొమ్మై
విద్యా సంస్థల తరగతి గదుల్లో విద్యార్థినులు హిజాబ్‌ ‌ధరించరాదని కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సమర్థించడాన్ని ముఖ్యమంత్రి బసవరాజ్‌ ‌బొమ్మయ్‌ ‌స్వాగతించారు. బాలల ప్రయోజనాల కోసం హైకోర్టు తీర్పును అందరూ పాటించాలని పిలుపునిచ్చారు. ఇది బాలల విద్యకు, భవిష్యత్తుకు సంబంధించిన విషయమని చెప్పారు. ముఖ్యమంత్రి బసవరాజ్‌ ‌బొమ్మయ్‌ ‌మంగళవారం విలేఖర్లతో మాట్లాడుతూ, ఈ తీర్పును అందరూ పాటించాలని కోరారు. ఇది విద్యార్థినీ, విద్యార్థుల భవిష్యత్తుకు, విద్యకు సంబంధించిన అంశమని చెప్పారు. తరగతులకు, పరీక్షలకు ఎవరూ గైర్హాజరు కావొద్దని కోరారు. ప్రజలంతా శాంతియుతంగా వ్యవహరించాలని కోరారు. మత పెద్దలు, తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రశాంతంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page