మానసిక ఆరోగ్యాన్ని విస్మరిస్తున్న పౌర సమాజం

మానసిక ఆరోగ్యం అనేది చాలా కాలంగా పౌర సమాజం  విస్మరిస్తున్న నిశ్శబ్ద సంక్షోభం. వర్క్‌ప్లేస్ సర్వేలో మెంటల్ హెల్త్ అండ్ వెల్‌నెస్ కోషెంట్ అనేది ఉండాలి.  2023 నేషనల్ మెంటల్ హెల్త్ సర్వేలో  42% కార్పొరేట్ భారతదేశంలో నిరాశ లేదా ఆందోళన రుగ్మతలతో బాధపడుతున్నారని గణాంకాలు తెలుపుతున్నాయి. డిప్రెషన్‌తో బాధపడుతున్న ముగ్గురిలో ఇద్దరు ఇప్పటికీ పనిలో లేదా కొత్త ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు ఇబ్బందులు  ఎదుర్కొంటున్నారు. పది మందిలో ఒకరికి మాత్రమే ఎంప్లాయీ అసిస్టెన్స్ ప్రోగ్రామ్  యాక్సెస్ ఉంది మరియు భారతదేశంలో కేవలం వెయ్యికి పైగా నమోదిత కార్పొరేట్ సంస్థలు నిర్మాణాత్మక ఎంప్లాయీస్  అసిస్టెన్స్  ప్రోగ్రాంను కలిగి ఉన్నాయి. ఈ సర్వే ఫలితాలు మన శ్రామిక శక్తిలో దాదాపు సగం మంది మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

 

పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు. ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని శాస్త్రీయ పద్ధతిలో అర్థం చేసుకోవాలి, కార్యాలయంలో మానసిక ఆరోగ్యానికి కారణమయ్యే  అంశాలు  గుర్తించాలి,  ఉద్యోగుల కోసం పరివర్తన విధానాలు కేంద్రీకృత మానసిక-ఆరోగ్య కార్యక్రమాలను ప్రోత్సహిస్తుంది. మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం ఐక్యరాజ్యసమితి  సుస్థిర అభివృద్ధి లక్ష్యం  3ని చేరుకోవడానికి  సీఎస్ఆర్  నిధులు,  వనరుల దృక్పథాన్ని పునర్నిర్వచించడంలో సహాయపడుతుంది. మరీ ముఖ్యంగా, మానసిక-ఆరోగ్య పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి వినూత్న పబ్లిక్, ప్రైవేట్  కమ్యూనిటీ-ఆధారిత భాగస్వామ్యం సృష్టికి ఇది మార్గదర్శకంగా పనిచేస్తుంది. నిమ్ హన్స్  2022- 23 సర్వే ప్రకారం, దాదాపు 18% భారతీయ పెద్దలు ఏదో ఒక రకమైన మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇది దేశంలోనే 210 మిలియన్ల కంటే ఎక్కువ మంది బాధపడుతున్నారు, కొద్దిమందికి మాత్రమే అవసరమైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మానసిక వైద్యుల కొరత తీవ్రంగా ఉంది.  భారతదేశంలోని 80% పైగా ప్రభుత్వ హాస్పిటల్స్  కు మానసిక వైద్యులు లేరు.

 

చాలా మంది భారతీయ మానసిక వైద్యులు మెరుగైన అవకాశాల కోసం విదేశాలకు వెళ్లేందుకు ఇష్టపడటం ప్రధాన కారణాలలో ఒకటి.  145 కోట్ల  కంటే ఎక్కువ జనాభా ఉన్న దేశంలో  కేవలం 9,000 కంటే తక్కువ మంది మానసిక వైద్యులు ఉన్నారు.  వృత్తిపరమైన సహాయానికి ప్రాప్యత ఉన్న వ్యక్తులలో, చాలా తక్కువ మంది దానిని కోరేందుకు ఇష్టపడతారు. మానసిక అనారోగ్యం భారతదేశంలో ఎక్కువగా నిషిద్ధ అంశంగా కొనసాగుతోంది.   మానసిక వికలంగత  అంటే బుద్ధి మాంద్యతే కాకుండా మానసిక ఇతర మానసిక అస్వస్తత, బుద్ధిమాంద్యం అంటే ఒక వ్యక్తి మానసికంగా అసంపూర్తిగా ఎదగడం లేదా ఎదుగుదల ఆగిపోవడంతో ప్రత్యేకంగా అతి తక్కువ తెలివితేటలు కలిగి ఉండటం. వికలాంగత గల వ్యక్తి అంటే ఒక వ్యక్తి 40 శాతానికి తక్కువ లేకుండా వైకల్యం కలిగి ఉన్నట్లుగా మెడికల్‌ బోర్డు సర్టిఫికెట్‌ ఇవ్వడం.  మెడికల్‌ బోర్డు ప్రతినెల నిర్ణీత సమయాల్లో జిల్లా వైద్యశాల యందు సమావేశమై సర్టిఫికెట్లు ఉచితంగా అందజేస్తుంది. ప్రతి జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు పరిచే నిమిత్తం సహాయ సంచాలకుల కార్యాలయం పనిచేస్తుంది.

భారతీయులు కొంత మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని  డబ్ల్యూహెచ్ఓ  అంచనా వేసింది , ఈ సంవత్సరం చివరినాటికి భారతదేశంలో సుమారు 20 శాతం మంది మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య లెక్కలను చూస్తే 56 మిలియన్ల భారతీయులు నిరాశతో బాధపడుతున్నారు, 38 మిలియన్ల మంది భారతీయులు ఆందోళన రుగ్మతలతో బాధపడుతున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలలో ఆరోగ్యం, సామాజిక, మానవ హక్కులు, ఆర్థిక పరిణామాలపై గణనీయమైన ప్రభావాలతో మానసిక రుగ్మతల భారం పెరుగుతూనే ఉంది.  పురుషుల కంటే ఎక్కువ మంది మహిళలు దీని బారిన పడుతున్నారు. నిరాశ, నిస్పృహ, బాధ, ఆనందం కోల్పోవడం, ఆత్మ విశ్వాసం కోల్పోవడం, నిద్ర లేమి, ఆకలి, అలసట, ఏకాగ్రత లేక పోవడం వంటివి ఈ మానసిక రుగ్మతలు కారణాలు. వీటి ప్రభావంతో మనుషులు ఆత్మహత్య చేసుకుంటారు .

 

మానసిక రుగ్మతలు: నిరాశ (డిప్రెషన్), బైపోలార్ డిజార్డర్, మనోవైకల్యం( స్కిజోఫ్రెనియా) , సైకోసెస్, చిత్తవైకల్యం, ఆటిజం. నిరాశ, నిస్పృహ, మానసిక రుగ్మతలకు ఆరోగ్య పరంగా, సామాజికంగా బయట పడటానికి ప్రజలకు అవకాశం ఉన్నది. మానసిక ఆరోగ్య కార్యాచరణ ప్రణాళిక 2020-2023  ప్రజలందరికీ ఆరోగ్యాన్ని సాధించడంలో పూర్తిగా విఫలమైంది మానసిక ఆరోగ్యానికి మరింత సమర్థవంతమైన నాయకత్వం పాలన,సమాజ-ఆధారిత అమరికలలో సమగ్ర, అందరికి మానసిక ఆరోగ్యం, సామాజిక సంరక్షణ సేవలను అందించడం, అమలు , నివారణ కోసం వ్యూహాలు అమలు,సమాచార వ్యవస్థ, పరిశోధనలను బలోపేతం చేయలేక విఫలమయ్యింది.  మానసిక రుగ్మతలతో బాధపడుతూ నిరాశ్రయులుగా ఎవరైనా కనపడితే  మనొబంధు  దృష్టికి తీసుకు రండి. స్థానిక అధికారులు, వైద్యులు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు, పోలీసు సిబ్బంది సమన్వయంతో వారిని  హాస్పిటల్ లో  చేర్పించి స్వస్థత చేకూరిన తర్వాత వారి కుటుంబాలకు చేరుస్తారు.  రెండు తెలుగు రాష్ట్రాల్లో  నిరాశ్రయులుగా సంచరించే ఒక్క మానసిక రోగి కూడా లేకుండా అందరినీ హాస్పిటల్  లేదా షెల్టర్ హోమ్ లో చేర్పించే కార్యక్రమంలో  పౌర సమాజం  భాగస్వామ్యం కావాలి.     ఈ యజ్ఞంలో  స్వచ్ఛంద సంస్థలు, స్వచ్ఛంద సేవకులు, నిర్వాసితుల సంక్షేమ సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొనాలి.

-డా. ముచ్చుకోట. సురేష్ బాబు, ప్రజాసైన్స్ వేదిక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page