పేదవర్గాలకు పెనుభూతంలా జిఎస్‌టి
నిర్మలా సీతారామన్ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే
తమిళనాడు రెస్టారెంట్ యజమాని క్షమాపణలపై అభ్యంతరం
తన బిలియనీర్ వ్యాపారులకు రెడ్ కార్పెట్..
చిరువ్యాపారులకు అవమానమన్న రాహుల్ గాంధీ
న్యూదిల్లీ, సెప్టెంబర్ 13 : జిఎస్‌టి గురించి ప్రశ్నిస్తే కేంద్ర ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతుందా..అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే మండిపడ్డారు. ఇటీవల ఆహార పదార్థాలపై జీఎస్టీ విషయంలో తమిళనాడుకు చెందిన ‘శ్రీ అన్నపూర్ణ రెస్టారెంట్’ యజమాని శ్రీనివాసన్ ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ప్రశ్నించి అనంతరం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆమెకు క్షమాపణలు చెప్పిన వీడియో సోషల్ వ్నిడియాలో వైరల్‌గా మారిన ఘటనపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది.
పెరుగుతున్న జీఎస్టీ గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ప్రశ్నిస్తూ..రెస్టారెంట్లు ఎదుర్కుంటున్న సవాళ్లను ఆ యజమాని తెలియజేశారు. అనంతరం ఆర్థిక మంత్రిని కలిసి క్షమాపణలు చెప్పిన వీడియో సోషల్ వ్నిడియాలో వైరల్‌గా మారింది. కాగా సదరు వ్యక్తిపై కేంద్ర ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడిరదని, ఇందుకు గాను సీతారామన్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. ఈ ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందింస్తూ..అన్నపూర్ణ రెస్టారెంట్ చైన్ యజమాని వ్యవహారంలో నిర్మలా సీతారామన్ తీరు అవమానకరమైనదని అన్నారు.
పేద మధ్యతరగతి వర్గాల పట్ల జీఎస్టీ పన్ను భూతంలా మారిందని, మోదీ ప్రభుత్వ చర్యలతో చిన్న వ్యాపారాల యజమానులు ఆర్థిక దాడులకు గురవుతున్నారన్నారు. అధికార అహంకారంతో వారీ విధంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. వస్తువులపై సరళమైన, ఏకరీతి, హేతుబద్ధమైన జీఎస్టీ అవసరమని కాంగ్రెస్ ముందు నుంచి చెబుతుందన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ…తన బిలియనీర్ స్నేహితులు నిబంధనలను వక్రీకరించడానికి, చట్టాలను మార్చడానికి, జాతీయ ఆస్తులను సొంతం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ప్రధాని వారికి రెడ్ కార్పెట్ పరుస్తారని, చిన్న వ్యాపారులు మాత్రం నోట్ల రద్దులు, పన్ను దోపిడులు, జీఎస్టీలను ఎదుర్కుంటూ..చివరికి అవమానాలు కూడా వారికే అంటూ దుయ్యబట్టారు.