జీఎస్టీపై హోటల్‌ ‌యజమాని వ్యాఖ్యలు

అతడితో బలవంతంగా నిర్మలా సీతారామన్‌కు క్షమాపణలు
•బిజెపి తీరుపై మండిపడుతున్న రాజకీయ నేతలు
•నిర్మలా సీతారామన్‌ ‌తీరుపై మండిపడ్డ స్టాలిన్‌
•బెదరించి క్షమాపణలు చెప్పించారన్న రాహుల్‌
•హోటల్‌ ‌యజమానులకు క్షమాపణలు చెప్పిన అన్నామలై

చెన్నై,సెప్టెంబర్‌14:‌తమిళనాడుకు చెందిన అన్నపూర్ణ హోటల్‌ ‌మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ శ్రీ‌నివాసన్‌ ‌కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు క్షమాపణలు చెప్పిన వీడియోపై ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతోంది. కాంగ్రెస్‌తో పాటు తమిళనాడుకు చెందిన ఇండియా కూటమి భాగస్వామ్య పక్షం డీఎంకే సైతం ఈ వీడియోపై బీజేపీని టార్గెట్‌ ‌చేశాయి. నిర్మలా సీతారామన్‌ ‌భయపెట్టి క్షమాపణలు చెప్పించుకున్నా రంటూ కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. తమిళనాడు సీఎం స్టాలిన్‌ ‌సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడుకు చెందిన ’శ్రీ అన్నపూర్ణ రెస్టారంట్‌’ ‌యజమాని శ్రీనివాసన్‌ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు క్షమాపణలు చెప్పడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ ‌స్పందించారు. హోటల్‌ ఓనర్‌తో క్షమాపణలు చెప్పించడం సిగ్గు చేటని అన్నారు.  ఓ సమావేశంలో జీఎస్టీపై మాట్లాడినందుకే అతడితో బలవంతంగా నిర్మలా సీతారామన్‌కు క్షమాపణలు చెప్పించారని మండిపడ్డారు. ఇది ఎంతో నిరుత్సాహకరమైన చర్య. కేంద్ర మంత్రి స్థాయిలోని వారు అలా చేయడం సిగ్గు చేటు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలను ప్రజలు చూస్తూనే ఉన్నారని స్టాలిన్‌ ‌పేర్కొన్నారు.
ఓ హోటల్‌ ‌యజమానితో క్షమాపణలు చెప్పించుకోవడం సిగ్గుచేటంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు బీజేపీ సైతం కాంగ్రెస్‌, ‌డీఎంకేకు కౌంటర్‌ ఇస్తోంది. శ్రీనివాసన్‌ ‌స్వచ్చందంగా తనకు తానుగా క్షమాపణలు చెప్పారని.. దీనివెనుక ఎలాంటి ఒత్తిడి లేదని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా నిర్మలా సీతారమన్‌కు హోటల్‌ ‌యజమాని క్షమాపణలు చెప్పిన వీడియో వైరల్‌ అవుతోంది. ఇదిలావుంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన కోవైలో సెప్టెంబర్‌ 12‌న జీఎస్టీపై సందేహాల నివృత్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. అన్నపూర్ణ హోటల్స్ ‌యజమాని శ్రీనివాసన్‌ ఈ ‌సమావేశంలో కొన్ని రకాల తినుబండారాలపై విధిస్తున్న జీఎస్టీపై తన అభ్యంతరాలను ఆర్థిక మంత్రికి తెలియజేశారు. స్వీట్స్‌పై 5 శాతం జీఎస్టీ విధిస్తుండగా.. నమ్‌కీన్స్ (‌హాట్‌)‌పై 12 శాతం జీఎస్టీ సబబు కాదన్నారు.
అలాగే బన్నుకు జీఎస్టీ లేకపోయినా క్రీమ్‌ ‌బన్నుకు 18శాతం జీఎస్టీ విధిస్తుండటంతో కొనుగోలుదారులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోతున్నామని.. రకరకాల జీఎస్టీలతో ఒకోసారి బిల్లు వేసే కంప్యూటర్‌ ‌తికమక పడుతోందని సరదాగా వ్యాఖ్యానించారు. ఆయన ప్రశ్నలకు నిర్మలా సీతారమన్‌ ‌సమాధానం చెప్పారు. అయితే ఈ వీడియో సోషల్‌ ‌డియాతో వైరల్‌ అయింది. సమావేశం ముగిసిన తర్వాత శ్రీనివాసన్‌ ‌నిర్మలా సీతారమన్‌ను కలిసి క్షమాపణలు చెప్పారు. ఓ గదిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ‌బీజేపీ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్‌ ఉం‌డగా అన్నపూర్ణ హోటల్స్ ఎం‌డీ శ్రీనివాసన్‌ ఉన్నారు. శ్రీనివాసన్‌ ‌క్షమాపణలు చెబుతున్న వీడియోను తమిళనాడు బీజేపీ కన్వీనర్‌ ‌బాలాజీ ఎంఎస్‌ ‌షేర్‌ ‌చేశారు. అసభ్యకర మైన ప్రసంగానికి శ్రీనివాసన్‌ ‌క్షమాపణలు చెప్పారన్న వ్యాఖ్యాన్ని వీడియోతో షేర్‌ ‌చేశారు. దీనిపై కాంగ్రెస్‌, ‌డీఎంకే సహా విపక్షాలు బీజేపీని టార్గెట్‌ ‌చేశాయి.
శ్రీనివాసన్‌ను బెదిరించి క్షమాపణలు చెప్పించుకున్నారని ఆరోపించారు. ఓ వ్యక్తి పట్ల బీజేపీ అగౌరవంగా వ్యవహరించిందని, ఆ పార్టీ అహంకారానికి ఇది నిదర్శమని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ విమర్శించారు. ఓ ప్రయివేట్‌ ‌సంభాషణకు సంబంధించిన వీడియో బయటకు రావడంపై బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షులు అన్నామలై ఎక్స్ ‌వేదికగా క్షమాపణలు కోరారు. బిజెపి తమిళనాడు శాఖ తరపున గౌరవనీయులైన హోటల్స్ ‌యజమాని శ్రీనివాసన్‌కు క్షమాపణలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ప్రయివేట్‌ ‌సంభాషణను మా కార్యకర్తలు సోషల్‌ ‌డియాలో షేర్‌ ‌చేసినందుకు చింతిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయమై శ్రీనివాసన్‌తో నేరుగా మాట్లాడానని.. ఈ వీడియో బయటకు రావడం పట్ల చింతిస్తునట్లు తెలిపానన్నారు. ఓ వ్యాపారవేత్తగా శ్రీనివాసన్‌ ‌దేశ ఆర్థిక వృద్ధికి గణనీయమైన తోడ్పాటును అందిస్తున్నారని ప్రశంసించారు. అయితే నిర్మలా సీతారమన్‌కు క్షమాపణలు చెప్పడంపై శ్రీనివాసన్‌ ‌స్పందించలేదు. బలవంతంగా చెప్పించారా.. లేదంటే ఇష్టపూర్వకంగా చెప్పారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page