రుణాల రీ-స్ట్రక్చరింగ్‌

  • ‌పన్నుల వాటాను 41 50 శాతానికి పెంపు
  • గత ప్రభుత్వం అప్పులతో వడ్డీల భారం
  • రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి తక్షణ సాయం అందించండి
  • ఆర్థిక సంఘానికి నివేదించినట్లు ఆర్థిక మంత్రి భట్టి వెల్లడి
 
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10 : ‌రాష్ట్రానికి భారంగా మారిన రుణాలను రీ-స్ట్రక్చరింగ్‌ ‌చేయాలని 16వ ఆర్థిక సంఘాన్ని కోరినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘానికి చేసిన విజ్ఞప్తులను ఆయన వెల్లడించారు. మంగళవారం ప్రజా భవన్‌లో 16వ ఆర్థిక సంఘం సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ….కేంద్ర పన్నుల నుంచి రాష్ట్రాలకు వొచ్చే ఆదాయం వాటాను 41 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని విన్నవించినట్లు తెలిపారు. కేంద్ర పథకాలను వినియోగించు కోవాలంటే.. కఠినమైన నిబంధనలు విధిస్తున్నారని, ఫలితంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయని భట్టి పేర్కొన్నారు. రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రాయోజిత పథకాలు వినియోగించుకునేలా స్వయం ప్రతిపత్తి కల్పించాలని కోరినట్లు తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వెంటనే సహాయం అందజేయాలని భట్టి విక్రమార్క  కోరారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల జీతాలకంటే మిత్తీలకే ఎక్కువ వెచ్చించాల్సి వొస్త్తుందన్నారు.
రైతు భరోసా, రైతు రుణమాఫీ రాష్ట్రానికి జీవరేఖ లాంటివని మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ రాష్ట్ర ప్రజలకు ఆర్థిక భరోసాలు, అధిక భద్రతను కల్పిస్తాయని వివరించారు. కేంద్ర పథకాలను వినియోగించుకోవాలంటే తరచూ రాష్ట్రాలకు కఠినమైన నిబంధనలు విధిస్తున్నారని అన్నారు. ఫలితంగా కేంద్ర ప్రయోజిత పథకాలను పొందడంలో రాష్ట్రాలు ఇబ్బందులను ఎదుర్కుంటున్నాయని మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.  రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పథకాలను రూపొందించడానికి స్వయం ప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం అందించాలని మంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు. తెలంగాణ కీలక దశలో ఉందని.. ఆర్థికంగా, వేగంగా అడుగులు వేస్తుందని అన్నారు.
గత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ. 6.85 లక్షల కోట్లకు పైగా రుణభాఠంతో రాష్ట్రం సతమతం అవుతుందని మంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. సెస్‌లు, సర్‌ ‌చార్జీల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. స్థూల పన్ను ఆదాయంలో రాష్ట్రాల వాటా తక్కువగా ఉందని చెప్పారు. సంక్షేమ పథకాలను బలోపేతం చేయడం కోసం మౌలిక సదుపాయాల కల్పన ద్వారా అంతరాలను పరిష్కరించడానికి అవకాశం ఉందని చెప్పారు. ఇది తెలంగాణ డిమాండ్‌ ‌కాదని..అన్ని రాష్టాల్రకు సంబంధించినదని మంత్రి మల్లు భట్టి విక్రమార్క వివరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం. చారిత్రక కారణాలవల్ల అసమాన అభివృద్ధి ఇక్కడ ఉందని చెప్పారు. రాష్ట్రానికి తలసరి ఆదాయం ఎక్కువ ఉన్నప్పటికీ సంపద, ఆదాయంలో భారీ తేడా ఉందని అన్నారు. ఇలాంటి అసమానతల మూలంగానే రాష్ట్ర సాధన ఉద్యమం ప్రారంభమైందని చెప్పారు. సమాన తలసరి ఆదాయం పరిష్కారానికి మౌలిక సదుపాయాలు, సంక్షేమ రంగంపై గణనీయంగా ఖర్చు చేయాల్సి ఉందని భట్టి వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page