రాజీపడని యోధుడు కాళోజీ

‘‘ మానవతకు తలవొంపులు కలిగినప్పుడు,అన్యాయం, అవినీతి, అమానుషత్వం,దౌర్జన్యం విలయతాండవం చేసిన ప్పుడు ఆక్రందన వినిపించినప్పుడు, ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడుతున్నదని భావించినప్పుడు కాళోజీ ఎంతటి త్యాగానికైనా సాహసించారు.కాళోజీ నిరంతరం అన్యాయాలను అక్రమాలను ఖండీస్తూ సామాజిక బాధ్యత తో కలాన్ని ఖడ్గంగా ఉపయోగించారు. దీనికి ప్రేరణ ఖలీల్‌ ‌జిబ్రాన్‌ ‌ప్రొఫేట్‌ ‌కు తెలుగు అనువాదం జీవన గీతం పేరుతో చేశారు. అతని పై మేనమామ ప్రభావం కూడా ఉంది.’’

 

చలన శీలమైన మానవ జీవితానికి శస్త్ర తుల్యుడు కాళోజీ.20 వ శతాబ్దాపు తెలంగాణ సాహిత్య,సాంస్కృతిక చరిత్రలో కాళోజీ ది అధ్బుత అధ్యాయం.కొన్ని తరాలను ప్రభావితం చేసిన వ్యక్తి.కాళోజీ మాట్లాడకుండా ఉంటే ఈ సమాజం ఇలా ఉండేది కాదు. నిరంతరం ఉద్యమాలతో, పోరాటాలతో, ఘర్షణ లతో కొనసాగిన కాళోజీ జీవితం గ్రీష్మం. మానవతకు తలవొంపులు కలిగినప్పుడు,అన్యాయం, అవినీతి, అమానుషత్వం,దౌర్జన్యం విలయతాండవం చేసిన ప్పుడు ఆక్రందన వినిపించినప్పుడు, ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడుతున్నదని భావించినప్పుడు కాళోజీ ఎంతటి త్యాగానికైనా సాహసించారు. కాళోజీ నిరంతరం అన్యాయాలను అక్రమాలను ఖండీస్తూ సామాజిక బాధ్యత తో కలాన్ని ఖడ్గంగా ఉపయోగించారు. దీనికి ప్రేరణ ఖలీల్‌ ‌జిబ్రాన్‌ ‌ప్రొఫేట్‌ ‌కు తెలుగు అనువాదం జీవన గీతం పేరుతో చేశారు. అతని పై మేనమామ ప్రభావం కూడా ఉంది.

హైదరాబాద్‌ ‌లో ఉన్నప్పుడే కాళోజీ కి ఆర్యమాజంతో సంబంధం ఏర్పడింది.1930 నుంచి కాళోజీ గ్రంధాల యోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు.సాహిత్య రంగంలోనే కాకుండా సామాజిక,రాజకీయ ఉద్యమాలలో అగ్రగామిగా నిలిచారు.25 సంవత్సరాల వయస్సు లో కాళోజీ కి మొదటి సారి జైలు శిక్ష పడింది.విద్యార్థి దశలోనే వయస్సుకు మించిన నాయకునిగా ఎదిగారు. ఆర్యసమాజ కార్యక్ర మాలు, ఆంధ్ర మహాసభ విద్యార్థి ఉద్యమాలలో భాగస్వామి గా ఉపన్యాసకుని పాత్ర నెత్తికెత్తు కున్నాడు.ఇతర నాయకుల కంటే భిన్నంగా ప్రజలను కదిలించేలా ఉపన్యసించడానికి పదునైన గేయాలు తోడ్పడుతాయని గుర్తించారు.

అందుకే స్వరాన్ని సైరన్‌ ‌గా కలాన్ని కాహళి గా మార్చారు. అందుకే అన్యాయాన్ని ఎదురించే వాడే నాకు ఆరాధ్యుడు అని ప్రకటిం చారు. సంకుచితమైన ప్రాంతీయ వాది కావడానికి 1941 లో నల్గొండ జిల్లా చిలుకూరు గ్రామంలో రావి నారాయణ రెడ్డి గారి అద్యక్షతన 8 వ నిజామాంద్ర మహాసభ జరిగింది. నిజాం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణల గూర్చి చర్చించే సభ ఆ సభలో తెలంగాణ అంటే తెలం గాణేతరుల పట్ల వ్యతిరేక భావం కాదని ప్రసంగించారు.ఈ ఉపన్యాసం పలువురిని ఆకర్షించింది.

తెలంగాణ రైతాంగ పోరాట కాలంలో ఆనాటి భూస్వాముల అణచివేత ను పోలీసుల దౌర్జన్యాలను నిరసిస్తూ కవిత లు రాశారు.
నల్గొండ లో నాజీ వృత్తుల
నగ్న నృత్య మింకెన్నాళ్ళు
పోలీసుండని దౌర్జన్యాలు
పోషణ పొందెదింకెన్నాళ్ళు
దొంగ లు దొంగ లు ఊళ్లు పంచు కొని
దొరలై వెలిగెదెన్నాళ్ళు..

అంటూ ఇండియాలోనే తెలంగాణ ప్రాంతం నిజాం నిరంకుశత్వం కింద నలిగిపోతున్నది.ప్రపంచ నియంతలకే దిక్కు లేదు.నీ లెక్కెంత అని నిజాం పై గర్జించారు. అన్యాయం జరిగిందని భావించినా ఊరుకోలేనిది కాళోజీ తత్వం..1958లో ఉపాధ్యాయ నియోజకవర్గం తరుపున శాసనమ ండలిలో అడుగు పెట్టారు. ప్రభుత్వానికి కునుకులేకుండా చేశారు. ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న నిర్ణయాలను ఖండిస్తూ వచ్చారు.1969 ఉద్యమం సందర్భంగా ఉద్యమం ఆగబోదు అనే కవితలో

కోటిన్నర మేటి ప్రజల
గొంతొక్కటి గొడవొక్కటి
తెలంగాణ వెలసి నిలిచి
ఫలించాలే భారతాన
భారతమాతాకీ జై
తెలంగాణ జిందాబాద్‌..

1969 ‌నుండి కాళోజీ తెలంగాణ కు జరిగిన మోసాన్ని ,తెలంగాణ ప్రజలు సాంస్కృతికంగా,సామాజికంగా కోల్పోయిన అన్ని అంశాలపై కవితలు రాశారు.తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు చేస్తుంటే సమైక్యాంధ్ర వాదులు ప్రత్యేక వాదం సమైక్య తకు భంగం అన్నారు.అప్పుడు కాళోజీ రాజ్యాలను విభజిస్తే భారత సమైక్య తకు భంగం వాటిల్లుననేవాడు అబద్ధాల కోరు అని ఆంధ్రుల అబద్ధాలను బట్ట బయలు చేశారు. తెలంగాణ ప్రజలకు రాజ్యాంగ పరంగా ఇచ్చిన హమీలు ఉల్లంఘనల వల్ల కోల్పోయిన హక్కుల అంశాలే ఎక్కువ. ఎమర్జెన్సీ కాలంలో మహామహుల న్యాయ మూర్తులే మౌనంగా ఉన్నప్పుడు పౌరుల బాధ్యత ఎరిగిన స్వేచ్ఛ స్వాతంత్య్రాల కోసం గళమెత్తారు. పౌర హక్కుల ఉద్యమంలో పాల్గోని రాజకీయాలను ప్రజాకీయాలను జోడించారు.

మాజీ ప్రధాని పి వి నరసింహ రావు కాళోజీ ప్రభావం నా మీద గాఢంగా పడీందని ఏదన్నా నిర్ణయం తీసుకున్న ప్రతిసారి కాళోజీ ఏమంటాడో అని ఆలోచిస్తూ ఉండే వాడినని, నా ఆత్మగా కాళోజీ కూర్చున్నాడు అని అన్నారు.తెలంగాణ సంస్కృతి పై తెలంగాణ ప్రజల యాసపై ,తెలంగాణ పై కాళోజీ ప్రేమ నైజాం నుండి మరణించే వరకు కొనసాగింది. అందుకే ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమానికి ప్రేరణగా ఉన్నారు .కాళోజీ నుంచి స్ఫూర్తి కాళోజీ గొప్ప ప్రజాస్వామ్య వాది. ప్రజాస్వామ్య భావనను నరనరాన జీర్ణించుకున్నారు.

నీ అభిప్రాయం నేను ఏకీభవించకపోవచ్చు కానీ నీ అభిప్రాయాన్ని స్వేచ్ఛ గా ప్రకటించుకునే నీ హక్కు కోసం అవసరం అయితే నేను నా ప్రాణాన్ని ఫణంగా పెట్టి పోరాడుతానని అన్న ఫ్రెంచ్‌ ‌మేధావి వోల్టేర్‌ ‌మాటలు కాళోజీ ఆచరించారు.కాళోజీ అభిప్రాయం లో ప్రజాస్వామ్య సంస్కృతి అంటే అందరూ ఓట్లు వేయడం కాదు,మనతో ఏకీభవించని వాళ్ళను కూడా మనం గౌరవించడం, ఇచ్చి పుచ్చుకునే ధోరణిని అలవరుచుకోవడం, విమర్శను అసమ్మతిని స్వికరించడం, ఒకరి అభిప్రాయాలు ఇష్టాఇష్టాలను ఇంకొకరి మీద బలవంతంగా రుద్దకపోవడం ఇది ప్రజాస్వామ్యం. ఇలాంటి ప్రజాస్వామ్యాన్ని అందరూ జీవన తత్వంగా మలుచుకోవాలని అన్నారు.

కళ్ళముందే జరుగుతున్న అన్యాయాలను,అకృత్యాలను, దౌర్జన్యాలను దోపిడీ ని ధిక్కరిస్తూ అందరి గొడవనే నా గొడవ గా మలిచారు. మనిషి జీవితాన్ని ఇంత సామాన్యంగా తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా ఇంత నిరాడంబరంగా జీవించవచ్చు అని, న్యాయం కోసం పోరాడే వారిలో, ప్రజల గురించి పట్టించుకునే వారిలో, రాజకీయ కపటత్వాన్ని ఎండగట్టే వారిలో కాళోజీ ఎప్పుడూ బతికే ఉంటాడు.
– బెల్లంకొండ హరిక్రిష్ణ
తెలంగాణ విద్యావంతుల వేదిక
92471 11216

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page