చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని మరువలేం

వర్థంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌నివాళి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10 : ‌తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చిట్యాల ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె పోరాట స్ఫూర్తిని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌స్మరించుకున్నారు. తెలంగాణ మహిళాశక్తికి, బహుజన ధీరత్వానికి ఐలమ్మ ప్రతీకగా నిలిచారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో వారి పోరాట స్ఫూర్తి ఇమిడి వున్నదని తెలిపారు. ప్రజా వ్యతిరేక పాలనపై ధిక్కారాన్ని ప్రకటించిన చాకలి ఐలమ్మ ప్రతిఘటనా తత్వం ఎల్లవేళలా ఆదర్శమని కేసీఆర్‌ ‌చెప్పారు. ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగించే దిశగా ఆమె జయంతిని తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా అధికారికంగా నిర్వహించాలని గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక మన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ అని హరీష్‌ ‌రావు అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించారు. నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఆ యోధురాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికీ ఎంతో స్ఫూర్తి అని చెప్పారు. కేసీఆర్‌ ‌ప్రభుత్వం చాకలి ఐలమ్మ త్యాగాలకు గుర్తుగా వారి జయంతి, వర్థంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించి అమలు చేసిందని, భావితరాలకు ఆ మహనీయురాలి చరిత్ర తెలువాలని పాఠ్యాంశంగా పెట్టి గౌరవించిందని ఎక్స్ ‌వేదికగా ఆయన ట్వీట్‌ ‌చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page